You Are Here: Home » ఇతర » భవిష్యప్రదాత నీతా

భవిష్యప్రదాత నీతా

నేటి మహిళలు అందుకోని అందలం లేదు, పట్టుకోని విద్యలేదు. అనూహ్య రీతిలో అన్ని రంగాల్లోను తమకంటూ ఎంతో ప్రాముఖ్యతని, ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటున్నారు. సమాజంలో తమకంటూ ఒక ప్రతేకతని చాటుకుంటున్నారు. విద్య, వైద్య, పరిశోధనా రంగాల్లోనే కాకుండా వాస్తు, శిల్ప కళారంగాల్లో కూడా మేమే ముందు అంటున్నారు. ఆదే కోవలో తనకంటూ ఒక ప్రత్యేకతని తెచ్చు కున్న మరో మహిళ నీతా సిన్హా. నిజానికి సిన్హాని మనదేశంలో తెలియనివారంటూ ఉండరు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖల నుండి సామాన్య వర్గాలకి కూడా నీతా సిన్హా సుపరిచితురాలే.

Unti52నీతా సిన్హా సుప్రసిద్ధ ఆస్ట్రో ఆర్కిటెక్ట్‌, బాలివుడ్‌ సినీతార లకు ఆమె చెప్పిందే వేదం. వాళ్ల భవంతులలో, ఆమె సలహా లేనిదే ఒక్క వస్తువుకూడా కదపరు. భవతులకు పేర్లు పెట్టడంలో కూడా ఆమె దిట్ట. అమి తాబ్‌ బచ్చన్‌ ముంబైలోని భవంతికి ’మన్సాస్‌’ అనే పేరు బదులుగా ’జల్సా’ అని పేరు పెట్టింది. అభి షేక్‌, ఐశ్వర్యరాయ్‌ల ఇంటికి కూడా ఆమెనే ముఖ్య సలహాదారు. షారూఖాన్‌ తన ఇంటికి ’ఎమ్‌’ అక్షరం తో ప్రారంభించమని, చివరికి ’మన్నత్‌’ అనేపేరు పెట్టింది. అలాగే కరణ్‌ జోహార్‌, అక్షయ్‌ కుమార్‌లకు వాస్తు సలహాదారు. అక్షయ్‌కుమార్‌, నీతాదంపతుల లైఫ్‌ స్టైల్‌ స్టోర్‌కు ’వైట్‌ విండో’ పేరుకు బదులు ’ది వైట్‌ విండో’ అనే స్వల్ప మార్పుతో పేరు సూచించింది. జాన్‌ అబ్రహాం, బిపాశా బసు కూడా ఆమె సలహాలకే తలొగ్గుతారు.

కేవలం సినిమారంగానికే కాక వ్యాపారరంగంలోని ప్రముఖులు గాద్రెజ్‌, పంజ్‌లు ఆమెకు వాస్తు అభిమా నులు, నీతా ముందుగా ఇంటి వాస్తు చిత్రాన్ని గీస్తుంది. ఇంటి యజమానికి సరిపడేలా వాస్తుదోషాల నివారణకు యోచిస్తుంది. ముంబైలాంటి ప్రధాన నగరాలలో 20-25 అంతస్థుల భవనాల వాస్తులపై కూడా పరిశోధన చేసింది. చిత్రమేమంటే ఏ రెండు ఇళ్ల వాస్తులు ఒకేలా ఉండవు. ఫ్లాట్స్‌లో నివసిస్తున్న వారి సమస్యలు అందరివీ ఒకేలా ఉండవు. కొందరికి మంచి జరుగుతుంది. కొందరికి లాభించదు. ఆమెలో విశిష్టత ఏమంటే యజమాని ఇల్లు వాస్తును ప్రకౄఎతితో అనుసంధానం చేస్తుంది. నేడు బహుళ ప్రాచుర్యం పొందుతున్న ఫెంగ్‌ ష్యూని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. రంగులు, మొక్కలు, అద్దాలు, ఎక్కడ ఎలా అమర్చాలో చెబుతుంది. ఆమె సలహాలకు ఆధారం జ్యోతిష్యం, వాస్తు, ఫెంగ్‌ ష్యూ.

వంశపా రంపర్యంగా కొన్ని కుటుంబాలలో గ్రహదోషాలుంటే ఆమె ఏమీ చేయలేదు. ఇల్లు సొంతమా అద్దెదా, అనేది కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దుకాణం (వ్యాపారం) ఫ్యాక్టరీల వండి దోషాలను ఓ వారంలోగా పరిష్కరిస్తుంది. ఆమె ఇస్తున్న సలహాలు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటి ఆవరణలో ఎలాంటి ముగ్గు వేయాలి, అద్దాలు ఎక్కడ పెట్టాలి, వీనులవిందు కల్గించేట్లు ఇంటిలో వస్తువుల అమరిక, స్వాగత తోరణాలు ఇలా సింపుల్‌గా మార్పులు చెబుతుంది. ’’మారిస్తే ఏం కలుగుతుంది?’’ అని ప్రశ్నిస్తే ’’వారం రోజులలో మీరే చూస్తారుగా’’ అని నమ్మకంతో సమాధానం ఇస్తుంది. మొత్తానికి నీతా సిన్హా ముంబైలో వాస్తు విషయ పరిజ్ఞానంతో ఓ వెలుగు వెలుగుతుంది.

పుట్టిన బిడ్డలకి రాశి చక్రం వేసినట్టుగానే ఈమె ఇంటికి జ్యోతిష్యం లిఖిస్తుంది. ఆఫీసులు, వాస్తునిర్మాణాలకు కూడా ఈమె జ్యోతిష్యం చెప్పగల ధీశాలి. ఈమె 25 సంవత్సరాలుగా ఆస్ట్రోఆర్కిటిక్ట్‌గా ఎన్నో నిర్మాణాలకు డిజైన్‌ చేసింది. ఈమె సలహాననుసరించి నిర్మాణాలు చేసిన వారు ఎక్కువ బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులే.

ఈరోజుల్లో జ్యోతిష్య శాస్త్రం
sinha4ఈ అంశం గురించి కూడా సిన్హా ప్రస్తావిస్తూ, ‘ఈ శాస్త్రం ఎప్పటికీ ఉంటుంది. అదీకాకుండా ఈరోజుల్లో ఈ శాస్త్రానికి ఎంతో ఆదరణ కూడా పెరిగింది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయి, ఆకాశ హర్మ్యాలు పెరిగిపోయిన తర్వాత చిన్నకుటుంబాలు కూడా అదే రీతిలో పెరిగిపో యాయి. అందువలన ఎన్నో ప్రతికూల పరిస్థితులు, చికాకులు కూడా కుటుంబాల్లో పెరిగిపోయాయి. ప్రతివారు ఏదో ఒక సమస్యతో సతమతం అవ్వడం ఎక్కువైపోయింది. ఆరోగ్యపరంగాను, ఆదాయ పరంగాను , సోసైటీ పరంగాను, కుటుంబపరంగాను అనేక విధాలుగా ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తున్నారు.

అందువల్ల వారంతా జ్యోతిష్య శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికీ పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా చుట్టు పక్కల పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మానసిక ప్రశాంతతని కోరుకుంటున్నారు. మనం కనుక ఈ జ్యోతిశ్శాస్త్రాన్ని ఒక దీపంలా ఉపయోగించుకోగలిగితే, అదే ఎంతో సహాయకారిగా మనకి దారి చూపించగలదు. జీవితం, ఆరోగ్యం, వివాహం వంటి సమస్యలకు ఈ శాస్త్రం చక్కటి మార్గాన్ని చూపెడుతుంది. ఏ వ్యక్తి తలరాతనీ ఎవరూ మార్చలేరు. కానీ, జ్యోతిశ్శాస్త్రాన్ని గనుక సరిగ్గా వినియో గించుకోగలిగితే జీవితంలో తప్పకుండా బాధలు తొలగిపోయి, ఎంతోకొంత ఉపశమనం కలగకమానదు.

కుటుంబీకులు, వ్యాపారులు, ప్రముఖులు మాత్రమే కాకుండా ఎందరో విద్యార్ధులు కూడా సలహాలు అడ గటానికి నా దగ్గరకు వస్తున్నారు. ఎక్కువగా వాళ్ళు వాళ్ళ ఉన్నత విద్య గురించి, కెరీర్‌ గురించి ప్రశ్నలు అడుగుతూవుంటారు. ఎవరు ఏ సమస్యతో నా దగ్గరకు వచ్చినా వారికి ముందుగా నేనొక సలహానిస్తాను. మంచి కర్మలు ఆచరించండి, విధి బాగా లేదు అంటూ ప్రతీదానినీ వదిలేయకండి అంటూ చెప్తాను. కొందరు మీరు చెప్పినట్టే చేసాం అయినా చెప్పింది జరగలేదు అంటూ ఉంటారు. అది పూర్తిగా విరుద్ధం. చెప్పింది చెప్పినట్టు చేస్తే జరగనిదంటూ ఏదీ ఉండదు. లోపభూయిష్టంగా చేసే పని వల్ల ఫలితాలు రమ్మంటే రావు అంటూ తన ఆస్ట్రోఆర్కిటిక్ట్‌ పరిశోధనా అనుభవంతో చెప్తూ ప్రసంగాన్ని ముగించింది.

సిన్హా అనుభవ పాఠం
sinhaఈ రంగంలోకి తాను రావడానికి గల కారణాన్ని వివరిస్తూ, సిన్హా ఎన్నో విశేషాలు చెప్పింది. ‘నేను ఒకరోజు మా పక్కింట్లో ఉంటున్న డా ఎల్‌.ఎన్‌. కుసుమతో మాట్లా డుతూ ఉన్నాను. అతను ఒక హోమి యోపతి, కాస్మిక్‌ రీసెర్చి సైంటిస్ట్‌. అతడు నా జీవితం గురించి మూడు అంశాలు చెప్పాడు. వాటిని నేను వెంటనే నమ్మలేదు కానీ వారం తర్వాత అతను చెప్పి నవి జరిగాయి. నేను ఏదో సంభ్రమలో పడిపోయాను . అదే సమయంలో నాగురించి ఇతరులు చెప్పడం కూడా అసహ్యం అనిపించింది. అప్పటి నుండి ఈ శాస్త్రం అభ్యసించాలన్న పట్టుదల పెంచుకున్నాను.అప్పడు నా వయసు 24 ఏళ్ళు. ఇప్పుడు 51 సంవత్సరాలు . అయినా ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top