You Are Here: Home » ఇతర » మత్తు వదులుధాం !

మత్తు వదులుధాం !

మత్తు గమ్మత్తులో ఊగిపోయే వారు తమ జీవితాలను, ఉజ్వల భవిష్యత్తును దానికి పణంగా పెడుతున్నారు. ధనార్జనపై కొంతమందికి గల దురాశ ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలాది మంది కొత్తగా ఈ మాదకద్రవ్యాల బారిన పడుతున్నారు. విద్యాసంస్థలు, పబ్‌లు, క్లబ్‌లు, ప్రైవేటు పార్టీలు, డ్యాన్స్‌ పార్టీలు లాంటివి ఈ అలవాటు విస్తరించేందుకు వేదికలుగా మారుతున్నారుు. రూ.వేల ఖరీదు చేసే మాదకద్రవ్యాలు ఒకవైపున, తక్కువ ఖరీదులో లభ్యమయ్యే చౌకరకం మత్తుపదార్థాలు మరోవైపున యువతను బలి తీసుకుంటున్నారుు. ఒకప్పుడు సహజ పదార్థాలతో తయారయ్యే మాదకద్రవ్యాలను ఇప్పుడు ల్యాబ్‌ కృత్రిమ పదార్థాలతో కూడా తయారు చేస్తున్నారు.


సెలెబ్రెటీలు కూడా మాదకద్రవ్యాల వలలో పడిపోతున్నారు. డ్రగ్స్‌ మాఫియా, సినిమా, ఆయుధ వ్యాపారం చెట్టపట్టాలు వేసుకోవడం అందరికీ ఆందోళన కలిగించే పరిణామం. మాదకద్రవ్యాలతో వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాదులు తమ ప్రణాళికలు అమలు చేసేందుకు వినియోగిస్తున్నారు. మాదకద్రవ్యాల బారిన పడ్డవారు దాని నుంచి బయటపడే అవకాశాలు అంతగా అందుబాటు లోకి రావడం లేదు. ఒకసారి వీటికి అలవాటు పడిన వారు ఆ ఊబిలో కూరుకుపోరుు వాటి వి్రేకతలుగా, అలవాటు లేని వారికి దాన్ని అలవాటు చేసే వారిగా కూడా అవతారం ఎత్తుతున్న దాఖలాలు ఉన్నారుు.

ఎందరో సెలెబ్రెటీలు…
హాలీవుడ్‌ మొదలుకొని టాలీవుడ్‌ వరకు సినిమారంగంతో డ్రగ్స్‌ మాఫియా తన అనుబంధాన్ని పెంచుకుంది. క్రీడారంగంతోనూ చెట్టపట్టాల్‌ వేసుకుని నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఇటీవలి కాలంలో కొంత మంది నటులు, వారి సమీప బంధువులు, స్నేహితులు మాదకద్రవ్యాల కేసుల్లో చిక్కుకున్నారు.
మత్తుమందుల వలలో చిన్నారులు…
మత్తుమందుల వ్యాపారులు తమ స్వలాభాల కోసం చిన్నారుల ను కూడా వదలడం లేదు. రకరకాల మత్తుపదార్థాలను వివిధ రూపాల్లో వారికి అలవాటు చేస్తున్నారు. గంజాయి, చరస్‌, వెైట్నర్‌ పౌడర్‌ లాంటివి ఈ మత్తుపదార్థాల్లో ఉంటున్నాయి.
అంతర్జాతీయ దినంగా పాటింపు
ఏటా జూన్‌26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. 1988 నుంచి కూడా ఇది మొదలెైంది. అంతర్జాతీయంగా మాదకద్రవ్యాల వ్యాపారం రూ. వేల కోట్లలో నడుస్తోంది. ప్రస్తుతం మాదకద్రవ్యాల పెై అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఉక్కుపాదం మోపుతున్నాయి. అంతర్యుద్ధా లు, నియంతల పాలనలో ఉన్న దేశాల్లో మాత్రం మాదకద్ర వ్యాల
వ్యాపారం జోరుగా సాగుతూనే ఉంది.

రవాణా స్థావరం నుంచి వినియోగ కేంద్రం దాకా…
ఒకప్పుడు భారతదేశం మాదకద్రవ్యాల రవాణాలో ట్రాన్సిట్‌ కేం్ర దంగా మాత్రమే ఉండేదని భావించే వారు. ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్‌ భారత్‌కు చేరుతాయని, అక్కడి నుంచి మరెక్కడికో వెళ్తా యని భావించే వారు. ఇప్పుడలా కాదు… భారత్‌లోనూ డ్రగ్స్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఐక్య రాజ్యసమితి 2011 లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌ డ్రగ్స్‌కు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ ప్రాం తంలో మొత్తం 40 టన్నుల వరకు మాదకద్రవ్యాలు ఉత్పత్తి అవుతుండగా, అందులో 17 టన్నులు భారత్‌లోనే వినియోగ మవుతున్నాయి.

13350వీటి విలువ 1.4 బిలియన్‌ డాలర్ల మేరకు ఉంటుంది. ఇక్కడి నుంచి మాదకద్రవ్యాలు బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలకు తరలిపోతున్నాయి. హెరాయిన్‌, డిజెైనర్‌ డ్రగ్స్‌, కొకైన్‌ లాంటివెన్నో భారతీయ మెట్రోలను ముంచెత్తుతు న్నాయి. ముంబయిలో గత ఏడాది 23 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వినియోగమయ్యే దానితో పోలిస్తే ఇది అత్యల్పం. ఒకప్పుడు భారతదేశం మాదకద్రవ్యాల రవాణాలో ట్రాన్సిట్‌ కేంద్రంగా మాత్రమే ఉండేదని భావించే వారు. ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్‌ భారత్‌కు చేరుతాయని, అక్కడి నుంచి మరెక్కడికో వెళ్తాయని భావించే వారు.

ఇప్పుడలా కాదు… భారత్‌లోనూ డ్రగ్స్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి 2011లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌ డ్రగ్స్‌కు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ ప్రాంతంలో మొత్తం 40 టన్నుల వరకు మాదకద్రవ్యాలు ఉత్పత్తి అవుతుండగా, అందులో 17 టన్నులు భారత్‌లోనే వినియోగ మవుతున్నాయి. వీటి విలువ 1.4 బిలియన్‌ డాలర్ల మేరకు ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top