You Are Here: Home » భవిత » విద్య » మంత్రివర్గంలో ప్రధాని తర్వాత స్థానం?

మంత్రివర్గంలో ప్రధాని తర్వాత స్థానం?

1.భారత ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు?
(గ్రూప్ -1, 2008)
ఎ) రాష్టప్రతి
బి) ప్రధానమంత్రి
సి) ఆర్థిక మంత్రి
డి) అంతరంగిక వ్యవహారాల మంత్రి

2.ప్రణాళిక సంఘంలో పదవీరీత్యా సభ్యులుగా కొనసాగేది?
ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి
బి)కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు
సి) కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి
డి)కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి

3.రాజ్యాంగంలోని ఏ ప్రకరణ జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోంది?
(గ్రూప్ -1, 2008)
ఎ) 365
బి) 370
సి) 350
డి) 390

4.కింది వాటిలో సరికానిది
ఎ)సలహా సంఘం – బీ.యన్.రావు
బి) కేంద్ర అధికారాల సంఘం – నెహ్రూ
సి)రాష్ట్ర అధికారాల సంఘం- రాజేంద్రప్రసాద్
డి)ప్రాథమిక హక్కుల సంఘం – సర్దార్ పటేల్

5.జతపరచండి
1) రాజ్యాంగ సవరణ విధానం
2) రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి
3) రాష్టప్రతిని తొలగించే పద్ధతి
4) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
ఎ) ఫ్రాన్స్
బి) అమెరికా
సి) ఐర్లాండ్
డి) దక్షిణాఫ్రికా
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

6.కింది వాటిలో సరైంది?
ఎ)భారతరాజ్యాంగం అతుకుల బొంత- ఐవర్‌జెన్నింగ్స్
బి)భారత రాజ్యాంగం 1935 చట్టం జిరాక్స్ కాిపీ- కె.టి.షా
సి)భారత రాజ్యాంగ పరిషత్ గుర్తుకు అనుగుణంగా రూపొందించారు-హెచ్.వి.కామత్
డి) పైవన్నీ సరైనవే

7.రాజ్యాంగ ప్రవేశికను స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాల ప్రతిరూపంగా పేర్కొన్నవారు?
ఎ) కె.యం. మున్షి
బి) మహాత్మాగాంధీ
సి) బీఆర్. అంబేద్కర్
డి) గోపాలస్వామి అయ్యంగార్

8.జతపరచండి?
1)మైనార్టీలు
2) ఆంగ్లో ఇండియన్లు
3) హిందు మహాసభ
4) మహిళలు
ఎ) హెచ్.సి ముఖర్జీ బి) మోడి
సి) ప్రాంక్ ఆంథోని డి) ఎస్.పి. ముఖర్జీ
ఇ) సరోజినీ నాయుడు ఎఫ్) హంసమెహత
ఎ) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఎఫ్
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-ఎఫ్
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎఫ్

9.రాజ్యాంగ ప్రవేశికలోని ఎక్కువ అంశాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాం?
ఎ)అమెరికా
బి) ఫ్రెంచ్
సి) ఐర్లాండ్
డి) రష్యా

10.పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం?
ఎ)మంత్రిమండలి సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలతో పనిచేయడం
బి)రాజ్యాంగాధినేత, ప్రభుత్వాధినేత వేర్వేరుగా ఉండటం
సి)రాజ్యాంగాధినేత నామమాత్రపు అధికారి గా, ప్రభుత్వాధినేత వాస్తవ అధికారిగా కొనసాగడం
డి)శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం

11.సాంప్రదాయ హక్కులుగా పేర్కొనేవి?
ఎ)సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు
బి)స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు, విద్య, సాంస్కృతిక హక్కు
సి)మత స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు
డి)స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు, సమాన త్వపు హక్కు

12.ప్రాథమిక విద్యను నిర్బంధ విద్యగా గుర్తించి రాజ్యాంగంలో 11వ విధిగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
(సివిల్స్-2003)
ఎ) 85
బి) 86
సి) 92
డి) 93

13.ఆదేశిక సూత్రాలు సక్రమంగా అమలు చేస్తే భారతదేశం అనతికాలంలోనే భూతలస్వర్గం మవుతుందిని పేర్కొన్నవారు?
ఎ)జస్టిస్ హిథయతుల్లా
బి) జస్టిస్ యం.సి ఛాగ్లా
సి) ప్రొ.కె.టి.షా
డి) జస్టిస్ యం.సి. సెతల్‌వాడ్

14.భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రభుత్వాలు నియంత్రించాలి?
ఎ) 41
బి) 45
సి) 47
డి) 48

15.భారత రాజ్యాంగం అనుసరించి సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ ఏ విషయంలో నియంత్రించొచ్చు?
(గ్రూప్ – 2, 2000)
ఎ) దేశ రక్షణ దృష్ట్యా
బి) విదేశీ సంబంధాల దృష్ట్యా
సి) కోర్టు ధిక్కరణ విషయంలో
డి) ప్రజా భద్రత దృష్ట్యా

16.పార్లమెంట్‌లో ఏ సభలోనైనా దాని కార్య కలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్న రాజ్యాంగ పర అధికారి? (గ్రూప్ – 2, 2000)
ఎ) ప్రధాన ఎన్నికల కమిషనర్
బి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
సి) భారత ఉపరాష్టప్రతి
డి) అటార్నీ జనరల్

17.రాజ్యాంగంలో న్యాయసమీక్షకు అవకాశం కల్పించే ఆర్టికల్?
(గ్రూప్ – 2బి, 1993)
ఎ) 12
బి) 13
సి) 14
డి) 15

18.ఎక్కువమందిని ముఖ్యమంత్రులు చేసిన జిల్లా?
ఎ) కర్నూల్
బి) అనంతపురం
సి) గుంటూరు
డి) కరీంనగర్

19.మనరాష్ట్రంలో విధాన పరిషత్ చైర్మన్, విధాన సభ స్పీకర్ రెండు పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తి ?
ఎ) బి.వి. సుబ్బారెడ్డి
బి) అయ్యదేవర కాళేశ్వర రావు
సి) మాడపాటి హనుమంతరావు
డి) పిడతల రంగారెడ్డి

20.రాష్ట్రంలో మండల వ్యవస్థ ప్రవేశ పెట్టిన సంవత్సరం?
ఎ) 1984
బి) 1985
సి) 1986
డి) 1987

21.స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33.3% రిజర్వే షన్ ఏ కమిటీ సిఫారసు మేరకు కల్పించారు?
ఎ) బల్వంత్‌రాయ్ మెహతా
బి) అశోక్ మెహతా
సి) జి.వి.కె. రావు
డి) ఎల్.యం సింఘ్వీ

22.అధికరణం – 243(1) ప్రకారం గవర్నర్ రాష్ట్రంలో మొదటి ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1992
బి) 1993
సి) 1994
డి) ఏర్పాటు చేయలేదు

23.ప్రధానమంత్రి అర్హతకు సంబంధించి సరైంది?
ఎ) లోక్‌సభలో సభ్యత్వం ఉండాలి
బి) పార్లమెంట్‌లో సభ్యత్వం తప్పనిసరి
సి)ఎంపిక నాటికి ఏ సభలోనూ సభ్యత్వం లేకపోయినా పర్వాలేదు
డి) రాజ్యసభలో సభ్యత్వం ఉండాలి

24.వీటిలో సరికాని అంశం?
ఎ)రాష్టప్రతి వేతనంపై ఆదాయపన్ను ఉండదు
బి)రాష్టప్రతి పదవికి పోటీ చేసే వ్యక్తికి శాసన సభలో సభ్యత్వం ఉండకూడదు
సి)రాష్టప్రతి జీతభత్యాలు ఆర్థిక అత్యవసర పరిస్తితుల్లో తగ్గించొచ్చు
డి) పైవన్నీ

25.రాజ్యాంగ ప్రతిపత్తి లేని పదవి?
ఎ) ఉప ప్రధాన మంత్రి
బి) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సి) ఉప ముఖ్యమంత్రి
డి) పైవన్నీ

26.రాష్టప్రతి ప్రసంగాన్ని తయారు చేసేవారు?
ఎ) రాష్టప్రతి కార్యదర్శి
బి) అటార్ని జనరల్
సి) క్యాబినెట్
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

27.రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు?
ఎ) 123
బి) 124
సి) 126
డి) 136

28.కేంద్రంలో మొదటి న్యాయశాఖ మంత్రి?
ఎ) సర్దార్ పటేల్
బి) లాల్ బహదూర్‌శాస్ర్తి
సి) టి.టి. క్రిష్ణమాచారి
డి) డా. బి.ఆర్. అంబేద్కర్

29.ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దైనప్పుడు రాష్టప్రతి ఎన్నిక జరపొచ్చా?
ఎ) ఎన్నికల సంఘం అనుమతిస్తే జరపొచ్చు
బి) జరపొచ్చు
సి) పార్లమెంట్ అనుమతిస్తే జరపొచ్చు
డి) జరపరాదు

30.హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమరణ తర్వాత?
ఎ)ఏ న్యాయస్థానంలోనూ న్యాయవాద వృత్తి చేపట్టరాదు
బి) న్యాయవాది వృత్తి ఎక్కడైనా చేపట్టొచ్చు
సి)సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయవాద వృత్తి చేపట్టాలి
డి) పైవేవీకావు

31.హైకోర్టు పరిధి పెంచే అధికారం ఎవరికుంది?
ఎ) రాష్టప్రతి
బి) గవర్నర్
సి) సుప్రీంకోర్టు
డి) పార్లమెంట్

32.హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి?
ఎ) బూర్గుల రామకృష్ణారావు
బి) మాడపాటి హనుమంతరావు
సి) నీలం సంజీవరెడ్డి
డి) బెజవాడ గోపాల్‌రెడ్డి

33.అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు?
ఎ) 42
బి) 44
సి) 25
డి) 87

34.లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే విధానం?
ఎ) పార్లమెంట్ సాధారణ తీర్మాణంతో
బి) ప్రధాని సలహా మేరకు రాష్టప్రతి
సి) లోక్‌సభ ప్రత్యేక తీర్మానం ద్వారా
డి) లోక్‌సభ సాధారణ తీర్మానం ద్వారా

35.కింది వాటిలో సంయుక్త పార్లమెంటరీ ఆర్థిక కమిటీ?
ఎ) ఎస్సీ, ఎస్టీల
బి) అంచనాల
సి) ప్రభుత్వ ఖాతాల
డి) దత్తశాసనాల

36.భారత సుప్రీంకోర్టును ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కోర్టుగా అభివర్ణించినవారు?
ఎ) డా॥బి. ఆర్. అంబేద్కర్
బి) కె.యం. మున్షి
సి) బి.ఎన్.రావు
డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

37.రాజ్యసభ కంటే లోక్‌సభ ఉన్నతం కావటానికి కారణాలు?
ఎ) బడ్జెట్ నియంత్రణ లోక్‌సభదే
బి) లోక్‌సభ ప్రత్యక్ష ఎన్నిక కాబట్టి
సి)మంత్రి మండలి లోక్‌సభకే బాధ్యత వహించడం
డి) పైవన్నీ

38.కింది ఏ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన ప్రవేశపెట్టొచ్చు?
ఎ)కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే
బి) స్థిర ప్రభుత్వం ఏర్పడనప్పుడు
సి)శాసన సభలో పార్టీ ఫిరాయింపుల వల్ల క్యాబినెట్ మెజార్టీ కోల్పోతే
డి) పై అన్ని సందర్భాలూ

39.కింది వారిలో కాస్టింగ్ ఓటు (నిర్ణయాత్మక ఓటు) ఎవరికి ఉంది?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) అటార్నీ జనరల్
సి) రాజ్యసభ చైర్మన్
డి) ఎ, సి

40.వీటిలో సరికానిది?
ఎ)మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతకృపలాని
బి)మొదటి మహిళా మంత్రి – విజయలక్ష్మి పండిట్
సి)మొదటి మహిళా గవర్నర్ – సరోజినీ నాయుడు
డి)హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి – షానోదేవి

41.వీరిలో భిన్న వ్యక్తి?
ఎ) జయంతి నటరాజన్
బి) పూర్ణిమ అద్వాని
సి) గిరిజా వ్యాస్
డి) మార్గరెట్ హల్వా

42.కింది వాటిలో సరైంది?
ఎ)మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ – కె.సి. నియోగి
బి)నాలుగో ఆర్థిక సంఘం చైర్మన్ – రాజమన్నార్
సి)పన్నెండో ఆర్థిక సంఘం చైర్మన్ – సి. రంగరాజన్
డి) పైవన్నీ

43.ప్రస్తుత జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం చైర్మన్?
ఎ) సుబ్రహ్మణ్యం
బి) రత్నవీర్ పాండ్యన్
సి) భూటాసింగ్
డి) నారాయణరావు

44.కేంద్ర రాష్ట్ర సంబంధాలు సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్.యస్. సర్కారియా కమిషన్‌ను ఎప్పుడు నియమించింది? ఈ సంఘం నివేదిక ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1983, 1987
బి) 1984, 1989
సి) 1983, 1986
డి) 1985, 1990

45.రాజ్యసభకు రాష్టప్రతి 12 మందిని నియమించే విధానాన్ని రద్దు చేయాలని తెలిపిన సంఘం?
ఎ) పాలనా సంస్కరణల
బి) రాజమన్నార్
సి) సర్కారియా
డి) పైవేవీకావు

46.వీటిలో నివేదిక పార్లమెంట్‌కు సమర్పించాల్సిన అవసరం లేనివారు?
ఎ) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
బి) ఆర్థిక సంఘం
సి) ఎన్నికల సంఘం
డి) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

47.లోక్‌పాల్, లోకయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ?
ఎ) యశ్‌పాల్
బి) సంతానం
సి) మొదటి పరిపాలన సంస్కరణ సంఘం
డి) రాజ్యాంగ సమీక్ష సంఘం

48.మొదటి రాష్టప్రతిగా విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ చేతిలో ఓడిపోయినవారు?
ఎ) కె.యం. మున్షి
బి) కె.టి.షా
సి) కృష్ణమీనన్
డి) కోకా సుబ్బారావు

49.కేంద్ర మంత్రి వర్గంలో ప్రధాని తర్వాత స్థానం ఎవరిది?
ఎ) హోం మంత్రి
బి) విదేశాంగ మంత్రి
సి) ఆర్థిక మంత్రి
డి) రక్షణ మంత్రి

50.నీటిపారుదల ఏ జాబితాలోకి వస్తుంది?
ఎ) కేంద్ర
బి) ఉమ్మడి
సి) రాష్ట్ర
డి) అవశిష్ట అధికారాలు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top