You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » భక్తుల పాలిటి కల్పతరువు… నెమలిగుండ్ల రంగనాయకుడు

భక్తుల పాలిటి కల్పతరువు… నెమలిగుండ్ల రంగనాయకుడు

భక్తుల పాలిటి కల్పతరువు… నెమలిగుండ్ల రంగనాయకుడు

మయూర మహర్షి కఠోర తపస్సును మన్నించి విష్ణుమూర్తి భూలోకంలో రంగనాయక స్వామిగా అవతరించిన దివ్యక్షేత్రమే నెమలిగుండ్ల. అంతేకాదు… మహావిష్ణువు ‘రంగ’ మానవ కన్యను వివాహమాడినందును స్వామికి రంగనాయకుడనే పేరు స్థిరపడింది. ఆంధ్రరాష్ట్రంలో అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన క్షేత్రంగా వెలుగొందుతున్న రంగనాయక స్వామి క్షేత్ర విశేషాలు ఈవారం ‘ఆలయం’లో…
Ranganyaka_swami_నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కుపు టమతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖం ఆకారంతో వుండి మహర్షిచే నిర్మితమైనందున నెమిలిగుండం అనే పేరు సార్ధకమైనది. దీని చెంతనే మహ విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.

స్వామి చరిత్ర…
Nemaligundla_Jalapathamనల్లమల కొండలలో ఇసుకగుండమనే చోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్ళీడుకొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనే తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడిచేసింది. మనోభీష్ట సిద్దికొసం మహర్షితో కలసి తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసంన్నుడై రంగను భార్యగా స్వీకరించాడు. మయార మహర్షి కోరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా వేలాది కుటుంబాల ఇలవెలుపుగా పూజలందుకుంటున్నాడు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత, గొప్పదనం నెమిలిగుండ్ల రంగనాయక స్వామికి వుంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఏటా చైత్రమాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియ తిథుల్లో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు.

ఎక్కడుంది..?
Gopuramప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలొమీటర్ల దురంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమిలిగుండ్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది. ఈ క్షేత్రానికి చేరువలో ఉన్న నెమలిగుండ్ల జలపాతం… గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండలు మధ్య జాలు వారి నెమిలిగుండంలోకి చేరుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top