You Are Here: Home » ఇతర » బ్యూటీ కిక్‌

బ్యూటీ కిక్‌

‘అందం అతివలను ఆలోచింప చేస్తోంది. నలుగురి దృష్టిలో పడే మోడలింగ్‌ పట్ల ఆసక్తి చూపుతోంది. ర్యాంప్‌పై నడవడమంటే యువతరంలో అదో ్రేకజ్‌.. తోటి స్నేహితుల నడుమ తారా జువ్వల్లా దూసుకుపోవాలన్న తపన..నలుగురిలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవాలన్న కోరిక పెరుగుతోంది. అరుుతే ఈ రంగంలో రాణించాలంటే అందంతో పాటు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నలుగురిలో చొచ్చుకుపోతూ కలుపుగోలు స్వభావం ఉన్న వారే ఈ రంగంలో రాణిస్తారు. అలాంటి కోవలో భాగ్యనగర యువత చేరుతోంది. అందాల ప్రపంచం చుట్టూ ఆశలు పెంచుకుంటోంది. గ్లామర్‌ రంగంలో రాణించాలని తపన పడుతోంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో మే క్వీన్స్‌ అండ్గ ప్రిన్స్‌ పోటీల్లో యూత్‌ పాల్గొని సందడి చేశారు. ఆ అందాల బ్యూటీ పోటీలపై ఈవారం ‘స్టైల్‌’లో ప్రత్యేక కధనం ఇది…’

F1అందం ఎవరి సొంతమూ కాదు. అందాన్ని మరింత పెంచే సౌందర్య సాధనాల వినియోగంలో యువతులు ముందుంటున్నారు. అందానికి మెరుగులు దిద్దుకుని ర్యాంప్‌పెై తమ అందచందాలను ప్రదర్శించేందుకు నేడు యువతీ యువకులు సై అంటున్నారు. కొత్త రకం డ్రస్సింగ్‌ను కోరుకునే వారికి సరికొత్త రీతిలో వాటిని పరిచయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. క్రేజ్‌ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న కోరిక కూడా యూత్‌లో పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతుండడంతో ఏ ఫ్యాషన్‌ అందుబాటులోకి వచ్చినా వాటికి అనుగుణంగా డ్రస్సింగ్‌లు మారుతున్నాయి. నేటి కాలేజీ యువతీ, యువకుల్లో ఫ్యాషన్‌ పట్ల మక్కువ పెరుగుతోంది. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్యాషన్‌షోలు కామన్‌గా మారడంతో ర్యాంప్‌పెై అప్పుడప్పుడు తళక్కుమంటున్నారు. కొత్తగా ఏ ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలెైనా ఆ ఉత్పత్తులను ఫ్యాషన్‌షోల ద్వారా భాగ్యనగరవాసులకు పరిచయం చేస్తుండడంతో ఫ్యాషన్‌ పట్ల మక్కువ పెరుగుతోంది.

యువతలో సరికొత్త జోష్‌…
భాగ్యనగరంలో యూత్‌ నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోలు కిక్కెక్కిస్తున్నాయి. అందాల భామలు ర్యాంప్‌పెై క్యూట్‌ క్యాట్‌వాక్‌తో తళుక్కుమంటున్నారు. తమ అందచందాలతో హొయలొలికిస్తున్నారు. సెలబ్రిటీల కోసం వెరెైటీ కలెక్షన్స్‌ను నగరవాసులకు ఈ షోల ద్వారా పరిచయం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ క్లబ్‌లో మే క్వీన్స్‌ అండ్‌ ప్రిన్స్‌ పేరుతో నిర్వహించిన పోటీల్లో యువతరం సందడి చేశారు. ఈ పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గా అక్షిత, సెకడ్‌ రన్నరప్‌గా అనుష్క కృష్ణ దాస్‌, మే క్వీన్‌గా ప్రీతీతాపాలు నిలిచారు. ఈ షోలో నీలంకి, నివేది, పవిత్ర, సోఫియా, పూర్ణిమ, రీతి, శీతల్‌, త్రిసలా తదితరులు తళుక్కుమన్నారు.

చదువుకుంటూనే పోటీల్లో…
30FEAచదువుతోపాటు ఫ్యాషన్‌షోలలో దర్శనమిచ్చి తమ ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. కాలేజీల్లో జరిగే ఫ్యాషన్‌షోలతో పాటు బయట జరిగే షోలలో కూడా తళుక్కుమంటున్నారు. దీంతో విద్యార్ధులకు ఫ్యాషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో సైతం కేంద్రాలు వెలుస్తున్నాయి. శిక్షణతోపాటు అవసరమైన ఉపాధిని కూడా కల్పించేలా ఆ సంస్థలు భరోసా ఇస్తుండడడంతో డిగ్రీలు చదువుకుని సమయం వృధా కాకుండా చదువు పూర్తి కాగానే ఉపాధినిచ్చే కోర్సుల పట్ల యువతరం ఆసక్తి పెంచుకుంటోంది.

అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతుండడంతో ఏ ఫ్యాషన్‌ అందుబాటులోకి వచ్చినా వాటికి అనుగుణంగా డ్రస్సింగ్‌లు మారుతున్నాయి. నేటి కాలేజీ యువతీ, యువకుల్లో ఫ్యాషన్‌ పట్ల మక్కువ పెరుగుతోంది. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్యాషన్‌షోలు కామన్‌గా మారడంతో ర్యాంప్‌పెై అప్పుడప్పుడు తళక్కుమంటున్నారు.

ఇస్కా రాజేష్‌బాబు, ‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, శరత్‌, రమణాచారి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top