You Are Here: Home » సినిమా » పాటలు » భలేతమ్ముడు (1969)- నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే

భలేతమ్ముడు (1969)- నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే

పల్లవి :
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే (2)

చరణం : 1
అహహా ఆ… అహహా ఆ…
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని (2)
కనుల తెరచీ విలువ తెలిసి (2)
మనసే గుడిగా మలచితిని ॥

చరణం : 2
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను (2)
ఆరని వలపుల హారతి వెలుగుల (2)
కలకాలం నిను కొలిచెదను॥

చరణం : 3
చిలిపిగ కసిరే…
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన (2)
ఆ చెలినే అందుకున్నాను (2)
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే

చిత్రం : భలేతమ్ముడు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top