You Are Here: Home » సినిమా » పాటలు » మనసారా (2010)- నువ్విలా ఒకసారిలా

మనసారా (2010)- నువ్విలా ఒకసారిలా

పల్లవి :
నువ్విలా ఒకసారిలా
అరె ఏం చేశావే నన్నిలా
కోయిల ఎందుకో ఇలా
నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా
నువ్విలా… ॥

చరణం : 1
చూడాలి చూడాలి అంటూ
నీతోడే కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా
ఇంతందం ఇన్నాళ్ల నుండి
దాక్కుంటూ ఏమూల ఉంది
గుండెల్లోనా గుచ్చేస్తుంది సూదిలా
పేరే అడగాలనుంది
మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలని ఉంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది
కొంచెం కంగారుగుంది
అంతా చిత్రంగా ఉంది
ఈరోజు ఏమైందిలా
నువ్విలా… ॥

చరణం : 2
చంద్రుణ్ణి మింగేసిందేమో
వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా
తారల్ని ఒళ్లంతా పోసి
మబ్బుల్తో స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవత
మొత్తం భూగోళమంతా
పూలే చల్లేసిన ట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగిస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టూ
ఏంటో దొర్లేస్తున్నట్టూ
ఏదేదో అవుతుందిలా
నువ్విలా… ॥

చిత్రం : మనసారా (2010)
రచన : భాస్కరభట్ల
సంగీతం : శేఖర్ చంద్ర
గానం : కృష్ణచైతన్య

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top