You Are Here: Home » చిన్నారి » కథలు » భక్తి కథలు

భక్తి కథలు

(గతవారం తరువాయి)
Untవైకుంఠంలో శేషపాన్పుపెై పవళించిన శ్రీమహావిష్ణువును కనులారాగాంచిన చిత్రరూపుడు సాష్టాంగ దండప్రమాణాలా చరించి, వినయంగా నిల్చున్నాడు. స్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ, కైలాసవా సుడెైన శంకరుని యోగక్షేమాలు విచారిం చి, ఏమీ తెలియని అమాయకునిలా ‘ముఖ్యమైన ఏదెైనా దేవకార్యం మీద వచ్చావా!’ అని అడిగాడు. చిత్రరూపుడు వినయంగా విషయాన్ని తెలపడంతో శ్రీమహావిష్ణవు చిరుదరహాసంతో, జగన్మో హానాకరామైన తురగరూపాన్ని ధరించి కాళిందీ తమసాసంగమ ప్రదేశానికి భూలో కనాకి విచ్చేసి అశ్వినీ రూపుధారిణియైన లక్ష్మీదేవిని చూసాడు. ధ్యానంలో వున్న లక్ష్మీదేవి ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరచి చూసింది. ఎదురుగా అశ్వరూ పంలో వున్న భర్త మహావిష్ణువుని గుర్తించి పొంగి వచ్చిన దుఃఖంతో అతని చెంతకు చేరింది. శ్రీహరికి గుండె కరిగింది. ఒక్కసారిగా ఇద్దరూ మన్మథ బాణాలకు గురి అయ్యా రు. అనురాగం పరవళ్లు తొక్కడంతో గాఢంగా కలుసుకున్నారు.

ఆ పావనసంగమంలోనే అశ్వినీరూపధారి యైన లక్ష్మీదేవి ఒక చక్కని బాలుడిని ప్రసవించింది. ఇద్దరూ అశ్వరూపాలు విసర్జించి, లక్ష్మీ నారాయణులుగా రూపా లు ధరించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ‘పద వెైకుంఠానికి పోదామని’ లక్ష్మీదేవి చేయిపట్టుకున్నాడు. లక్ష్మీదేవి అంగీకరించలేదు. ‘కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను వదలి ఎలా రాగలను?’ అని అడిగింది.నారాయణుడు చిరుమందహాసంతో, ‘దేవీ! ఈ బాలుని కోసం నీవు దిగులుచెందకు. వీడిని ఇక్కడే వుండనీ. ఈ భూలోకంలో యయాతి కొడుకు తుర్వసుడు అనే మహా రాజుకు సంతానం లేదు. అతను సంతానా ర్థియై నా కోసం ఇక్కడ సమీపంలోనే తపస్సు చేస్తున్నాడు. అతనినే హరివర్మ అని కూడా అంటారు. అతని కోసమే ఈ పుత్రరత్నాన్ని సృష్టించాను. ఇప్పుడే అక్కడికి వెళ్ళి హరివర్మను ప్రేరేపిస్తాను.

అతను ఆనందించి ఈ బాలకుని తీసుకు వెళ్ళి సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు’ అని చెప్పడంతో లక్ష్మీదేవి సంతోషించింది. గరుడవాహనుడు అక్కడ ప్రత్యక్షమవడం తో లక్ష్మీనారాయణులు గరుడ వాహనాన్ని అధిరోహించి వెైకుంఠానికి తరలి వెళ్ళబో తూ దారిలో హరివర్మకు దర్శనమిచ్చి పుత్రుడు లభించే పావనసంగమ ప్రాంతం గురించి తెలియజేసి ఇరువురూ అంతర్థాన మయ్యారు. లక్ష్మీనారాయణుల సంతానమే హరివర్మకు పుత్రుడెై ఏకవీరుడనే నామం తో పెరిగి పెద్దవాడెై రాజ్యపాలన చేసి, ఏకావళిని వివాహం చేసుకొని ప్రఖ్యాతి చెందాడు.
– మహాభాష్యం నరసింహారావు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top