You Are Here: Home » ఇతర » మయూర పర్వం

మయూర పర్వం

మయూరనృత్యం మనసును ఆహ్లాద పరుస్తుంది. అందానికి నిండైన ఉదాహరణ నెమలి. హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలిపింఛానికి ఉన్న విలువ అంతాఇంతాకాదు. పురాణేతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది. అందుేక మన జాతీయపక్షిగా నెమలిని గుర్తించారు. ఈనెల 31నాటికి ఈ గుర్తింపు లభించి యాభైఏళ్లరుుంది. భారతీయ నెమలి సంరక్షణకు నడుంకట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వేటగాళ్ల బెడదతో ఆ జాతి కష్టాల్లో పడింది.

23Colనెమలి మన జాతీయ పక్షి. సంస్కృతి, సంప్రదాయాల్లోనూ నెమలి భాగస్వామి. కృష్ణుడు, సుబ్రహ్మణ్యేశ్వరుని తలిస్తే నెమలి గుర్తుకురాక మానదు. పురాణకాలం నుంచే ప్రజలు నెమలిని ఆరాధిస్తున్నారు. దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల సంరక్షణలో నెమలి ఉందని భావిస్తున్నారు. అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో ఉండే లక్షణాలు తక్కువే. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు పుట్టకొచ్చాయి. జిత్తులమారి నక్క అని, కోతి చేేష్టలు అని ఏవిధంగా అంటామో అటాగే నెమలికి జగడాల మారి అని పేరు. ఇతర పసుపక్ష్యాదులతో అంత త్వరగా కలవవు. నెమలిని చూడగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడావాటి ఈకలు ఉంటాయి. నెమలి ఏటా ఆగస్ట్‌-సెప్టెంబర్‌ మాసాలలో ఒక నెల మాత్రమే తన ఈకలను రాల్చుతుంది. సహజంగా ఇవి ఒంటరిగా ఉండవు. బృందంగా తిరుగుతాయి. రాజస్థాన్‌, గుజరాత్‌లలో దుర్భిక్ష పరిస్థితుల మూలంగా నెమళ్లు దాదాపుగా అంతరించిపోయాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తర్రపదేశ్‌లో రోజూ వేలాది మయూరాలను చంపివేస్తున్నట్లు తెలుస్తోంది. నెమలి ఈకల వ్యాపారంలో దాదాపు 90 శాతం విదేశీ పర్యాటకులతోనే జరుగుతుంది. రెండు సంవత్సరాల క్రితం విదేశీ వాణిజ్య విభాగం నెమలిఈకల ఎగుమతిని నిషేధించింది .అప్పటివరకు సంవత్సరానికి 20 లక్షల నెమలి ఈకల ఎగుమతికి వాణిజ్య శాఖ అనుమతిస్తుండేది.

పంచమ అందం…
peacock1మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్లు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి. ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే పింఛం ఉంటుంది. మగ నెమళ్ల వలె ఆడ నెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పు ఉంటుంది. నెమలి పింఛాలలోని ఆ అద్బుత రంగులకు కారణం, వాటి ఈకల మీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్థాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు, నీలం రంగులు అవసరం – వీటిలో ఒక రంగు అమరిక వలన సృష్టించబడగా, రెండోది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పింఛాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి.

మగ పక్షి ఆడ పక్షిని ఆకర్షిండానికి పురి విప్పుతుంది. ఇంద్రధనస్సులా మెరిసే ఈ పురి కాంతివంతంగా, చాలా పొడవుగా ఉంటుంది. ఈ పింఛంలో సుమారు రెండు వందల ఈకలు ఉంటాయి. వీటిలో 170 ఈకలపైన కన్ను ఆకారం ఉంటుంది. కాబట్టి వీటిని నెమలి కన్నులని కూడా పిలుస్తారు. మిగిలిన 30 ఈకల చివర టీ ఆకారం ఉంటుంది. ఈ ఈకలన్నీ పురి విప్పిన నెమలి పింఛంలో ఒక క్రమపద్ధతిలో పొందికగా కనిపిస్తాయి. పురి విప్పినప్పుడు ఈ ఈకలపై ళ్లు వరుసగా ఉంటాయి. ఇతర జాతులతో జతకట్టడం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోదగినవి.

పురణాల్లో…
Peacockపడకగదిలో అద్భుతమైన సీనరీలను ఉంచడం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం కూడా చెపుతోంది. అయితే బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కనబడేటట్లు పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడని నమ్మకం. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యస్వామి వాహనం నెమలి అని పురాణేతిహాసాల కథనం.

గుడ్డులేకుండా జననం అసాధ్యం…
Peacock-(2)బ్రహ్మశ్రీ గుత్తికొండ వెంకటేశ్వరశర్మ రాసిన ‘ప్రాచీన తాళపత్ర నిధులలోని సంప్రదాయక శాస్తప్రీఠం’లో ఇలా రాసి ఉంది. కృష్ణుని సిగలో నెమలి పింఛం ఎందుకు ఉంటుందో తెలుసా? అపవిత్రంగాని శృంగారానికి పింఛం గుర్తు! సృష్టిలోని సమస్త ప్రాణులలో నెమలిది ఒక ప్రత్యేక జీవితం. నెమళ్లకు శారీరక సంభోగం లేదు. మగ నెమలి కంటి నీరు ఆడ నెమలి తాగి గుడ్డు పెడుతుందన్నది సారాంశం. మగనెమలితో సంపర్కం లేకుండానే ఆడనెమలి గుడ్లు పెడుతుందని, కేవలం మగ నెమలి కంటి నీరు తాగితేనే సృష్టికార్యం జరుగుతుందని, దానికి ప్రతీకగానే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడని, ఆయన సంపర్కం లేకుండానే పదహారు వేలమంది గోపికలకూ, ఒక్కొక్కరికి పదిమంది సంతానం కలిగించారని… ఇలాంటి అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయి. శ్రీకృష్ణునికీ, నెమలికీ ఉన్న ఈ సారూప్యానికి కారణంగానే ఆయన నెమలి పింఛం ధరించాడన్నది వారి వాదన. అయితే జీవశాస్తవ్రేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. శారీరక సంభోగం లేకుండా పుట్టుక అనేది లేదని వారు పేర్కొంటున్నారు. గుడ్డు పెట్టె ఆస్కారం మాత్రం ఉందని… మనం వాడే కోడి గుడ్డు ఇలాంటిదే అన్నారు. అయితే ఈ గుడ్డు పిల్లలుగా మారే అవకాశం లేదని వారు వివరిస్తున్నారు.

జాతులు…
DSC_0360కాంగో నెమలి : ఇది మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.భారత నెమలి : ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత, శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.ఆకుపచ్చ నెమలి : ఇది తూర్పు మయన్మార్‌ నుంచి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేట, నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటంతో అంతరించే దశకు చేరుకుంటోంది. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేర్వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.

ఆహారం..
Peacock-(2)నెమలి శాకాహారం, మాంసాహారం రెండిటినీ ఆహారంగా తింటుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను, కప్పలు వంటి ఉభయచరాలను తింటుంది. నెమళ్లు ఎక్కువగా గడ్డి మైదానాలలో నివశిస్తుంటాయి.

ఈకలతో..
నెమలి ఆకారంలో ఎన్నో వస్తువులు మార్కెట్‌లో లభ్యమవు తున్నాయి. నెమలి పిం ఛన్‌లో గల రంగులను కూడా ఫ్యాషన్‌ డిజైనర్లు సైతం వినియోగించు కుంటారు. నెమలి ఆకారంలో కుర్చీలు, మంచాలు, టేబుల్స్‌ తయారీ, ఆభరణాలు తయారుచేస్తుంటారు. ఈకలతో డ్రస్సులను తయారు చేసి డిజైనర్లు అబ్బురపరుస్తుంటారు. అలాగే విసనకర్రలు, బొకేలు, ఇంటి అలంకరణలోనూ ఈకలను వాడుతుంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top