You Are Here: Home » ఇతర » భక్తి శ్రద్ధలకు తార్కాణం మిలాద్‌ ఉన్‌ నబీ

భక్తి శ్రద్ధలకు తార్కాణం మిలాద్‌ ఉన్‌ నబీ

అబ్బాసీయ ఖలీఫా హారూన్‌ అల్‌-రషీద్‌ తల్లి ’అల్‌-ఖైజురన్‌’ తన కాలంలో ఇస్లామీయ ప్రవక్త ముహమ్మద్‌ జన్మతిథిని పురస్కరించుకొని, ప్రవక్త జయంతి ఉత్సవాలు ప్రారంభించింది. ఈ ఉత్సవాలనే మౌలీద్‌ షరీఫ్‌ అంటారు. ముహ మ్మద్‌ ప్రవక్త జన్మించిన ఇంటిని ఖైజురన్‌, ఓ ప్రార్థనాలయంగా మార్పు చేసింది. ముహమ్మద్‌ ప్రవక్త పరమదించిన నాలుగు శతాబ్దాలవరకూ, జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఏవీ లభించలేదు. తరువాత కాలంలో ఇవి ఈజిప్టులో మొదలయ్యాయి.

milaadఫాతిమిద్‌ ఖలీఫాల కాలంలో, వీరు ముహమ్మద్‌ ప్రవక్త కుమార్తె ఫాతిమా జహ్రా వంశస్థులు మొదట ’మీలాదె నబీ’ ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు, సూఫీ తరీఖాలకు అనుగుణం గా వుండేవి. ఈ ఉత్సవాలలో ముహమ్మద్‌ ప్రవక్త వంశస్థులు అహ లె బైత్‌కు, చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్‌ను పఠించడంతో పాటు ఇతర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించేవారు.చరిత్రలో సున్నీ ముస్లింల్లో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్ద కాలం లో సిరియాలో ‘నూరుద్దీన్‌’ ఆధ్వర్యంలో జరిగాయి. అదే విధంగా స్పెయిన్‌, మొరాకోల్లో కూడా నిర్వహించారు. అయ్యూబీల కాలం లో, తాత్కాలికంగా కొంతకాలం పాటు నిలిపివేసారు. ఇవి ఆ తరు వాత కుటుంబ ఉత్సవాలుగా మారాయి.

కాని సలాఉద్దీన్‌ అయ్యూబీ బావయైన ముజఫ్ఫరుద్దీన్‌ ఆధ్వర్యంలో మళ్ళీ అధికారికంగా 1207 ఇరాక్‌లోని మోసుల్‌ పట్టణంలో ’మౌలీద్‌’ లేదా ’మీలాద్‌’ ఉత్సవాలు ఆరంభమైనవి. ఈ ఉత్సవాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈజిప్టులోని కైరో నగరానికి కూడా వ్యాపించాయంటే ఈ ఉత్సవాల్ని ప్రజలు ఎంత శ్రద్దా భక్తులతో నిర్వహించేవారో తెలుస్తుంది. ఉస్మాని యా ఖలీఫా అయిన మురాద్‌3 కాలంలో ఉస్మానియా సామ్రాజ్యం లోకి ఇవి 1588 లో ప్రవేశించాయి. 1910, లో ఉస్మానియా సామ్రాజ్యంలో, జాతీయ పర్వంగా ప్రకటింపబడినది. అనేక దేశాల లో కూడా మీలాద్‌, అధికారికంగా గుర్తింపబడినది

విధానము
మిలాద్‌-ఉన్‌-నబి జరుపుకునే సాంప్రదాయంలో, మసీదుల్ని అలం కరిస్తారు, మీలాద్‌ జరుపుకునే ప్రదేశాలను, మీలాద్‌ ఘర్‌లనూ కూడా అందంగా అలంకరిస్తారు. ముహమ్మద్‌ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవిత చారిత్ర, జీవనశైలి గురించి వర్ణిస్తారు. ఖసీదా బుర్దాలను పఠిస్తారు. పిండి వంటకాలను తయారుచేసి పంచిపెడతారు. నాత్‌ క్వానీ కార్యక్రమం సర్వసాధారణం. ప్రపంచ నలుమూలల్లో అత్యం త భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. చిత్రం ఏమిటంటే, సౌదీ అరేబియాలో ఈ మిలాద్‌ ఉన్‌ నబి పండు గరోజును జాతీయ శెలవుగా ప్రకటించలేదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top