You Are Here: Home » ఇతర » మకుటంలేని మహారాణి సాహిత్య సేవలో అనితా దేశాయ్‌

మకుటంలేని మహారాణి సాహిత్య సేవలో అనితా దేశాయ్‌

మహిళలకి ఉన్న సునిసిత పరిజ్ఞానం అపారమైది. వారు తలుచుకుంటే చేయలేని పనేదీ లేదని నిరూపిస్తు న్నారు. అన్ని రంగాల్లో తమదే పైచేరుు అని చాటిచెప్తూ ఎన్నెన్నో అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. పూర్వం రోజుల్లో మహిళలు విద్యాభ్యాసానికి ఎన్నో అడ్డంకులు ఉండేవన్న విషయం అందరికీ తెలిసినదే… అరుునా అటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దవారి అండదండలతో సాధికా రత సాధించిన మహిళలు లేకపో లేదు. నేటికీ మనం కొందర్ని ఆదర్శంగా చెప్పుకుంటున్నామంటే, అది వారు చేసిన కృషి ఫలితమే. అలాగే సాహిత్య రంగంలో మణిపూసలుగా మెరుస్తున్న మహిళా మణుల్లో అనితా దేశాయ్‌ కూడా ఒకరు. సాహిత్య పరంగా ఈమె చేసిన సేవలు అపారం. ఈమె పూర్తి పేరు అనితా మజుందార్‌ దేశాయ్‌.

anita7అనిత 24 జూన్‌, 1937లో ముస్సోరిలో జన్మించింది. తల్లి టోనీ నిమి, జర్మన్‌ వనిత తండ్రి డి.ఎన్‌. మజుందార్‌ బెం గాలీ వ్యాపారస్తుడు. ఆ కారణంగా అనిత ఇంటి వద్ద జర్మన్‌ మాట్లాడుతూ, బెంగాలీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా అనర్గళమైన పాండిత్యాన్ని సొంతం చేసుకుంది. స్కూలు విద్యం తా ఇంగ్లీషు మీడియంలో ఉండటంచేత ఈమె సాహిత్యం అం తా ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా సాగింది. ఇంగ్లీష్‌లో ఈమె సాహిత్య రచన తన ఏడవ ఏటనుంచే మొదలయ్యింది. అలాగే ఈమె రాసిన మొదటి కథ తన 9వ ఏటనే ప్రచురితమయ్యిందంటే ఆశ్చర్యం కలగకమానదు. అంత చిన్న వయసులోనే రచయి త్రిగా వెలుగులోకి వచ్చింది. ఈమె విద్యాభ్యాసం ఢిల్లీలోని క్వీన్‌ మేరీస్‌ హయ్యర్‌ సెకండదీ స్కూల్లో సాగింది. ఆ తర్వాత 1957లో ‘మెరిండా హౌస్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ’ ఢిల్లీలోనే ఇం గ్లీష్‌ లిటరేచర్‌లో బి.ఎ డిగ్రీ పొందింది. ఇలా చదువుకుం టుండగానే అశ్విన్‌ దేశాయ్‌తో వివాహం జరిగింది.

జీవిత గమనం
నిత్య జీవితంలో గృహిణిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తూనే, అలిసిపోకుండా తన సాహిత్య ప్రపంచంలో కూడా మకుటం లేని మహారాణిగా ఎన్నో అద్భుత రచనలు చేసింది. ఈమె మొట్టమొదటి నవల ‘క్రై ది పీకాక్‌’ 1963లో ప్రచురింప బడింది. 1984లో ఈమె నిర్బంధంలో నలుగుతున్న ఒక ఉర్దూ కవి నేపథ్యంలో రాసిన ‘ఇన్‌ కష్టడీ’ పుస్తకానికి బుకర్‌ పురస్కా రం లభించింది. 1993లో మస్సాచుసెట్స్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సృజనాత్మక రచనల ఉపాద్యాయినిగా చేసింది. ఈమె 2004 రాసిన జిగ్‌జాగ్‌ వే, 20వ శతాబ్ధపు మెక్సికో మరి యు ఈ మధ్య విడుదలైన ‘ది ఆర్టిస్ట్‌ ఆఫ్‌ డిసప్పియరెన్స్‌’ 2011లో వచ్చాయి . అనితా దేశాయ్‌ అధ్యాపకురాలిగా మౌంట్‌ హోలియక్‌ కాలేజీలోను, బరూచీ కాలేజీలోను, స్మిత్‌ కాలేజీలో పరవీ బాధ్యతలు నిర్వహించింది.

సినీ ప్రస్థానం
anita1993 మర్చంట్‌ ఐవరీ ప్రొడక్షన్స్‌ బేనర్‌ మీద నిర్మించిన ఈమె నవల ’ఇన్‌ కష్టడీ’కి 1994కి గాను భారత రాష్ర్టపతి బంగారు పథకాన్ని పొందింది. ఈచిత్రానికి ఇస్మాయి ల్‌ దర్శకత్వం వహించగా, షారూక్‌ హుస్సేన్‌ స్క్రీన్‌ ప్లే బాధ్యతలు నిర్వహిం చాడు. ఈ చిత్రంలో శశి కపూర్‌, షబనా అజ్మీ, ఓం పూరీ ముఖ్యతారాగణంగా నటించారు. ఉత్తమ చిత్రంగా ఇది బహుమతిని పొందడమే కాకుండా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేకతని నిలబెట్టు కుంటూ, సాహిత్య రంగంలో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు చేరుకుంది. 70 ఏళ్ళ వయసు పైబడినా మొక్కవోని దీక్షతో తన రచనా వ్యాసంగాన్ని మరింత ముందుకు నడిపిస్తూనే ఉంది. నేటి తరం యువతకే కాకుండా మేమేమి చేయగలం అనుకుంటూ నిస్సత్తువతో కృంగిపోతున్న వయోవృద్దులకి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తోంది అనితా దేశాయ్‌.

అవార్డులు

 • 1978 ‘వినిఫ్రెడ్‌ హోల్ట్‌బై మెమోరియల్‌’ బహుమతి, ‘ఫైర్‌ ఆన్‌ ది మౌంటెన్‌’
 • 1978 ‘సాహిత్య అకాడమీ’ అవార్‌,్డ ‘ఫైర్‌ ఆన్‌ ది మౌంటెన్‌’
 • 1980 ‘బుకర్‌’ ప్రైజ్‌, ‘క్లియర్‌ లైట్‌ ఆఫ్‌ డే’
 • 1983 ‘గార్డియన్‌ చిల్డ్‌న్స్‌ ఫిక్షన్‌’ బహుమతి, ‘ది విలేజ్‌ బైది సీ’
 • 1984 బుకర్‌ బహుమతి, ‘ఇన్‌ కష్టడీ’
 • 1993 నెయిల్‌ గన్న్‌ బహుమతి
 • 1999 బుకర్‌ బహుమతి, ‘ఫాస్టింగ్‌, ఫీస్టింగ్‌’
 • 2000 ‘అల్‌బర్టో మొరావియా బహుమతి’ సాహిత్య సేవలకి. ఇటలీలో
 • 2003 ‘బెన్సన్‌ పథకం’ సాహిత్య సేవలకి.

  అనిత రచనల్లో ముఖ్యమైనవి

 • ‘ది ఆర్టిస్‌ ఆఫ్‌ డిసప్పియర్‌’ 2011
 • ‘ది జిగ్‌జాగ్‌ వే’ 2004
 • ‘డైమండ్‌ డస్ట్‌ అండ్‌ అదర్‌ స్టోన్స్‌’ 2000
 • ‘ఫాస్టింగ్‌, ఫీస్టింగ్‌’ 1999
 • ‘జర్నీ టు ఇథాకా’ 1995
 • ‘బౌమ్‌ గార్ట్నర్స్‌ బోంబే’ 1988
 • ‘ఇన్‌ కష్టడీ’ 1984
 • ‘ది విలేజ్‌ బై ది సీ’ 1982
 • ‘క్లియర్‌ లైట్‌ ఆఫ్‌ డే’ 1980
 • ‘గేమ్స్‌ ఎట్‌ ట్విలైట్‌’ 1978
 • ‘ఫైర్‌ ఆన్‌ ది మౌంటెన్‌’ 1977
 • ‘కేట్‌ ఆన్‌ ఎ హౌస్‌ బోట్‌’ 1976
 • ‘ది పీకాక్‌ గార్డెన్‌’ 1974
 • ‘బైబై బ్లాక్‌ గార్డెన్‌’ 1974
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top