You Are Here: Home » ఇతర » భాగ్యనగరంలో ఫ్యాషన్‌యాత్ర !

భాగ్యనగరంలో ఫ్యాషన్‌యాత్ర !

05సెలబ్రిటీల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటు లోకి వస్తున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్లకు అనుగుణంగా డిజైనర్లు సరికొత్తగా తీర్చిదిద్ది న ఉత్పత్తులు ప్రదర్శనల్లో ఏర్పాటవుతు న్నాయి. ఈ తరుణంలో ఫ్యాషన్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాషన్‌యాత్ర హైదరాబాద్‌ తాజ్‌కృష్ణలో కామినిషరాఫ్‌ నేతృత్వంలో జులై 20న ప్రారంభం కానుంది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ వేడుక జరగనుంది. ఫ్యాషన్‌ యాత్ర నిర్వహించడం ఇది ఏడవసారి. ప్రదర్శనలో పాల్గొనేవారి సంఖ్య పెరగడమే కాకుండా ప్రదర్శన తీరుతెన్నుల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ప్రదర్శన స్థూలంగా ఫ్యాషన్‌, ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ యాక్ససరీస్‌, జ్యుయలరీ, హోమ్‌ విభా గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని 60మందికి పైగా డిజైనర్లు ఈఫ్యాషన్‌యాత్రలో పాల్గొంటున్నారు. చీరలు, ఎత్నిక్‌, ఇండోవెస్ట్రన్‌, ఆభరణాలు, విలువైన రాళ్ల ఆభరణాలు, బ్యాగులు, పిల్లల దుస్తులు, హోమ్‌ యాక్ససరీస్‌ వంటివి ఈ ప్రదర్శనలో చోటుచేసు కోనున్నాయి. నన్హీకలీ సచ్ఛంద సంస్థకు బాలికల చదువు నిమిత్తం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ప్రదర్శనను ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు కామినీ షరాఫ్‌ తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top