You Are Here: Home » ఇతర » మండే మార్నింగ్‌ ఇలా…

మండే మార్నింగ్‌ ఇలా…

సంతోషం సగం బలం అంటారు. ఈ కాలంలో అయితే సంతోషమే పూర్తి బలం. ఒకసారి హాయిగా నవ్వాక చాలా విషయాలు దానికవే సెట్‌ అవుతాయి. టెన్షన్‌తో ఫ్రెండ్‌షిప్‌ కట్‌ చేసి హ్యాప్పీనెస్‌తో స్నేహం కుదుర్చుకొండి. ఇది మీ లైఫ్‌. హ్యాప్పీగా ఉండాల్సిన అవసరం మీకుందనేది గమనించాలి.

  • ఏం చేస్తే హ్యాప్పీగా ఉంటారో తెలుసుకొండి. ముఖ్యంగా ఎలాంటి పసులు మీకు నచ్చుతాయో తెలుసుకొండి.
  • సంతోషాన్ని ఏరికోరి, వెదకి మరీ పట్టుకొండి. దొరకనప్పుడు వెదకడంలో తప్పేంలేదు.
    Monda
  • హార్డ్‌వర్క్‌,స్మాట్‌ వర్క్‌కు మధ్య తేడా తెలుసుకొండి. స్మార్ట్‌ వర్క్‌ వల్ల చాలా పని కొంత సమయంలోనే అయిపోతుంది. సో స్మార్ట్‌ వర్క్‌ చేయడం ప్రారంభించండి.
  • మీకు సంతృప్తినిచ్చే పనులు చేయండి. సంతృిప్తి +సంతోషం= జీవితం.ఇది సరికొత్త ఫార్ములా
  • చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని ఆటలు ఆడే ఉంటారు కదా.ఆ సమయంలో ఎంత హ్యాప్పీగా ఉన్నారో గుర్తుకు తెచ్చుకొండి. వీలు చేసుకొని ఒక టీమ్‌ను తయారు చేసుకుని గేమ్స్‌ ఆడండి. చెమట రూపంలో టెన్షన్‌ వెళ్లిపోవచ్చేమో!
  • గెలుపు ఇచ్చే సంతోషం కోసం, కిక్‌ కావాలా.అయితే మీ శక్తులను గుర్తించి వాటన్నింటిని విని యోగించి కృషి చేయండి. పోరాడే క్షణాలేవి మనవి కావని అన్న బ్రూస్‌లీ మాటలు గుర్తుకు తెచ్చుకొండి.
  • మీ దగ్గర ఉన్న వాటితో సంతోపడండి. ఏదైనా లభించక పోతే లైట్‌ తీసుకొండి. హ్యాప్పీగా ఉండాలను కుంటే ఇంకొకరితో పోల్చుకోవడం మానండి.
  • ఎవరి గురించి వారు తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్టే. సో, మీ గురించి మీరు తెలుసు కునేందుకు ప్రయత్నించండి. హ్యాప్పీగా ఉండండి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top