You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » మధురాతిమధురం మాచ్‌ఖండ్గ విహారం

మధురాతిమధురం మాచ్‌ఖండ్గ విహారం

మధురాతిమధురం మాచ్‌ఖండ్గ విహారం

 

అందం అంటే అది ప్రకృతే! హిమగిరి సొగసులు… జడపాయల్లా విడిపోయే జలపాతాలు… పచ్చని కొండకోనలు… ప్రకృతి అందాలు ఎన్నో! ఇవన్నీ మాచ్‌ఖండ్‌ సొంతం…
townఉవ్వెత్తున ఎగిసిపడే ‘డుడుమా జలపాతం’ పరవళ్ళ మనసును పరవశింపజేస్తాయి. ఆంధ్ర – ఒడిశా రాష్ట్రాల పరిహద్దు ప్రదేశం అయిన ఈ ప్రకృతి అందాలు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఏడాది పాటు ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా రాష్ట్రాలను విడదీస్తూ పారే జలపాతం కార్తిక మాసంలో అదనపు అందాలతో కనిపిస్తుంది. ఈ ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది… ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్‌ వెలుగులను ప్రసాదిస్తున్న ‘మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం’

రొటీన్‌కు భిన్నంగా ఉండే టూర్‌ కావాలంటే అది మాచ్‌ఖండ్‌ అయితేనే బాగుంటుంది. విశాఖ జిల్లా జిల్లా అరకులోయ మీదుగా ప్రయాణం ప్రారంభించి… కొత్తవలస, శృంగవరపుకోటల మీదుగా చిలుకలగడ్డ గుండా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ఈ అందాల గనిని చేరుకోవచ్చు. వెళ్లే దారిలో ఓ మీరు దారితప్పే ప్రమాదం ఉంది. ‘మాచ్‌ఖండ్‌’లానే మరో ప్రదేశం ‘మత్స్యఖండ్‌’ కూడా ఉంది. ముందే ఎంక్వరీ చేసుకుంటే సరి లేదంటే… దారితప్పే ప్రమాదం ఉంది. ఆంధ్రా ఊటీ అరకు నుండి ప్రయాణం కావట్టి… ప్రయాణమంతా ఆహ్లాదంగా సాగిపోతుంది. దారిపొడవునా కొండకరివేపాకు చెట్లు ఉంటాయి. ఎంతకావాలంటే అంత కోసుకోవచ్చు. మధ్య మధ్యలో చిన్న చిన్న సెలయేళ్ళు… గిరిజన సంతలు… ప్రయాణాన్ని మరింత ఆహ్లాదపరుస్తాయి. ఇలా హాయిహాయిగా ఒడిశా సరిహద్దు చేరుకోవచ్చు.

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం…
ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం వరకు మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేం ద్రం చేరుకోవచ్చు. ఎక్కడో లోయలో ఉన్న విద్యుత్‌ కేంద్రానికి వెళ్లాలంటే ట్రాలీలు ఉంటాయి. మెట్ల దారి కూడా ఉంటుంది. అయితే ఆ దారిని ఎవ రూ ఉపయోగించరు. దారిలో డుడుమా జలపాతం అందాలను వీక్షిస్తూ… మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి చేరుకోవచ్చు. మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం భారత్‌లో అతిపెద్ద హైడ్రోపవర్‌ ప్రాజెక్టులలో ఒకటి. దూరంగా డుడుమా జలపాతం. అంత ఎత్తునుంచి పడుతూ రెండు కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉన్న ఆ దృశ్యాన్ని చూడాలే గాని వర్ణించి చెప్పలేం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top