You Are Here: Home » చిన్నారి » మందంగా ఉండే రసాయన మూలకం ఏది?

మందంగా ఉండే రసాయన మూలకం ఏది?

రసాయనశాస్త్రంలోని మూలకాల గురించి అధ్యయనం చేస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తుంటాయి. ‘ఆస్మియం’ అనే మూలకానికి ఒక ప్రత్యేకత ఉంది. అది సహజ మూలకాలన్నిటిలోకెల్లా మందమైనది. దీని పరమాణు సంఖ్య 76. ఇది ప్లాటినం కుటుంబానికి చెందిన లోహం. ఇది లెడ్ కన్నా రెండు రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ఇది మందంలో రెండో స్థానంలో ఉన్న ఇరిడియం కన్నా కాస్త ఎక్కువ మందంగా ఉంటుంది.

ఈ మూలకాన్ని బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త స్మిత్‌సన్ 1803లో కనుగొన్నాడు. ఆస్మియం సాంద్రత ఒక ఘనపు (క్యూబిక్) సెంటీ మీటర్‌కి 22.59 గ్రాములు ఉంటుంది. ఆస్మియంతో కనుక ఒక ఫుట్‌బాల్‌ను తయారుచేస్తే దాని బరువు సుమారు 126 కిలోలు ఉంటుంది. అంటే దాదాపు ఇద్దరు వ్యక్తుల బరువన్నమాట. ఆస్మియం చాలా గట్టిగా కూడా ఉంటుంది. అందుకే దీనిని ఇంక్ పెన్ నిబ్స్ లాంటి వాటి తయారీకి ఉపయోగిస్తుంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top