You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » భాగ్యనగరం ఐదేళ్లు వెనక్కి?

భాగ్యనగరం ఐదేళ్లు వెనక్కి?

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దారుణంగా దెబ్బతిన్నది. గత కొంతకాలం నుంచి ఆశించిన స్థారుులో విక్రయాలు లేక… మరోవైపు బ్యాంకుల నుంచి ప్రాజెక్టులకు అప్పులు లభించక.. బిల్డర్లు, డెవలపర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇందులో నుంచి బయపడటానికి నానారకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఐటీ రంగం కూడా ఆశించిన స్థారుులో అభివృద్ధి చెందట్లేదు. పలు సంస్థలు హైదరాబాద్‌ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎక్కువమంది వ్యాపారులు ఇతర నగరాల్లో కార్యకలాపాల్ని మెుదలుపెట్టారు. కొనుగోలుదారులూ సొంతూళ్లలో ఇళ్లు, స్థలాలు కొంటున్నారు. పెట్టుబడిదారులు హైదరాబాద్‌ మినహా ఏ ప్రాంతంలోనైనా ‘సై’ అంటున్నారు. మెుత్తానికి హైదరాబాద్‌ అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి పోరుుందని నిపుణులు అంటున్నారు. అభివృద్ధి పథంలో బెంగళూరు, చెన్నైలు ముందుకు దూసుెకళూతూ హైదరాబాద్‌కు సవాలు విసురుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఐటీ, ఐటీఈస్‌ రంగం గతంలో మెరుగ్గా ఉండటం వల్ల… హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా అభివృద్ధి చెందింది. అప్పట్లో ప్రభుత్వం కూడా స్థిరంగా ఉండటం, పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ఆరంభించడం.. అంతా సానుకూలంగా ఉండటంతో చాలా మంది హైదరా బాద్‌లో పెట్టుబడులను పెట్టడానికి అమితాసక్తి చూపించారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక్కసారిగా రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. దీంతో తెలంగాణ అంశం ఊపందుకుం ది. ఐటీ కంపెనీల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. బెంగళూరులో రాజకీయంగా అస్థిరత నెలకొన్నా అక్కడి ఐటీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం జరగదు. కానీ, ఇక్కడి పరిస్థితుల వల్ల ఐటీ రంగానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఇతర రంగాల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. దీంతో కంపెనీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏదెైనా ఒక నగరంలో కార్యకలాపాల్ని ఆరంభించేటప్పుడు ఐటీ సంస్థలు పలు అంశాల్ని పరిశీలిస్తాయి. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండాలని కోరుకుంటాయి. విద్యుత్తు కొరత, అదు పులో శాంతిభద్రతలు, మెరుగెైన వాతావరణం, మంచినీటి సరఫరా, ఉన్నత విద్యావంతుల లభ్యత… ఇలా రకరకాల అంశాలపెై దృష్టి సారిస్తాయి. వీటన్నింటితో పాటు రాజకీయ పరంగా స్థిరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటాయి. ఇవన్నీ పక్కాగా ఉన్న చోటే సాఫ్ట్‌వేర్‌ సంస్థల్ని ఏర్పాటు చేస్తాయి. గత కొంత కాలం నుంచి ఏర్పాటు చేశాయి కూడా. తెలంగాణ అంశం పెై కేంద్రం కొన్నేళ్ళుగా ఏ సంగతీ తేల్చక పోవడంతో ఐటీ సంస్థలన్నీ పునరాలోచనలో పడ్డాయి.

పలు కంపెనీలు తమ కార్యకలాపాల్ని హైదరాబాద్‌లో విస్తరించడానికి ఆసక్తి చూపట్లేదు. అదే విధంగా నిన్నటి వరకూ హైదరాబాదే ఐటీ హబ్‌ అని నీరాజనాలు పలికిన సంస్థలు ప్రస్తుతం ఇటువెైపు కనెత్తి కూడా చూడట్లేదు. కొత్త ఐటీ కంపెనీలు కూడా బెంగళూరు, పుణే, చెనె్నై తదితర నగరాలపెై దృష్టి సారిస్తున్నాయి తప్ప భాగ్యనగరాన్ని పట్టిం చుకోవడం లేదు.
తెలంగాణ అంశం తెరమీదికి రాకముందు వరకూ మాదా పూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఐటీ స్థలాల కు మంచి గిరాకీ ఉండేది.

కానీ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. వేల చదరపు అడుగుల ఐటీ స్థలం ఖాళీగా ఉంది. ఐటీ స్థలాల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రేట్లు తగ్గించినా ఐటీ కంపెనీలు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల కంపెనీలు కోరుకున్న రీతిలో స్థలం దొరకట్లేదు. ఇక వాణిజ్య సముదాయాలకు పెద్దగా గిరాకీ ఉండట్లేదు. ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. చిన్నా చితకా ఆఫీసులను ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపించట్లేదు.

బూమ్‌ సమయంలో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆలోచనలతో రియల్‌ రంగంలో అడుగుపెట్టిన వారిలో సింహభాగం వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని రియల్‌ సంస్థలు కార్యకలాపాల్ని పూర్తిగా తగ్గించేశాయి. ఇక శంషాబాద్‌, మేహశ్వరం, కొత్తూరు, షాద్‌నగర్‌, జెపీ దర్గా వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు కొన్న వారిలో చాలా మంది వాటినేం చేయాలో అర్థం కాక వదిలేసుకున్నారు.

ఫ్లాట్లకు తగ్గిన గిరాకీ…
బూమ్‌ సమయంలో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆలోచనలతో రియల్‌ రంగంలో అడుగుపెట్టిన వారిలో సింహభాగం వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని రియల్‌ సంస్థలు కార్యకలాపాల్ని పూర్గి తగ్గించేశాయి. ఇక శంషాబాద్‌, మేహశ్వరం, కొత్తూరు, షాద్‌నగర్‌, జెపీ దర్గా వంటి ప్రాం తాల్లో ఫ్లాట్లు కొన్న వారిలో చాలా మంది వాటినేం చేయాలో అర్థం కాక వదిలేసుకున్నారు. మరికొందరు నెలసరి వాయిదాలు కట్టడం పూర్తిగా నిలిపివేశారు. ఇదే సమయంలో ఆశావహులు తక్కువ ధరకు ఫ్లాట్లు అమ్మే వారికి గాలం వేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో ఫ్లాట్ల మార్కెట్‌ దారుణంగా దెబ్బతిన్నది. ఓ పదేళ్ల తర్వాత పెరగాల్సిన రేట్లను ఇప్పుడే పెంచేసి… మార్కెట్‌ను చాలా మంది అస్తవ్యస్తం చేశా రు. మార్కెట్‌ పూర్తిగా పతనం కావడంలో కీలకపాత్ర పోషిం చిన రియల్టర్లు, మధ్యవర్తులు, కన్సల్టెంట్లు…

ప్రస్తుతం ఈ రంగం నుంచే పూర్తిగా నిష్ర్కమించారు. తెలంగాణ అంశం కారణంగా హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనేవారి శాతం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు సైట్‌ ట్రిప్పులు, సందర్శకులతో కళ కళలాడిన రియల్‌ సంస్థలు ప్రస్తుతం కళావిహీనంగా తయార య్యాయి.తెలంగాణ అంశం తెరమీదికి రాకముందు వరకూ మాదా పూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఐటీ స్థలాల కు మంచి గిరాకీ ఉండేది. కానీ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. వేల చదరపు అడుగుల ఐటీ స్థలం ఖాళీగా ఉంది. ఐటీ స్థలాల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

ఫిఫ్టీ… ఫిఫ్టీ
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బ తిన్నదని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, రెండు లేదా మూ డు నెలలు మార్కెట్‌ మెరుగ్గా లేకపోయినా.. ఆ తర్వాత కాలంలో అమ్మకాలు ఫర్వాలేదనిపిస్తున్నాయి. రెండు నెలలు మెరుగ్గా ఉంటే, మరో రెండు నెలలు కొంత తక్కువ శాతం నమోదవుతుంది. ఇలా జరిగే అమ్మకాల వల్ల డెవలపర్లకు ఒనగూడే ప్రయోజనమేం లేదు. కొన్ని కార్యకలాపాలు మాత్రం సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన నిర్మాణ వ్యయా నికి, అమ్ముతున్న ధరకు ఏ మాత్రం పొంతన కుదరట్లేదు. డెవలపర్లు ధర పెంచుదామని ప్రయత్నిస్తున్నా… కొనుగోలు దారులు ముందుకు రాని పరిస్థితి. మార్కెట్‌ పుణ్యమా అంటూ తక్కువ ధరకు ఫ్లాట్లను అమ్మేవారి వద్దకే కొనేవారు వెళుతున్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియా పూర్‌, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో కేవలం ఐటీ నిపుణులే ఫ్లాట్లను కొంటున్నారు.

వీరు మినహా నగరంలో ఫ్లాట్లు కొనడానికి ఇతరులు పెద్దగా దృష్టి సారించట్లేదు. ఐటీ నిపుణుల్లో కూడా కొద్దిమందే కొనడానికి ఆసక్తి చూపెడతు న్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలనుకున్న వారంతా ప్రస్తుతం బెంగళూరు వెైపు దృష్టి సారించడం గమ నార్హం.
హైదరాబాదే తమ కేంద్రమంటూ గొప్పలు చెప్పిన వ్యాపా రులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు ప్రస్తుతం ఇతర ప్రాంతాల వెైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు మెరుగవ్వాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అంశం తేలే వరకు లేదా 2014 ఎన్నికల వరకూ పరిస్థితి ఇలాగే కొన సాగుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశమే లేదని వీరంతా ఘంటాపథంగా చెబుతున్నారు. మౌలిక సదుపాయాలెన్ని మెరుగ్గా ఉన్నా… వ్యాపారం చేసుకోవడానికి, ప్రశాంతంగా నివసించడానికి సరెైన వాతావరణం లేకపోతే ఎలా అని వీరంతా ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్‌లో రెసిడెన్షియల్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బ తిన్నదని చెప్పలేం. ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనాలనుకుంటున్న వారెంతో మంది తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తెలంగాణ అంశంపెై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడనుందని భావిస్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని బట్టి విక్రయాల తీరుతెన్నులు ఉండగలవని నిపుణులు భావిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top