You Are Here: Home » విశేషం » భూమి వయస్సు – విశ్లేషణ

భూమి వయస్సు – విశ్లేషణ

భూమి వయస్సు – విశ్లేషణ భూమి వయస్సు - విశ్లేషణ

భూ విజ్ఞాన శాస్త్రంలో భూమి వయస్సు నిర్ధారణ పెద్ద చర్చనీయాంశం. ప్రాచీన మత గ్రంథాలలో భూమి వయస్సును గురించిన ప్రస్తావన ఉంది. 1654 సంవత్సరంలో ఆర్చిబిషప్‌ ఉషర్‌ అనే క్రైస్తవ మతాధికారి భూమి క్రీ.పూ. 4004 అక్టోబర్‌ 26వ తేదీ ఉదయం 9గం.లకు పుట్టిందని హిబ్రూ గ్రంథాలలో ఉన్నట్లు చెప్పాడు. ఈ లెక్క ప్రకారం భూమి వయస్సు కేవలం 6వేల సంవత్సరాలు మాత్రమే.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించిన సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక కల్పం 432కోట్ల(4320 మిలియన్‌) సంవత్సరాలకు సమానం. ఇది ఆధునిక అంచనాల ప్రకారం భూమి వయసుకు సరిపోతుంది.

ఆధునిక కాలంలో శాస్త్రజ్ఞులు కొన్ని సూత్రాల ఆధారంగా భూమి వయస్సును లెక్క కట్టారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

1.సముద్ర లవణాలు భూమి వయస్సు: భూమి ఉపరితలం ఎప్పుడూ శైధిల్యం చెందుతూ ఉంటుంది. శైధిల్యం చెందిన పదార్థం నదుల ద్వారా సముద్రానికి చేరుతుంది. సూర్యుని వేడికి సముద్రంలో నీరు ఆవిరియై లవణాలు మిగులుతాయి. ఈ లవణాలలో సోడియం క్లోరైడు ముఖ్యమైనది. ఇది ఉప్పగా ఉంటుంది. కాలక్రమేణా సముద్ర జలాలలో లవణాల శాతం అధికమవుతుంది. నదుల నుండి వచ్చేనీరు తియ్యగా ఉన్నప్పటికీ సముద్ర జలాలు ఉప్పగా ఉండడానికి సముద్రపు నీటిలో లవణాల శాతం పెరగటమే కారణం.

సముద్ర జలంలో లవణాల పరిమాణం ప్రస్తుతం ఎంతశాతం ఉన్నది? సంవత్సరానికి ఎంతశాతం పెరుగుతున్నది? అనే విషయాల ఆధారంగా భూమి వయస్సు లెక్క కట్టారు. దీనిని బట్టి భూమి వయస్సు 10 కోట్ల సంవత్సరాలని తేలింది. అయితే ఇది చాలా తక్కువని తర్వాత ప్రయోగాల ద్వారా తేలింది.

2. పాలపుంత-భూమి వయస్సు: సౌర కుటుంబం ఏర్పడిన నాటి నుండి, అది పాలపుంతలోని నక్షత్ర సమూహం నుండి సూర్యునితోపాటు ఒక నిర్ణీత మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రస్తుతం సూర్యకుటుంబం మార్గానికి దగ్గరగా ఉన్న నక్షత్ర పుంజానికి, సౌర కుటుంబానికిగల మధ్యదూరం 1కోటి 50లక్షల కిలోమీటర్లు (1.5మిలియన్‌ కిలోమీటర్లు)

సౌరకుటుంబం ప్రస్తుతం ప్రయాణ వేగాన్ని బట్టి, అది ఇంతవరకు ప్రయాణించిన దూరాన్ని బట్టి సౌర కుటుంబ వయస్సు (భూమి వయస్సు కూడా) 200 నుండి 300కోట్ల సంవత్సరాలుగా అంచనా వేశారు. ఇది కూడా తక్కువేనని తర్వాత ప్రయోగాల ద్వారా తేలింది.

3.రేడియో ధార్మిక శక్తి-భూమి వయస్సు: యురేనియం, రేడియం, సోడియం మూలకాలకు గల రేడియో ధార్మిక శక్తి కనుగొన్న తర్వాత భూమి వయస్సు నిర్ణయించడానికి కొంత విశ్వసనీయమైన ఆధారం దొరికినట్టు భావించాలి.

రేడియో ధార్మిక వికిరణం వల్ల యురేనియం తన మూల గుణాలను కోల్పోయి మొదట రేడియంగానూ, చివరకు సీసంగానూ మారి దాని రేడియో ధార్మిక శక్తిని పూర్తిగా కోల్పోతుంది. కొంత యురేనియంలో సగభాగం సీసంగా మారడానికి పట్టే కాలాన్ని యురేనియం అర్ధజీవిత కాలం(ష్ట్రaశ్రీట శ్రీఱటవ జూవతీఱశీస) అంటారు. ఈ విధంగా భూమి మీద లభించే యురేనియంను, దానితోపాటు లభించే సీసాన్ని పరీక్షించి చూడగా ఆ యురేనియం వయస్సు 450కోట్ల సంవత్సరాలని తేలింది. దాన్ని బట్టి భూమి వయస్సు కూడా 450కోట్ల సంవత్సరాలై ఉండాలని ఈనాడు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top