You Are Here: Home » సఖి » సీరియల్స్ » మంత్రివర్గ విస్తరణ?

మంత్రివర్గ విస్తరణ?

manన్యూఢిల్లీ :ముంచెత్తుతున్న అవినీతి ఆరోపణలు .. ప్రభుత్వం పని తీరుపై ఇంటా బయట వెల్లువెత్తుతు న్న విమర్శలు.. ప్రభుత్వం విధాన వైకల్యంతో చచ్చుబడిపోయిం దంటు జాతీయ అంతార్జాతీయ మీడియాలో నేరుగా ప్రధానినే బాధ్యు డిని చేస్తూ వస్తున్న వార్త కథనాలు మరీ ముఖ్యంగా ప్రధానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఆర్థికవేత్తగా వున్న గుర్తింపు, గౌరవం మసకబారి పోతున్న వై నం.. తలవంపులు.. ఈ నేపత్యంలోనే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లోని అర్థిక వేత్త జూ లు విదిల్చారు. రాజకీయ సంకెళ్లను చేదించు కుని సంస్కరణల వేగం పెంచారు. డిజిల్‌ ధరల పెంపు, సబ్సిడి వంట గ్యాస్‌పై పరిమితులను విధిస్తూ కఠి న నిర్ణయం తీసుకొన్నారు. ఆదే ఊపులో రిటైల్‌ రంగంలో విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటంతో సహా పలు సంస్కరణలకు తలుపులు తెరచారు.

మిత్ర పక్షాలు, మ ద్దతునిస్త్తున్న పార్టీలు త్రీవంగా వ్యతిరేకిస్తున్నపటికి ఆదే సంస్కరణల బాటలో ముందుకు దూసుకుపోయేందుకు సిద్దమయ్యారు. అలాగే నూతన దృక్పథానికి అనుగుణంగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు సై అంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగే చివరి భారీ విస్తరణగా పేర్కొంటున్న ఈ కసరత్తులో పని తీరుకు, సామ ర్థ్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి నలుగురు అగ్ర నేతలు – రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని, ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం, హోమ్‌ శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ కొనసాగు తారు. ఇక పార్టీలో ప్రభుత్వంలో పెద్ద బాధ్యతలకు సిద్దమని ప్రకటించిన రాహుల్‌ గాంధీ ఈ సారి కూడా ప్రభుత్వంలో చేరకపోవచ్చునని ఆ వర్గాలు సూచిం చాయి.

asgరెండు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులకు ఇక ఒకటే శాఖను ఇస్తారు. శుక్రవారం సంస్కరణలను ప్రకటించిన తరువాత పంథాను సరిదిద్దేందుకు ప్రధాని చేస్తున్న ప్రయత్నం ఇది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ను తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. అలాగే ఇంతవరకు సహాయ మంత్రులుగా వున్న జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌ లాంటి వారికి పదోన్నతి లబించే ఆవకాశం వున్నట్లు తెలు స్తోంది. మరోవంక సీనియర్‌ మంత్రులు కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆవకాశం వున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. ఈ సారి విస్తరణ వ్యవహరంలో పూర్తిగా మన్మోహన్‌ ముద్ర వుండే అవకశాలను కూడా కొట్టివేయలేమని అంటున్నారు.

శాఖల కత్తెర
వీరప్ప మొయిలీ నుంచి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ
సల్మాన్‌ ఖుర్షీద్‌ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కోల్పోవచ్చు
గులామ్‌ నబీ ఆజాద్‌, జైరామ్‌ రమేష్‌, వాయలార్‌ రవిలను పార్టీ బాధ్యతలకు మార్చవచ్చు

ఉద్వాసనలు?
్వ సుబోధ్‌ కాంత్‌ సహాయ్‌ని ,శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ను తొలగించవచ్చు
బేణి ప్రసాద్‌ వర్మ, అగాథా సంగ్మాలకు ఉద్వాసన పలకవచ్చు
జికె వాసన్‌ నౌకాయాన మంత్రిత్వశాఖను కోల్పోవచ్చు

ప్రమోషన్‌
జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌లకు పదోన్నతి లభించవచ్చు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి మరొక సహాయ మంత్రి (ఎంఒఎస్‌) రావచ్చు డెరెక్‌ ఓబ్రియెన్‌, కునాల్‌ ఘోష్‌ ఈ పదవికి అభ్యర్థులు రెహ్మాన్‌ ఖాన్‌కు మైనారిటీ వ్యవహారాల శాఖ లభించవచ్చు ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ర్ట ముఖ్యమం త్రులకు క్యాబినెట్‌ పదవులు లభించవచ్చు
దీపా దాస్‌మున్షీకి అవకాశం
మనీష్‌ తివారిని చేర్చుకోవచ్చు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top