You Are Here: Home » ఇతర » మగువుల మనోరవళి దీపావళి

మగువుల మనోరవళి దీపావళి

దీపావళి అనగానే అందరి కళ్ళలోను ఎంతో ఉత్సాహంతో కూడిన ఆనందజ్యోతులు వికసిస్తారుు. ఈ రోజు ప్రతి ఇల్లూ ఒక స్వర్గధామంలా వెలుగులు విరజిమ్ముతుంది. అజ్ఞానపు తిమిరాలు పటాసులతో పారిపోయే లా పటాపంచలు చేసి, జ్ఞానజ్యోతులు దివ్వెల రూపంలో ప్రకాశింపచేసుకునే పర్వదినం ఈ దీపావళి. పండు గలెకైనా, పబ్బాలెకైనా, పెళ్ళిళ్ళరుునా, పేరంటాలైన అసలు ఎటువంటి వేడకలెకైనా నలుగురు ఆడవాళ్ళ లేనిదే ఆ శుభకార్యం వెలవెలబోతూ ఉంటుంది. అటువంటిది పండుగల్లో మనం కోరుకునే ఆచార, వ్యవ హారాలకు ధీటుగా అలంకరించుకుని, సకుంటుంబంగా ఆ వేడుకని సమర్ధ వంతంగా జరపే శక్తి ఒక్క మహిళలేక సొంతం అనడంలో అతిశయోక్తిలేదు. వినాయక చవితి, దసరా, తర్వాత వెంటనే వచ్చే అతి పెద్ద పండుగ ఈ దీపావళి. ఈ దీపావళికి మహిళలు మరింత వెలుగులు చిందాలంటే కొన్ని సరదాలు కూడా పాటించాలి.

10aదీపావళి అనగానే అందరి కళ్ళలోను ఎంతో ఉత్సాహంతో కూడిన ఆనందజ్యోతులు వికసిస్తాయి. ఈ రోజు ప్రతి ఇల్లూ ఒక స్వర్గధామంలా వెలుగులు విరజిమ్ముతుంది. అజ్ఞా నపు తిమిరాలు పటాసులతో పారి పోయేలా పటాపంచలు చేసి, జ్ఞానజ్యోతులు దివ్వెల రూపంలో ప్రకాశిం పచేసుకునే పర్వదినం ఈ దీపావళి. పండుగలకైనా, పబ్బాలకైనా, పెళ్ళిళ్ళయినా, పేరంటాలైన అసలు ఎటువంటి వేడకలకైనా నలుగురు ఆడ వాళ్ళ లేనిదే ఆ శుభకార్యం వెలవెలబోతూ ఉంటుంది. అటువంటిది పండుగల్లో మనం కోరుకునే ఆచార, వ్యవహారాలకు ధీటుగా అలంకరించుకుని, సకుంటుంబంగా ఆ వేడుకని సమర్ధవంతంగా జరపే శక్తి ఒక్క మహిళలకే సొంతం అనడంలో అతిశయోక్తిలేదు. వినాయక చవితి, దసరా, తర్వాత వెంటనే వచ్చే అతి పెద్ద పండుగ ఈ దీపావళి. ఈ దీపావళికి మహిళలు మరింత వెలుగులు చిందాలంటే కొన్ని సరదాలు కూడా పాటించాలి.

దీపావళి ఉత్సవానికి బట్టలుకొనుక్కునే సరదా చాలామందికి ఉంటుంది. నిత్యం వాడకానికి ఉపయోగించే దుస్తుల దగ్గర్నుంచీ, పదివేలు ఖరీదు చేసే పట్టుచీరల వరకూ ఎవరి శక్త్యాను సారం వాళ్ళు షాపింగ్‌ చేసేస్తారు. అందులోను పూర్వంలా, వారం ముందు బట్టలు కొని కుట్టడానికి ఇవ్వడం, సైజులు తేడా చూసుకోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఈరోజుల్లో అవేవీ అవసరం లేకుండా అన్నీ రడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. యాంత్రికంగా మారిన జీవన శైలిలో కూడా 90% మంది పండుగ రోజు ఉదయాన్నే షాపింగ్‌కి బయలుదేరి, ఒక గంటలో షాపింగ్‌ పూర్తిచేసి వారికి నచ్చిన దుస్తులు తెచ్చి వేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ, కొత్త బట్టలు కొనేటప్పుడు వీలైనంత వరకూ చేనేత దుస్తులు ప్రిఫర్‌ చేయండి.

అందువల్ల చేనేత కార్మికుల కుటుంబాలకి పరోక్షంగా చేయూత నిచ్చినట్టు కూడా ఉంటుంది. టెర్లిన్‌, పాలియస్టర్‌ వంటి ఫైబర్‌ మెటీరియల్‌తో చేసేదుస్తులు దీపావళి రోజున వేసుకోవడం ప్రమాదం కూడా. ఆకర్షణలకి లొంగిపోకుండా మన స్తోమతకి తగిన దుస్తులు కొని ఆనందంతో వేడుక జరుపుకోవాలి.

ఆభరణాలు కొంటున్నారా..!
ఆడవారికి నగలంటే ఉన్నంత ఇష్టం ఇంక దేనిమీదా ఉండదనడం లో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఏ పండుగకైనా ఏదో ఒక బంగారు ఆభరణం కొని దానిని పూజలో ఉంచి ఆ తర్వాత ధరించడం అనేది మన భారతీయ సంస్కృతి, ఆచారం. అందులో కూడా ఒక పరమార్ధం ఉంది. బంగారు ఆభరణం కూడా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక లౌకికంగా ఆలోచిస్తే బంగారం సందర్భానుసారంగా పండగ పేరు చెప్పి చిన్నం ఎతె్తైనా సమకూర్చుకుంటూ ఉంటే అది కొన్నాళ్ళకి చాలా అవసరాలకి ఉపయోగపడుతుంది. దీనికి విలువ ఎక్కువగా ఉండటం చేత అవసరానికి అక్కరకొస్తుంది.

కనుక దీపావళి రోజున అనవసరమైన ఖర్చులు తగ్గించి ఏదేనా మన స్తోమతకి తగ్గట్టు బంగారంతో చేసిన చిన్న టాకెట్టయినా కొనడం ఆనవాయితీగా పెట్టుకుంటే, అది కూడా ఒక మదుపుగా, పొదుపుగా, పెట్టుబడిగా ఎంతో ఉపయోగపడుతుంది. మీరు బంగారం కొనదలచుకున్నప్పుడు అనుభవజ్ఞుల్ని, పెద్దవారినీ వెంట తీసుకువెళ్ళడం ఎంతైనా ఉత్తమం.

బంగారం లాంటి మాట…
1255బంగారం కొనే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రకటనల్లో చూసి మోసపోకుండా స్టాండర్డ్‌ బంగారు ఆభరణాల షాపులోనే కొనండి. మీరు కొన్న వస్తువుకి షాపు నుండి ఎటువంటి హామీలు ఇస్తున్నారో జాగ్రత్తగా వినండి. మీరు కొనే వస్తువు వివరాలతో, గ్యారంటీ ఉన్న సర్టిఫికెట్‌ని తప్పని సరిగా అడగండి.ఒకవేళ అటువంటివి మాషాపులో ఉండవు అయినా గ్యారంటీ ఇస్తు న్నాము అని ఆకర్షణీయమైన మాటలతో ఏషాపువాళ్లయినా మభ్యపెట్టినట్టు మాట్లాడితే ఎట్టిపరిస్థితు ల్లోనూ అక్కడ కొనుగోలు చేయకండి. కొనే వస్తువు మీద స్టాండర్డ్‌ గుర్తు ఉందాలేదా అనేది గమనించండి. కొను గోలు చేసేటప్పుడు షాపులో పక్కనున్న కొత్త వ్యక్తుల సలహాలు వినకండి. మీ సొంత నిర్ణయాన్ని పాటిం చండి. ఇలా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కావలసిన బంగారు ఆభరణాన్ని కొని, లక్ష్మీపూజలో ఉంచి సంతోషంగా ధరించండి.

పూజలు, నోములు
దీపావళి పండుగకి పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఎంతో ఉంది. ఈరోజు అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. సిరిసంపదలు కలగాలని, అందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో తులతూగాలనీ ఈ రోజు విశేష పూజలు జరుపు తారు. కొన్నచోట్ల దీపావళి రోజున శ్రీమహాలక్ష్మీదేవితో పాటు ధనాధిపతి అయిన కుబేరుడు కూడా పూజ లందుకుంటాడు. నిజానికి కుబేరుడు ధనాధిపతే కానీ, ధనం కాదు. మహాలక్ష్మి సాక్షాత్తుగా ధనమే. అందుకే ఆమెకు ధనలక్ష్మి అని పేరు. కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చాడనీ, దాన్ని తీర్చుకునేందుకే స్వామి భక్తుల నుంచి ధనాన్ని వసూలు చేసుకుంటూనే వున్నాడనీ ఒక కథ వుంది. వేంకటపతికే అప్పీయగల ఘనుడు కుబేరుడు.

విశ్రవోబ్రహ్మకూ, దేవపర్ణి అనే భార్య వల్ల పుట్టినవాడు కుబేరుడు. పుట్టగానే బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి, ధనాధిపతి అవుతాడని ఆశీర్వదించాడు. ఘోరతపస్సు చేసి, ధనాధిపత్యంతో పాటు దిక్పాలకత్వం కూడా సంపాదించుకున్నాడు కుబేరుడు. దక్షిణసముద్రమధ్యంలో విశ్వకర్మ నిర్మించిన లంకానగరమూ, పుష్పక విమానమూ కూడా పొందాడు. తరువాత రావణుడు వాటిని హరించగా, దేవేంద్రుని అనుగ్రహంతో అలకా పురిని నిర్మించుకుని, యక్షరాజయ్యాడు. ఉత్తరదిశకు కుబేరుడు అధిపతి కనుక ’ఉత్తరాధిపతి’గానూ అతన్ని పిలుచుకుంటారు. మహాశివభక్తుడైన కుబేరుణ్ని, దీపావళి రోజున కుబేరయంత్రాన్ని స్థాపించి పూజించుకుంటారు.

దీపావళి జాగ్రత్తలు
mlcpaదీపాల వెలుగులతో ఆనందాతిశయాలు నింపే ఈ సండుగ రోజున పిల్లలు, పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. పగలంతా కొత్త బట్టలు ధరించి బంధుమిత్రు లతో, విందువినోదాలతో గడిపినా, చీకట్లు ముసిరే సమయానికి దీపాలు పెట్టి తిమిరాంధకారాల్ని తరిమివేసే హడావిడిలో ఉంటాం. పిల్లలు బాణాసంచా వెలిగించాలన్ని కుతూహలంతో హడావిడి చేసేస్తూవుంటారు. ఈ సమయంలో చాలామంది తీసుకోవలసిన జాగ్రత్తల మీద దృష్టిపెట్టరు. దీపాలు పెట్టడం మొదలెట్టడానికి ముందే ఇంటిల్లిపాదీ కొత్త దుస్తులు విప్పి, కాటన్‌ దుస్తులు ధరించడం చాలా మంచిది.ఆడవారు పట్టు చీరులు, సిల్క్‌ చీరలు వంటివి ఏవి కట్టుకున్నా కొంగు గానీ, కాళ్ళ అంచులు గానీ కింద వెలిగిస్తున్న దీపాలకి తాకకుండా చూసుకోవాలి. ఇక వేళ అటువంటి ప్రమాదం ఎదురైతే కంగారు పడి పరు గులు తీయకండి.

అందువల్ల మంటలు ఎక్కువవుతాయి. అందుబాటులో ఉన్న నీళ్ళని వెంటనే మంటమీద దిమ్మరించేయండి. పిల్లలు పొడుగు ప్యాంట్లు విడిచి, పొట్టినిక్కర్లుగానీ, ఇప్పుడు మార్కెట్లో వస్తున్న బర్ము డాలను గానీ వేసుకోమనండి. పటాసులు కాల్చేటప్పడు చెప్పులు ధరించడం మర్చిపోకండి. పేలుడు పదా ర్ధాలు వెలిగించే టప్పుడు సాధ్యమైనంత దూరంగా పిల్లలుండేలా చూసుకోండి. టపాసులు వెలిగించే ముందు ఒక బకెట్‌తో నీళ్ళు ఆ ప్రదేశంలో ఒక పక్కగా ఉంచుకోండి. చంటి పిల్లల్ని దగ్గరుండి పటాసులు కాల్పిం చండి. పెద్దగా శబ్ధం వచ్చే టపాకాయలు, తారాజువ్వలు వెలిగించేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా గమనించండి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top