You Are Here: Home » ఇతర » మగువల మానసిక స్థైర్యం

మగువల మానసిక స్థైర్యం

‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి-ఆ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో’ అన్నాడు సినీకవి. కొన్ని విషయాలు చెప్పుకుని గుండెబరువు తగ్గించుకునేలా ఉంటాయి. మరి కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అయితే ఆడదాని నోట నూగింజ దాగదు అన్న విధంగా ఎటువంటి బాధనైనా మనసులోంచి దింపుకోగల శక్తి ఆడవారికే ఎక్కువ ఉందంటున్నారు పరిశీలకులు.

hedవారి సర్వేలో వెలుగు చూసిన నిజాల ఆధారంగా వారు ఏమంటున్నారంటే, ఆడవారికి మనోబలం అధికం. ఎటువంటి కష్టాన్నైనా తట్టుకోగలరు. అదే ఏదో ఒక సమస్యతో మగవాడు బాధపడితే ఆడపిల్లలా ఏడుస్తున్నాడు అంటూ ఏడ్చే మగవారిని గేలి చేస్తారు. కాని హాయిగా ఏడవగలగటమే ఆడవారికి శక్తి, వరం కూడా. తమ కష్టాన్ని చెప్పుకుని బరువు దించుకోలేకపోవటమే పురుషుడి బలహీనత. కష్టమైనా, సుఖమైనా ఆడవారు ఇట్టే బహిర్గతం చేస్తారు. కష్టమైతే ఏడ్చి గుండెల్లోని బాధను వదిలించుకుంటారు. మగవారు అలా కాదు. బాధను అదిమిపెట్టుకుని, దాన్ని ఎలా దిగమింగాలో లేక ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమై చివరికి ఆత్మహత్యకు పాల్పడతారు. బరువు దింపుకున్న మనసు ప్రశాంతత చెంది ఆడవారు మళ్ళీ యధావిధిగా నవకం సంతరించుకుంటారు. అందుకేనేమో, ఆడది నవ్వినా, ఏడ్చినా కూడా అందంగానే ఉంటుంది అంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top