You Are Here: Home » ఇతర » మన పాలుడు గోపాలుడు

మన పాలుడు గోపాలుడు

కత్తుక్కరవై క్కణఙ్గల్‌ పలకఱన్దు
శెత్తార్‌ తిఱలళయ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్‌
కుత్త మెన్ఱిల్లాద కోవలర్‌ దమ్‌ పొఱ్కొడియే!
పుత్తరవల్‌ గుల్‌ పునమయిలే! పోదరాయ్‌
శుత్తత్తుతోళిమా రెల్లారుమ్‌వన్దు నిన్‌
ముత్తం పుగున్దు ముగిల్‌ వణ్ణన్‌ వణ్ణన్‌ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వ ప్పెణ్ణాట్టి! నీ
ఎత్తుక్కు ఙ్గుఱంగుమ్‌ పొరుళేలో రెమ్బావాయ్‌

10దూడలు గల ఆవులే అయిననూ దూడలవలె లేత వయస్సులో నున్న ఆవుల మందలను పాలు పితుకగలవారును శత్రువునెదుర్కొని బలము చూపి యుద్ధము చేయగల వారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జన్మించిన బంగారుతీగా! పుట్టలో పాము యొక్క పడగవలెన్ను నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా! రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు. నీ వాకిలి ముందు చేరియున్నారు. నీలమేఘము వంటి వర్ణముగల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా! నీ నిద్రకర్ధమేమిటో తెలియజేయుము.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top