You Are Here: Home » చిన్నారి » కథలు » మచ్చ

మచ్చ

SUDAY-STORYదీపావళి పండుగ వస్తోంది చీర కొనుక్కోవాలి. ఔను తను జమ చేసిన డబ్బు ఎంత ఉంటుంది చూసుకోవాలి. ఇలా ఎన్నోసార్లు గుర్తొచ్చినపుడల్లా అనుకుంటూనే ఉంది రుక్మిణి. పక్కంటి పద్మిని చీర చూసినప్పటి నుండి అదే కోరిక మనసులో నాటుకుపోయింది. రుక్మిణికి అసలు చీర చూడకపోయిన బావుండు అని ఒకసారి చూసిందే బాగెైంది అని ఒకసారి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంది అనుకుంటూనే ఉంది రుక్మిణి. ఆ సన్నివేశాన్ని మరోసారి తల్చుకుంది. ఆ రోజు ‘‘రుక్మిణీ… ఓ రుక్మిణి’’ పక్కింటి పద్మిని పిల్చుకుంటూ వచ్చింది. ఇంట్లోకి వచ్చి అపుడే కాస్త నడుం వాల్చిన రుక్మిణీ విసుక్కుంటూ లేచింది. అదేమీ లెక్క చేయకుండ ఆమె ముం దుకు వచ్చి చాపమీద కూర్చుంది పద్మిని. ‘‘ఏంటి పద్మీ ఏంటి హడావుడీ’’ వచ్చే నిద్రను ఆపుకుంటూ అడిగింది.

‘‘ఆఁ హడావుడే మన ఆడోళ్ళకు పండగ వస్తే ఏం హడావుడి ఉంటుంది. చీరలది, నగలది. ప్రస్తుతం మనలాంటి వాళ్లకు నగలు కొనడం కలలోని మాటే గాని నేను దసరా పండుగకి చీరకొన్నాను చూస్తావా’’. ‘చీర’ అన్న పదం వినగానే వెయ్యి ఏనుగుల బలం ఉత్సాహం వచ్చేసింది. అపుడు గమనించి పద్మిని చేతిలోని కవర్‌ను. ‘‘ఆఁ చీర చూద్దాం చూద్దాం పట్టు’’ ఉత్సాహంగా తానే కవర్‌ లాక్కుంది రుక్మిణి. పద్మిని అదే ఉత్సాహం చూడ్డానికీ వచ్చిందామె ఆతృతగా కవర్‌ లోపల దృష్టి సారించి చీర తీసింది రుక్మిణి. రాణి కలర్‌ చమ్కీలు పూసలు లతల పువ్వులుగా కుట్టిన చీర ‘‘అబ్బా ఎంత బావుంది’’ గుండెల మీద రెండు చేతులు పెట్టుకొని కళ్లు పెద్దవి చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ అంది రుక్మిణీ.

‘‘బావుందా… చాలా బావుందా’’. ఊరిస్తున్నట్టు అడిగింది. ‘‘ఔను చాలా బావుంది అసలు నాకు మాటలు రావడం లేదు ఎంత పద్మీ ఒకేసారి కొన్నావా… ఇన్‌స్టాల్‌మెంట్లో కొన్నావా’’ ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణ.ీ ‘‘ఒకేసారి కొన్నాను అషఫ్‌ షాపులో. ‘‘ఔనా డబ్బెలా’’. ‘‘ఎలా ఏంటి జమ చేశాను. మీ అన్నయ్య ఇంటి ఖర్చులకు ఇచ్చిన దాంట్లో పొదుపు చేసి కూరలు కట్‌ చేసి పచ్చళ్ళుపెట్టి పెరుగు బంగ్‌ చేసి మజ్జిగ పెట్టి బియ్యం మార్చి…’’ ఇలా ఎలాగెలాగోలో తను చేసి పొదుపు గురించి వర్ణించి వర్ణించి ‘నువ్వూ నేర్చుకో మొద్దు మొహమా’ అనే అర్థం వచ్చేలా చెప్పింది పద్మిని. కవర్‌ తీసుకుని పద్మిని వెళ్లిపోయింది. అప్పట్నుండి ‘పొదుపు’ అనే మూడక్షరాలు రుక్మిణిని ఊరించడం మొదలు పెట్టాయి.

తను కూడ ఆమె చెప్పినట్లుగానే ఉదయం పాల నుండి రాత్రి అన్నం వరకు అన్నిట్లో కోతలు మొదలుపెట్టింది. అత్తగారు, భర్త పిల్లలు ఏమన్నా విననట్లే. తనపని తాను చేసుకుపోతోంది రుక్మిణి. రుక్మిణి చిన్నప్పట్నుంచి చాలీ చాలనీ బ్రతుకునే చూసింది. కారణం ఆమె తండ్రి టీచర్‌గా ఉద్యోగం చేసేవారు ఇంట్లో బామ్మ, అమ్మ, అక్క, తమ్ముడు ఇంత మందికి ఆ ఒక్క జీతమే ఆధారం. అక్క బట్టలే చిన్నవి చేసి రుక్మిణికి తొడిగేవారు చివరికి కాన్పుకష్టమై రుక్మిణి అక్క చనిపోతే ఆమె భర్తకే రుక్మిణికి చేసిచ్చారు ఇలా చిన్నప్పట్నుంచి ఆమె జీవితం ఆమె కలలకు భంగం చేస్తూ గడిచిపోయింది. ఆమె భర్త చిన్న గుమస్తా ఆ వచ్చే జీతం బొటాబొటిగా సరిపోతుంటే ఆమె కోరికలుగానే ఉండిపోయాయి.

సంవత్సరానికి రెండు సార్లు బట్టలు కొనడమే గగనమయ్యేది వీధిలో వెళ్లే ఆడవాళ్లు మంచి మంచి చీరలు కట్టుకువెళుతుంటే కళ్లప్పగించి చూసేది రుక్మిణి. అక్క చీరలు ఉండడంతో ఆమెకు ఎక్కువ చీరలు అవసరం రాలేదు భర్త, అత్త ఎపుడు అదేమాట చెప్పివారు ‘‘మీ అక్క చీరలున్నాయి కదా ఇపుడే చీరలు ఎందుకు’’ ఆ మాట విన్నప్పుడల్లా ‘అక్కా… నీవు చచ్చి నన్ను సాధిస్తున్నావా’ అనుకుని కళ్లనీళ్లు తుడుచుకునేది రుక్మిణి. అదేమి ఖర్మో చిన్నప్పట్నుంచి అక్క బట్టలు పెద్దయ్యాక కూడా తనను వదలడం లేదని దిగులు పట్టుకుంది. చివరికి జీతం రాళ్లు ఆమె చేతికే చేరాయి. తనే బడ్జెట్‌ నాయకురాలు. అప్పటికి రెండొందల చీరకంటే పెద్ద మొత్తం ఆమెకు ఏ రోజు మిగల్లేదు.

ఈ రోజున పద్మిని చీర చూసిన తర్వాత ఐదువందల చీర తను కొనాల్సిందే, కట్టాల్సిందే అని నిర్ణయించుకుంది రుక్మిణి. పద్మిని చెప్పిన పొదుపు పథకం కూడా నచ్చింది దాన్నే ఫాలో కాసాగింది అసలు రుక్మిణ.ి ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో ఆమె భర్త, అత్త పిల్లలకు కూడా అర్థం కాలేదు. మెల్లగా రోజుకు ఇంత అంటూ ఖాళీ అవకాయ జాడీలో డబ్బు జమ చేస్తోంది. అది పండగ ముందు లెక్క పెట్టుకుని చీర కొనుక్కోవాలని రుక్మిణి ఆలోచన. ఆ రోజు ఎవరు లేని సమయం చూసి డబ్బు లెక్క పెట్టింది రుక్మిణి. నాలుగువందల డెబ్బ యి ఐదు. హమ్మయ్య తను అనుకున్న గమ్యం చేరబోతోంది. తన కోరిక తీరబోతోంది.

ఎలాగెైనా సరే పద్మిని కొన్న చీర లాంటిది తనూ కొనాలి. దీపావళి రోజున ఆ చీర కట్టుకుని కాసిన్ని కనకాంబరాలు ముడుచుకుని అక్క నగలు పెట్టుకుంటే అబ్బ అప్పుడే అదంతా జరిగిపోయినట్లు ఒళ్లు పులకరించిం ది రుక్మిణికి. అత్తయ్య కూడా చెప్పి ‘‘ఒసేయ్‌రుక్కు ఈసారి పండగకి నీ ఇష్టం వచ్చిన చీర కొనుక్కోవే మాకు లేకపోయిన పర్లేదు’’ అంది. పిల్లలు కూడా ‘‘మమ్మీ మాకు కాసిన్నీ టపాకాయలు కొనిచ్చేయ్‌ బట్టలు ఒద్దులే’’. ఏంటి అందరు కూడ బలుక్కున్నట్టు తనకు కో-ఆపరేట్‌ చేస్తున్నారు అనుకుని మురిసిపోతుంది రుక్మిణి. భర్త కూడా అదే మాట ‘‘రుక్కు నన్ను క్షమించు వచ్చే జీతం తక్కువ. ఏదో గుట్టుగా సంసారం నెట్టుకువస్తున్నావు.

ఒక్కరోజు కూడ నన్ను కష్టపెట్టలేదు. డబ్బు విషయంలో నీ ఇష్టం. ఏదెైన మంచి చీర కొనుక్కో నాకు అరిసెలంటే ఇష్టం అవి కాస్త చేసి పెట్టుచాలు. నేను బట్టలు కొనుక్కోనులే’’ అన్నాడు. ‘‘అవేం మాటలండి నేనొక్కదాన్ని కట్టుకుని మీకు లేకుండ చేస్తానా అందరి కోసం ఎలాగో అలాగ తంటాలు పడతానులేండి’’ అంది. ఎంతో సహనం తెచ్చి పెట్టుకుంటూ. నవ్వి ఆఫీసుకి వెళ్లిపోయాడు శ్రీధర్‌, అత్తకూడ పక్కింటి ముసలమ్మతో బాతాఖానీకి వెళ్లిపోయింది. పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయారు.
ఇంతలో ‘పోస్ట్‌’ అన్న శబ్దం వినబడి ఉలిక్కిపడి బెైటకి వచ్చింది రుక్మిణి. అప్పటికే కార్డ్‌ పడేసి పోస్ట్‌ మాన్‌ వెళ్లిపోయాడు. వాళ్లింట్లో ల్యాండ్‌లెైన్‌ కూడ లేకపోవడంతో ఉత్తరాలు సహజమే కాని, ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ కార్డ్‌ చేతిలోకి తీసుకుంది రుక్మిణి. అది ఆమె ఆడపడుచు కమలిని వ్రాసిన ఉత్తరం, సారాం శం అర్థం చేసుకునే సరికి రుక్మిణి మెదడు పనిచేయడం కాస్సేపు ఆగిపోయినట్లనిపించింది రుక్మిణికి.

ప్రియమైన వదినకి,
రుక్మిణి నమస్కరించి వ్రాయునది మిమ్మల్నం దర్నీ చూసి చాలా రోజులెైంది. ఒకసారి రావాలనుకుంటున్నాను. ఆయన చెప్పారు ఎలాగూ దీపావళి పండగ వస్తోంది కదా పండగకు వె ళ్లు అన్నారు. పండుగ రెండు రోజులుందనగా వస్తాను మిమ్మల్నందర్నీ చూడాలని విశాల్‌ కూడా అడుగుతున్నాడు. అన్నయ్యకు, అమ్మకు నా నమస్కారాలు పిల్లలకునా ముద్దులు మరి ఉంటాను.
ఇట్లు
‘‘కమిలిని’’

అయ్యో భగవంతుగా ఈ కమలిని ఇప్పుడే రావాలా తను వస్తే తనకు పండుగ పనుల్లో సహాయంగా ఉంటుంది కానీ, తను కొత్త చీర కట్టుకుని కమలినికి పెట్టకపోతే ఎలా. కమలిని ఏం అనుకుంటుంది. పిల్లలకంటే ఏదో ఓ బట్టలు తీసిచ్చిన పర్లేదు. కానీ, ఆడపడుచుకు చీర పెట్టక పోతే ఎలా కమిలినికి చీర పెట్టాలంటే తను మళ్లీ త్యాగం చేయాలి. కానీ, దానికి తన మనస్సు అంగీకరించదు. కాని ఎలా? ఎంత ఆలోచించినా ఏ మార్గం ఆమెకు తోచలేదు ఒక పని చేస్తే… ఎవరూ చూడకుండా ఒక చీర తీసుకుంటే ఆమ్మో ఎవరెైన చూస్తే ఏమైనా ఉందా? రకరకాలుగా ఆలోచించి నిట్టూర్పులు విడిచింది రుక్మిణి.
అత్తరాగానే కమిలిని వ్రాసిన కార్డ్‌ చేతికి అందించింది రుక్మిణి. ఆ కార్డ్‌ చదివి బోలెడు సంతోషించింది జానకమ్మ ‘‘చాల రోజులెైందే దాన్ని చూసి ఎలా ఉందో ఏమో బిడ్డ రాని రాని’’ అంటూ కొడుకు రాగానే ఆ వార్త చేర వేసింది కాఫీ తాగుతూ నింపాదిగా కార్డ్‌ చదివి తనూ ఆనందిచాడు శ్రీధర్‌.

ఇదేంటి అసలు విషయం ఎవరు ఆలోచించడం లేదు అనుకుని భర్తతో ఆమాటే అంది. ‘‘ఏంటండి కమలిని వస్తే చీర పెట్టొద్దు ఆ విషయం తమరు ఆలోచించరా ఏమిటి? తెగ సంబరపడిపోతున్నారు తనరాక కోసం’’. ‘‘అదంతా నా కు తెలీదోయ్‌ జీతం, బోసన్‌ నీకు తెచ్చిస్తాను నీ ఇష్టం’’. ‘‘అంతా నా మీదే పెట్టియ్యండి నేను దొరికాను అందరికీ’’ నుదుటిమీద చిన్నగా తట్టుకుంటూ వెళ్లిపోయింది రుక్మిణి.
మరుసటి రోజు జీతం, బోనస్‌ రుక్మిణి చేతిలో పడ్డాయి. ఇక పండుగ వారం రోజులు ఉంది. ఆ రోజు వెళ్లి పండుగకు కావాల్సిన సరంజాలు తెచ్చింది. మరుసటి రోజు బట్టలు అందరికీ కావాలని నిశ్చయించుకుంది.

నెల బడ్జెట్‌ తయారు చేసింది. కాని కమలిని చీర సమస్యగానే మిలిలిపోయింది. కాస్త తక్కువలోనే కొంటే తన చీరతో బేరీజు వేసుకుని తనని అపార్థం చేసుకుంటుంది. ఎలారా భగవంతుడా అర్థం కాలేదు. అందరికోసం బట్టలు తక్కువ రేటులోనే కొంది చివరికి విశాల్‌కు కూడ. ఇక మిగిలింది తమిద్దరి బట్టలే రెండు రోజులు తర్వాత అషఫ్‌ షాపుకు బెైల్దేరింది తన చీరకోసం. దారిలో తోట కూర తీసుకుని బుట్టలో వేసుకుంది. షాప్‌లో వెళ్లి కూర్చుని ఐదారువందల్లో చీరలు చమ్కీలవి చూపించమంది. చీరలు తెచ్చి చూపిస్తున్నాడు సేల్స్‌బాయ్‌. రుక్మిణి చివరగా కూర్చుంది షాపులో చాలమంది ఎవరి సందడిలో వారున్నారు. ఇంతలో సేల్స్‌బాయ్‌ సెల్‌ఫోన్‌ మోగింది ‘‘ఒక్క నిమిషం’’ అంటూ బెైటికి నడిచాడు. అంతే రుక్మిణి టక్కున అటూ ఇటూ చూసి చీర చేతికందుకుంది. తోటకూర కింద పెట్టేసింది.

గుండె దడ దడ కొట్టుకుంతోంది. అలవాటు లేని పని ఏమిటిది తను ఏం చేస్తోంది. కాని, తప్పదు త్వరత్వరగా ఏదో ఒక చీర తీసుకుని బిల్లు చెల్లించి బెైటపడింది రుక్మిణి. బెైటకొచ్చిన ఆమె కాళ్లు అదురుతూనే ఉన్నాయి. ఏం చేసిందీరోజు తప్పదు తప్పో ఒప్పో చేసేసింది. తన సమస్య సాల్వ్‌ అయింది. దారిలో ఎక్కడ ఆగకుండ వడివడిగా ఇంటికి వచ్చేసి ఓగ్లాసెడు నీళ్లు తాగి ఫ్యాన్‌ వేసుకుని ఈజీఛెయిర్లో జారగిలబడింది. అప్పటికి ఆమె ఆందోళన నెమ్మదించింది. పక్కింటి ముసలమ్మతో బాతాఖానీ ముగించి జానకమ్మ వచ్చేసింది ‘‘ఏమిటే రుక్కు వచ్చేశావా ఇంకా నీవు వచ్చేసరికి ఎంతోటైమ్‌ అవుతుందో అనుకున్నా తెచ్చేశావా నీ చీర’’. ‘‘ఆఁ’’ అంటూ కవర్‌ అందించింది. అత్తగారికి బిల్‌ మాత్రం ముందుగానే పర్స్‌లో దాచేసింది.

తోట కూర కింద ఒక చీరకవర్లో ఒక చీర ఏమిటో అర్థం కాలేదు. ఒకటి తనకని ఒకటి కమలికని నోటికొచ్చిన రేట్లు చెప్పేసింది కూతురికి చీర తెచ్చినందుకు ఆవిడ సంతోషించింది. కాస్సేపు తర్వాత వచ్చిన శ్రీధర్‌ ఇద్దరు ఆనందించారు. మరుసటిరోజు కమలిని వచ్చేసింది భోజనాలు, మాటలు అయ్యాక ఆమె తను తెచ్చిన బట్టలు అందించింది ‘‘సారీ వదిన నీ అంత మంచిచీర తేలేదనుకో ఏదో నాశక్తి కొద్దీ’’ తను తెచ్చిన బట్టలు చూపించడానికి సిగ్గుపడింది. ‘‘ఆరెఁ నీవెందుకమ్మ ఖర్చు పెట్టుకున్నావు. నీవు రావడమే మాకు బోల్డు ఆనం దం’’ శ్రీధర్‌, రుక్మిణి ఒకేసారి అన్నారు. పర్లేదులే, అన్నయ్య ఆయనకు బోనస్‌ వచ్చింది ఆయనే ఇచ్చారు డబ్బులు’’. ‘‘మరి, మీ ఆయ న రారా పండగకి’’. ‘‘వద్దామనే అనుకున్నారు ఏదో క్యాంప్‌ ఉందట రావడానికి కుదర్దు క్షమించమని చెప్పమన్నారు’’.

‘‘దాన్దేముందిలేమ్మ ఇంకోసారి రావచ్చులే’’ శ్రీధర్‌ చెప్పా డు. పిల్లలు ఆటల్లో పడ్డారు. వదిన, మరదలు పనులు ప్రారంభించారు. వాళ్లే కలిసి సున్నం పూసి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టారు. వం టలు ఏమేమ్‌ చేయాలో దాని గురించి మాట్లాడుకున్నారు. మరుసటి రోజు నరకచతుర్దశి. దీపాలు పెట్టారు. పిల్లలు కాసిన్ని టపాకాయలు అడిగి కాల్చుకోవడానికి బెైటికి వెళ్లారు. వాళ్లకు బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి కమలిని, రుక్మిణి అరిసెలు, కొబ్బరి పూరీలు తయారు చేసుకోసాగారు. జానకమ్మ అన్ని దగ్గరుండి చూసుకుంటోంది. రాత్రివరకు అన్ని పూర్తయ్యాయి. మరసటి రోజు దీపావళి పండుగ. ఎదురు చూసిన క్షణం రానే వచ్చేసింది. స్నానాలు వంటా – వార్పు పూర్తి కానిచ్చి శ్రీ మహాలక్ష్మి పూజ చేశారు రుక్మిణి, కమలిని. కొత్తచీరలు నగలు పెట్టుకుని తయారయ్యారు.

ఇంతలో కూతురు వచ్చి ‘‘మమ్మీ నీవురా టపాకాయలు కాల్చు’’ అంటూ మారాం చేసింది కమలిని చేయి పట్టుకులాగింది. ‘‘చీర మార్చుకుని వస్తాను’’ లేవబోయింది రుక్మిణి. ‘‘అపుడే వద్దు వదిన ఇంకాస్సేపు తర్వాత మార్చుకోవ చ్చులే కమలిని వారించింది. ‘‘సరే’’ అంటూ మందుకు రెండడుగులు వేసిన రుక్మిణి చీర హఠాత్తుగా అంటుకుంది ఆమె చాలా జాగ్రత్తగా చీర సర్దుకువస్తోంది. ఎలా జరిగిందో పొరపాటు జరిగిపోయింది. కమలిని గట్గిగా కేకలు వేసింది. టీ.వీ. చూస్తున్న శ్రీధర్‌ పరిగెత్తుకు వచ్చి ఏం తోచక అటూ ఇటూ పరిగెత్తి కంబళి పట్టుకువచ్చి ఆమె చుట్టూ కప్పాడు.

జానకమ్మ కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది. పిల్లలు బిక్కు బిక్కు మంటు చూడసాగారు. చీర బాగా కాలిపోయింది కాని రుక్మిణి ఒళ్లుకాలలేదు చేయిమీద అందులో కుడి చేయి మీద బాగ సెక తగిలి కమిలి బొబ్బ ఎక్కింది. నుదుటిమీద సెగతగిలి కమిలిపోయింది. ‘‘ఎంత ప్రమాదం జరిగిందే అమ్మా పండుగ రోజు నీకేదెైన ఐతే ఈ సంసారం ఏం కాను ఈ పిల్లలేమైపోను’’ రాగాలు తీసింది జానకమ్మ. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో భగవంతుడు చేసిన లీల కాదు అది తప్పుకు తగిన శిక్ష. ‘‘తప్పుకు తగిన శిక్ష’’ అర్థం అ యింది రుక్మిణికి. ఆమె గాయాలకు బర్నాల్‌ రాసి హాస్పిటల్‌కు పిలుచుకుపోయి టాబ్లెట్స్‌ వ్రా యించుకువచ్చాడు శ్రీధర్‌. మరసటి దినం వెళ్తానన్న కమిలిని మరో నాలుగురోజులుండి ధెైర్యం చెప్పి వెళ్లింది. ఆమె ఎంతో ఇష్టపడి కొన్న చీర ఎందుకు కాకుండ పోయింది.

కానీ, ఒక జీవతకాలానికి సరిపడ గుణపా ఠం ఈ సంఘటన నేర్పింది రుక్మిణికి. ఆమె ఆలోచన మారిపోయింది. చేతి మీద, నుదుటి మీ ద ఆ మచ్చే చూసుకున్నప్పుడు ఆ తప్పు గు ర్తుక వస్తుంది ‘‘కష్టపడనిదే ఏదీరాదు ఆయాచి తంగా వచ్చింది నిలవదు’’. ఇపుడు తను మిష న్‌ కుడుతోంది, ట్యూషన్స్‌ చెబుతోంది. అత్తగారితో ఆకులు కుట్టిస్తుంది. వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే కాకుండ రోజు సంపాయించింది ఎంతో కొంత దానం చేయడానికి జాడీలో డబ్బు దాస్తోంది ఆ ‘‘మచ్చ’’ఆమె జీవితాన్ని మార్చేసింది.

– ఎమ్‌.దాక్షాయని,
మదనపల్లి, చిత్తూరు జిల్లా
సెల్‌: 08571-221232

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top