You Are Here: Home » చిన్నారి » కవితలు » భారతీయ భాషల అభివృద్ధి మండలిలో కేతు విశ్వనాథ రెడ్డి

భారతీయ భాషల అభివృద్ధి మండలిలో కేతు విశ్వనాథ రెడ్డి

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ స్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. ‘కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌’ (సిపిఐఎల్‌)గా పేరొందిన ఈ మండలి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది. మండలి సభ్యునిగా తెలుగు భాష తరపున ఎంపికైన కేతు విశ్వనాథరెడ్డి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా జాతీయస్థాయిలో సుప్రసిద్ధులు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగుతారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సిఐపిఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జ్ఞానపీఠ్‌, సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు మాత్రమే ఈ మండలిలో సభ్యులుగా నియమితులవుతారు.
చంద్రశ్రీ సంస్మరణ
మట్టిపూలు రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక కళాకారిణి, రచయిత్రి, కార్యకర్త చంద్రశ్రీ మొదటి వర్ధంతి 2013 జూలై 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ ఇందిరా పార్కు సమీపంలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ ఆడిటోరియంలో ‘చంద్రశ్రీ యాదిలో’ పుస్తకావిష్కరణ, సంస్మరణ సభ జరుగుతాయి. కారంచేడు పోరాట నాయకురాలు సులోచన ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు జమున, రచయిత్రులు బి.యమ్‌. లీలా కుమారి, గోగు శ్యామల, జ్వలిత పాల్గొంటారు. ఈ సభకు జూపాక సుభద్ర అధ్యక్షత వహిస్తారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top