You Are Here: Home » చిన్నారి » భూభ్రమణ వేగం పెరిగితే ఏమవుతుంది?

భూభ్రమణ వేగం పెరిగితే ఏమవుతుంది?

పగలు, రాత్రి ఏర్పడటానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగటం. ఈ తిరిగే వేగం స్థిరంగా ఉండటం వలన భూభ్రమణ కాలం స్థిరంగా ఉండి ప్రతిరోజుకి 24 గంటలే ఉంటాయి. ఒక వేళ భూభ్రమణ వేగం ఒక్కసారిగా పెరిగితే భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం తగ్గి మనిషి భారాన్ని కోల్పోతాడు.

దాని కారణంగా రోజుకు పట్టే కాలం కూడా మారుతుంది. ఉదాహరణకు ఇప్పుడున్న వేగం కన్నా భూమి 17 రెట్లు వేగంగా తిరిగితే భూమధ్యరేఖ దగ్గర వస్తువు భారాలన్నీ శూన్యం అవుతాయి. కాని ధృవాల దగ్గర ఏ మార్పూ ఉండదు. ఒకవేళ భూభ్రమణ వేగం తగ్గితే భూమధ్యరేఖ దగ్గర గురుత్వత్వరణం పెరుగుతుంది. భూమి ఎల్లప్పుడూ స్థిరవేగంతో తిరగటం వల్ల మనపై ఒత్తిడి కలగదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top