You Are Here: Home » ఇతర » మనోవైకల్యం లేకపోతే అంతా జయమే

మనోవైకల్యం లేకపోతే అంతా జయమే

జాలి, దయ, క్షమ, ఓర్పు వంటి లక్షణాలు ఆడవారికి మాత్రమే ఉంటాయన డంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ సద్గుణాల కలబోతలే మహిళలు. అదే విధంగా పట్టుదలకి కూడా వీరికి వీరే సాటి. అన్నిరంగాల్లోను విలక్షణమైన దృక్పథంతో పయనించే మహిళలు సమాజానికి వెన్నెముకలు. ఎంతటి మగావాడైనా, స్ర్తీ సహాయం లేనిదే రాణించలేడన్న వాస్తవం ఎన్నోసార్లు చాలా మందికి అవగతమైనదే. గృహిణిగా ఉన్నా, గురు పీఠాన్ని అధిష్టించినా ఆదరణతో అందర్నీ ముందుకు నడిపించగల శక్తి మహిళే. అదే కోణంలో అసాహాయులు అనుకుంటున్న వికలాంగుల సంరక్షణకి నడుంబిగించింది. జయశ్రీ రవీంద్రన్‌.

Untit3చెన్నైలోనిఎబిలిటీ ఫౌండేషన్‌కు వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ జయశ్రీ రవీంద్రన్‌. ఆమె వికలాంగులకు ఈ సంస్థను 1955లో స్థాపించారు. వీరి కోసం ఓ మ్యాగజైన్‌ను నడిపారు. ఎన్నో వ్యాపకాలకు మ్యాగజైన్లు వున్నాయి కానీ వికలాంగుల సమస్యలు, పరిష్కారాలకు ఎటువంటి మ్యాగజైన్‌ గతంలో లేదు. వీరికి అంగ వైకల్యం వున్నా, ఎన్నో విషయాలలో వారు సృజనాత్మ కంగా వ్యవహరిస్తారు.ఇంతకీ జయశ్రీ రవీందన్‌క్రు కూడా శారీరక లోపం వుంది. అందుకనే వికలాంగుల సమస్యలు ఆమె కన్నా ఎక్కువ ఎరికి తెలుస్తాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడ కుండా, తనకు చేతనైన సహాయాన్ని అందిద్దామని ముందు కొచ్చింది జయశ్రీ. వికలాంగులను సమాజం చిన్నచూపు చూస్తే ఆమె సహించదు. ఆదరించక పోయినా ఫర్వాలేదు కానీ, వీరిని ఏవగించుకోరా దంటుంది. ఎవరైనా వీరిని సాధారణ జనంగా పరిగణిస్తే జయశ్రీ సహించదు.

జయశ్రీ వికలాంగుల కోసం ఒక పత్రిక స్థాపించింది. ఈ మ్యాగజైన్‌ను ప్రారంభించినప్పుడు, చాలా మంది వృధాశ్రమగా భావించారు. నటి రేవతి, కేవిన్‌ కారే మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.కె. రంగనాధన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ రీజినల్‌ డైరెక్టర్‌ డా తంగ వేలు. ‘ఎబిలిటి ఫౌండేషన్‌’ ప్రధమ వార్షికోత్సవాన్ని జయశ్రీ ఘనంగా నిర్వహించారు. దృష్టిలోపం వున్నవారితో నాట్యం చేయించి షెభాష్‌ జయ! అనిపించుకుంది. నటి రేవతి జయశ్రీ నాట్యానికి కొరియోగ్రఫీ చేశారు. అంగవైకల్యులైన డ్యాన్సర్లు, రేవతి, జయశ్రీలకు నాట్యాన్ని రక్తి కట్టిస్తామని భరోసా యిచ్చారు.ఎబిలిటి ఫౌండేషన్‌ అధ్వర్యంలో వచ్చే సంవత్సరం ఫ్యాషన్‌ షోను నిర్వ హించాలని జయశ్రీ ప్రయత్నాలు ప్రారంభించింది. ర్యాంప్‌షోలో అందగత్తెలు పాల్గొనగా లేనిది వీరు పాల్గొంటే ఏంటీ తప్పు అనేదే జయశ్రీ ఆలోచన. చివరికి ర్యాంప్‌షో రానే వచ్చింది. దీనిలో ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌, ప్రముఖ గాయని ఉషా ఉత్తుప్‌ పాల్గొని షోకు మరింత వన్నె తెచ్చారు.

jaya1ఈ ర్యాంప్‌లో పాల్గొన్నది అంగవైకల్యులనే తలంపు ఎవరికీ రాలేదు. జయశ్రీ, ర్యాంప్‌ షోతో తృప్తి చెంద లేదు. ‘ఎంప్లాయ్‌ ఎబిలిటీ’ పేరుతో వికలాంగులకు ఉద్యోగావ కాశాలను కల్పిస్తోంది. ముందుగా కార్పొరేట్‌ సంస్థల అధికారులతో నిరుద్యోగ వికలాంగుల స్థితిగతుల గూర్చి ప్రస్తావించింది. తర్వాత జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించింది. వీరి కనీస అర్హతల గూర్చి, మానవతా కోణంలో స్పందించమని కార్పొరేట్‌ అధికారులను కోరింది. జాబ్‌ ఫెయిర్‌తో మంచి స్పందన లభించింది. జయశ్రీకి పిన్న వయసులో యాక్సిడెంట్‌లో వినికిడి శక్తి కోల్పోయింది. ఆమె ఏమీ భయపడక జీవితంలో తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. డ్యాన్స్‌, వీణ నేర్చుకుంది. ముందు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధికమించింది. ముఖ్యంగా ఫోన్స్‌ వస్తే, తనకు విన్పించదు కనుక సమాధానం చెప్ప లేదు.

దీనికి ప్రత్యామ్నాయం చేసుకుంది. ఒకసారి కంటి చూపు లేని ఒక అమ్మాయి బి.కాం చదవాలనుకొని తన అభిప్రాయాన్ని జయశ్రీకి వెల్లడించింది. జయశ్రీ ఆమెకు బ్రెయిలీలో పుస్తకాలు సమకూర్చింది. ఇప్పుడు ఆమె ఎంతో ధైర్యంగా బి.కాం చదవగల్గుతోంది. జయశ్రీ తన భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఎబిలిటి ఫౌండేషన్‌ సంస్థను విస్తరించనుంది. అసమానతలు లేని సమాజాన్ని ఆమె అభిలషిస్తుంది. అసాధ్యాలను సాధ్యం చేయటంపైనే దృష్టి సారించనున్నది.

వికలాంగులకు అనేక రంగాలలో అవకాశాలు కల్పించాలన్నదే జయశ్రీ లక్ష్యం. ఎబిలిటీ అంటే శక్తి హీనతకు ప్రత్యామ్నాయం కాదంటుంది. అంగవైకల్యులు సమర్థులే అని సమాజానికి ఆమె నిరూపించనున్నది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు జయశ్రీ రవీందన్‌ పట్టుదలతో ఉంది.

ఉద్యోగమేళా సందర్భంగా జయశ్రీతో..
ఈనేల 3-4 తారీకుల్లో నిర్వహించిన వికలాంగుల ఉద్యోగమేళా సందర్భంగా ‘మీరు నిర్వహిస్తున్న మేగజైన్‌కి ఎబిలిటీ అనే పేరు ఎందుకుపెట్టారు?’ అని అడిగితే, డిసబిలిటీకి, ఎబిలిటీ ఏమాత్రం వ్యతిరేకం కాదు. డిసబిలిటీ అంటే అశక్తత. అందులోనే శక్తత దాగివుంటుంది. అశక్తత అనేది ఒక నామవాచకం మాత్రమే. అదే నేను చెప్పదలచుకున్నది. శక్తత అనేదానికి పర్యాయమే సమర్ధత. మనం ఈ సమర్ధత అనేది అన్ని చోట్లా చూడవచ్చు. వైకల్యం అంటే అసమర్ధత కాదు. మనిషిలోని అంగవైకల్యాన్ని బట్టి ఎవర్నీ అసమర్ధు లుగా, అశక్తులుగా నిర్ణయించనవసరం లేదు. వారు చేయగల కార్యాలు సమర్ధవంతంగానే చేయగలరు. నేను 1955లో ఏక మహిళగా మాగజైన్‌ ప్రారంభించాను.

jayaaవినికిడి బలహీనత ఉన్న ఒక వ్యక్తిగా నేను ఎవరూ చేయలేని పనిని సంపూర్ణంగా సాధించాను. నా కుటుంబం కూడా నాకు ఎంతో అండదండలుగా నిలిచింది. నేను ఏమీ చేయలేను అనే ఆలోచన కూడా నాకు రానీయకుండా ఎంతో ప్రోత్సాహం అందించింది. నేను సంవత్సరాల తరబడీ ఎన్నో చోట్ల పనిచేసాను. నా జీవితంలో ఒక నటిగా, నృత్య కళాకారిణిగా చాలా పేరు సంపాదించాను. అంతమాత్రం చేత నేనేదో సాధించానని అనుకోవడం లేదు. నేను ఏవిధంగా రాణించానో అదేవిధంగా వికలాంగులందరూ సాధించాలని కోరుకున్నాను. ఈ మాగజైన్‌ కేవలం వికలాంగుల కోసమే కాదు. సమాజంలో ఉన్న అన్ని అంశాలు ఇందులో కూడా ఉంటాయి. ఇది అందరికీ ఉపయోగపడే పత్రిక. భారత దేశంలో 70 మిలియన్ల మంది వికలాంగులు ఉన్నారు.

కానీ, వారి స్వరాలు విన్నది లేదు, వారిని చూసినది లేదు. ఎందుకు వారు అంత కనిపించకుండా ఉంటున్నారు? అని నేను ఆలోచించాను. ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు, సమాజం వికలాంగుల గురించి సక్రమంగా స్పందించి వారికి కూడా సమాన ప్రతిపత్తిని కలగజేయాలని నేను ఒక బలమైన ఆశయంతో, ఎబిలిటీ ఫౌండేషన్‌ని స్థాపించాను. వీరికి కూడా అర్హతని బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఎన్నో సంస్థలతో మాట్టాడాను. అందుకు తగ్గట్టే నా సంస్థలో ఎన్నో విభాగాలు ఏర్పరచి తగిన శిక్షణ అందిస్తున్నాను. వారి ప్రతిభని కనబరిచే విధంగా దేశం మొత్తం మీద ఉన్న వికలాంగులకి వారు ఎంచుకున్న రంగంలో పోటీలు నిర్వహించి అవార్డులు కూడా అందుకునేలా చేస్తున్నాను.

10 సారి జరిగిన పోటీల్లో ఎ.ఆర్‌ రహ్మాన్‌ ద్వారా వీరికి ఆ అవార్డ్‌లు అందచేసాం. ఈ కార్యక్రమంలో నా టీమ్‌ ఎంతో సహకారం అందిస్తోంది. అదే విధంగా ఎన్నో సంస్థలు నా ఆలోచనకి స్పందించి ఈ ఉద్యోగ మేళలో పాల్గొని అర్హులైన వారికి ఆయా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఇది నాకెంతో గర్వకారణంగాను, ఆనందంగాను ఉంది. అంటూ మనసు విప్పి మాట్టాడింది జయశ్రీ రవీంద్రన్‌.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top