You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు » భిన్నరుచుల…ధీమ్‌ రెస్టారెంట్స్‌

భిన్నరుచుల…ధీమ్‌ రెస్టారెంట్స్‌

‘భోజనప్రియులు తినే తిండిలోనూ వెరైటీ కోరుకుంటున్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లనూ మార్చుకుంటున్నారు. పాత చింతకాయపచ్చడి లాంటి ెటళ్లను వదిలి కొత్తదనం కోసం అర్రులు చాస్తున్నారు. సాధారణంగా ఇంట్లో వండే వంటకాలకన్నా బయట రెస్టారెంట్లలో లభించే వాటిని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అదీ వెరైటీ థీవ్గుతో ‘స్టైల్‌’గా కనిపించే రెస్టారెంట్లకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. భోజనప్రియుల అభిరుచులకు అనుగుణంగా థీవ్గు రెస్టారెంట్లను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు పోటీపడుతున్నారు…పబ్‌ కల్చర్‌ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సెలబ్రిటీలు ప్రత్యేకత కోసం పరుగులు తీస్తున్నారు. తినే భోజనంలోనూ టేస్టుండాలి గురూ అని యువతరం ముక్తకంఠంతో చెపుతున్నారు..దీంతో ప్రత్యేకంగా చెఫ్‌లు రుచికరమైన వంటకాలు ఆతిధ్యం కోసం సిద్ధం చేస్తున్నారు…ఈ థీవ్గు రెస్టారెంట్స్‌పై ఈవారం ‘స్టైల్‌’ అందిస్తున్న ప్రత్యేక కధనం ఇది… ’

royyaఅత్యాధునికంగా తీర్చిదిద్దిన రెస్టారెంట్‌ వాతావరణంలో ఫుడ్‌ అండ్‌ వైన్‌ను మరింత రిలాక్స్‌గా తీసుకునేలా థీమ్‌ రెస్టారెంట్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉండేలా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మియాపూర్‌, సికింద్రాబాద్‌, దిల్‌షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట బేగంపేటలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ధీమ్‌ రెస్టారెంట్‌లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లోని జివికె, ఐమాక్స్‌, ఐనాక్స్‌, సెంట్రల్‌ వంటి షాపింగ్‌ మాల్స్‌లో సైతం ఇవి అందుబాటులోకి వచ్చాయి.గలగలా పారే సెలయేటి సవ్వడులు, కమ్మని సంగీతం వింటూ కాలక్షేపం చేయడం బిజీ జీవనంలో ఎంతో ప్రశాంతత

కలిగిస్తుంది..ఎక్కడో పాతకాలం నాటి రోజుల్లో కట్టిన ఇంట్లో తింటున్నామన్న భావన కలిగే రెస్టారెంట్లూ ఇప్పుడు భాగ్యనగరంలో ఉన్నాయి. విమానంలో ఉన్నామో..అడవిలో ఉన్నామో అన్న అనుభూతిని కల్పించే కొత్త రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా యువతరం కోసం థీమ్‌రెస్టారెంట్లను ఏర్పాటు చేసే నిర్వాహకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా ఉద్యోగం వచ్చినా, ఏదైనా శుభకార్యమైనా ఇక్కడే ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశాలకు చెందిన నోరూరించే వంటకాలు భాగ్యనగరంలో ఘుమఘుమలాడుతున్నాయి.

karయువతరం మెచ్చే ఎన్నోరకాల వంటకాలు ఇప్పుడు ఇక్కడ లభ్యమవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతరం ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, అభిరుచులను అనుసరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో రెస్టారెంట్‌లు రుచికరమైన వంటకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. చైనీస్‌, మొఘలాూ, రాయలసీమ వంటి రుచులను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. దీంతో యూత్‌ కూడా కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టమైన రుచులను ఆరగించేందుకు ఫుడ్‌ఫెస్టివల్స్‌ను వేదికగా ఎంచుకుంటున్నారు. తమ తోటి స్నేహితులతో ఇక్కడ ఎంజాయ్‌ చేస్తున్నారు.

నిత్యం సెలబ్రిటీలో కళకళ…
09FEAహైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు నిత్యం సెలబ్రిటీలతో కళకళలాడు తున్నాయి. నిత్యం ఏదో ఒక ఫుడ్‌ ఫెస్టివల్స్‌ పేరుతో హోటల్స్‌ ని ర్వాహ కులు రా రమ్మని ఆహ్వానం పలుకుతున్నారు. ఫుడ్‌తో పాటు వైన్‌ తీసు కునే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్నేహితులతో కబు ర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేందుకు చాలామంది సెలబ్రిటీ లు ఈ థీమ్‌ రెస్టారెంట్లను వేదికలుగా మార్చుకుంటున్నారు. పుట్టిన రోజు, పెళ్లిరో జు వేడుకలను కూడా ఇక్కడ నిర్వహించుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నా రు.ఇక హోటళ్లలో నిర్వహించే ఫుడ్‌ఫెస్టివల్స్‌కు ప్రత్యేకంగా సినీతారలు,మోడల్స్‌, సెలబ్రిటీలు హాజరుకావడం పరిపాటిగా మారుతోంది. వారితో కలిసి డిన్నర్‌ చే యాలని ఉవ్విళూరే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మరింకెందు కు ఆలస్యం మీ స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సరదాగా ఓ రోజు మీ కిష్టమైన వంటకాలను నోరారా ఆరగించేందుకు బయలుదేరండి మరి.

నోరూరించేఎన్నోవంటకాలు
ఇండియన్‌, చైనీస్‌ వంటకాలు భోజనప్రియులకు నోరూరిస్తున్నాయి. ఇండియన్‌ సెక్షన్‌లో బాదామీ పన్నీర్‌ టిక్కా, వెజ్‌ తండూరీ ప్లాటర్‌, ముర్గ్‌ టిక్కా, గిలాఫీ కబాబ్‌, బుర్రా కబాబ్‌, కాకోరీ కబాబ్‌, జింగా-ఎ-షాన్‌ వ ంటివి లభిస్తున్నాయి. పన్నీర్‌ ముల్తానీ, రారా మసాలా, కాజూ కూర్చాన్‌, బుట్టా పాలక్‌, కుంహారా ప్యాజా, బట్టర్‌ చికెన్‌, లాజీజ్‌ ముర్గా టిక్కా మసాలా, రాజస్థానీ లాల్‌ మాస్‌, ప్రాస్‌ మలాయ్‌ కర్రీ వంటివి అందిస్తున్నారు. ఇక చైనా వంటకాల్లో గువాండాంగ్‌, హునామ్‌, షెకింగ్‌, కాంటోసినీ స్టైల్స్‌తో పాటు అద్భుతమైన రుచితో సిద్ధం చేస్తున్నారు. చికెన్‌, లాంబ్‌, వెజిటబుల్స్‌తో పాటు లాబస్టర్‌, మిక్స్‌డ్‌ సీఫుడ్‌ గ్రిల్‌ తదితర వంటకాలు రెస్టారెంట్లలో చెఫ్‌లు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top