You Are Here: Home » సినిమా » పాటలు » మంచిరోజులు వచ్చాయి (1972)- నేలతో నీడ అన్నది నను తాకరాదని

మంచిరోజులు వచ్చాయి (1972)- నేలతో నీడ అన్నది నను తాకరాదని

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని
గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని
ఒక భార్య అన్నది

చరణం : 1
వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే…
నీవు లేవు… నేను లేను…
నీవు లేవు నేను లేను లోకమే లేదులే
॥॥

చరణం : 2
రవికిరణం తాకనిదే
నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే
మందారం మురిసేనా
మేను మేను తాకనిదే
మనసు మనసు కలవనిదే
మమత లేదు… మనిషి లేడు…
మమత లేదు మనిషి లేడు
మనుగడయే లేదులే ॥॥

చరణం : 3
అంటరానితనము ఒంటరితనము
అనాదిగా మీ జాతికి
అదే మూలధనము

ఇక సమభావం సమధర్మం
సహజీవనమనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం
తెలియకుంటే మీ కర్మం ॥॥
ఈ భార్య అన్నది

చిత్రం : మంచిరోజులు వచ్చాయి (1972)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top