You Are Here: Home » ఇతర » భారతదేశ గ్రాండ్గ ఓల్డ్‌ లేడీ

భారతదేశ గ్రాండ్గ ఓల్డ్‌ లేడీ

బ్రిటిష్‌ పరిపాలనలో మన పూర్వికులు మగ్గుతున్న సమయంలో బయట మగవారు ఆంగ్లేయుల రూల్స్‌ ప్రకారం నడిచేవారు. ఇంట్లో మహిళలు పురుషూల రూల్స్‌ ప్రకారం గడపదాటకుండా వంటింటిేక పరిమితమయ్యేవారు. స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్న తరుణంలో పై రెండు అంశాల్లో పెను మార్పులు జరిగారుు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయులు గళం వినిపించగా, పురుషూలతో సమానంగా మహిళలు కూడా ఉద్యమాలలో పాల్గొని నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛను మనకు ప్రసాదించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో అరుణా అసఫ్‌ అలీ ప్రముఖులు.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: అరుణా అసఫ్‌ అలీ
పుట్టిన తేది 	: 1909, జులై 16
జన్మస్థలం  	: హర్యానా
భర్త 		: అసఫ్‌ అలీ
వృత్తి 		: స్వాతంత్య్రోద్యమ నాయకురాలు, టీచర్‌
నిర్యాణం	        : 1996 జులై 29
అవార్డులు  	: భారతరత్న, పద్మవిభూషణ్‌ 
		  వంటి ఎన్నో అవార్డులు

1942లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ‘క్విట్‌ ఇండియా ఉద్యమం’లో బాంబేలో గొవాలియా టాంక్‌ వద్ద భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకాన్ని ఎగురవేసి సంచలనం సృష్టించిచారు అరుణా అసఫ్‌ అలీ. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో ఆమె ఉద్యమంలో పాల్గొన్నారు. 1932లో బ్రిటిష్‌ వారు ఆమెను అరెస్ట్‌ చేసి తీహార్‌ జైలుకు తరలించారు. అయితే తీహార్‌ నుంచి విడుదలయ్యాక , స్వాతంత్య్రం వచ్చాక ఆమె రాజకీయంలో అంత ఆసక్తి కనబర్చలేదు. ఆమె దేశసేవా పటిమను గుర్తించి భారత ప్రభుత్వం 1997లో ఆమెకు భారతరత్న అవార్డుతో గౌరవించింది.

బాల్యం విద్యాభ్యాసం
అరుణ 1908 జులై 16న పంజాబ్‌లని కల్కాలో జన్మించారు.లాహోర్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. చదువుపై ఉన్న అంకితభావంతో పట్టుదలతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత కలకత్తాలోని గోఖలే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆమె కు అలహాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అసఫ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తరువాత వారి అభిప్రాయాలు కుదరడంతో 1928లో వివాహం చేసుకున్నారు.

జాతీయోద్యమంలో…
అసఫ్‌ అలీతో వివాహానంతరం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సమయంలో ప్రజలతో కలిసి ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని ప్రేరేపిస్తుందన్న నిందమోపి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెను అరెస్ట్‌ చేసింది. ఆమెను విడుదల చేయందే తాము కూడా బయటికి వెళ్లమని ఇతర మహిళలలు తెలపడంతో ఈ విషయంలో మహాత్మా గాంధీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. మరోసారి అరెస్టై తీహార్‌ జైలులో ఉన్నప్పుడు అక్కడి రాజకీయ ఖైదీల విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ 1932లో నిరాహార దీక్ష చేపట్టారు. దాని ఫలితంగా తీహార్‌ జైలులో పరిస్థితి మార్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఆమెను తీహార్‌ నుంచి అంబాలాకు మార్చారు. ఈ సారి జైలు నుంచి విడుదయ్యా నాటి ప్రముఖ ఉద్యమ నాయకులు ఆమె తెగువను కొనియాడారు.

స్వతంత్య్ర భారతావనిలో…
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఆమె కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీలో సభ్యురాలిగా చేరారు. అయితే పార్టీ వర్గాలతో చిన్న పాటి అభిప్రాయాలు రావడంతో 1948లో సోషలిస్ట్‌ పార్టీలో చేరారు. 1950కి ముందే సోషలిస్ట్‌ పార్టీని కాదని కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. సిపిఐలో మహిళా విభాగమైన నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వుమెన్‌ను స్థాపించడానికి కృషి చేశారు. జవహార్‌లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి ప్రముఖులతో ఆమె తన భావాలను పంచుకునేవారు.

గుర్తింపు
స్వేచ్ఛా భారతావని కోసం కృషి చేసిన అరుణా అసఫ్‌ అలీకి
అనేక జాతీయ అంతర్జాతీయఅవార్డులు
వరించాయి. ఆమె జ్ఞాపకార్థం ఢిల్లీలో అరుణా అసఫ్‌ అలీ మార్గ్‌ను అంకితం చేశారు. అంతే కాకుండా ఆమె పేరున ఆల్‌ ఇండియా మైనారిటీస్‌ ఫ్రంట్‌ సంస్థ డాక్టర్‌ అరుణ అసఫ్‌ అలీ
సద్భావనా అవార్డును ప్రకటిస్తోంది.

అవార్డులు
అంతర్జాతీయ లెనిన్‌ శాంతి బహుమతి -1964
జవహర్‌ లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు -1991
పద్మవిభూషణ్‌ -1992
భారత రత్న-1997.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top