You Are Here: Home » ఇతర » బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌

అప్పుడప్పుడు చిన్నస్థాయి పరిశ్రమలను నిర్వహించడంలో ఎదురయ్యే సమస్యల గురించి కొంత మంది మహిళలు మా వద్దకు వచ్చేవారు. ఓరోజు కూరగాయల వ్యాపారి అరుణ గైక్వాడ్‌ తన సమస్యకు పరిష్కారం సూచించమంటూ వచ్చింది. ఆ సంఘటన మమ్మల్ని ఆలోచనలో పడేసింది. ఇలా అరుణలా ఏదో చేయాలన్న ఆలోచన వున్నా అందుకు కావాల్సి న తెలివితేటలు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలు బాధ పడుతున్నారు. వారిని ఆ సమస్యల నుంచి విముక్తుల్ని చేయాలన్న ఆలోచనే బిజినెస్‌ స్కూల్‌ స్థాపనకు నాంది’’. ఇటువంటి తరహా బిజినెస్‌ స్కూల్‌ దేశంలో ఎక్కడా లేకపోవడం వలన స్కూలు ఏర్పాటు కొంచెం కష్టమే అయింది. బ్యాంకే స్వంతంగా ఒక మోడల్‌ను రూపొందించింది. ఇక కోర్సు లను డిజైన్‌ చేయడం కూడా ఒక సవాల్‌. విద్యార్థులు ఎవరి మార్కెటింగ్‌ తామే చేసుకోవ డానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. కోర్సు మెటీరియల్‌ మొత్తం ప్రాక్టికల్‌గా, ఎక్కువగా వీడియో ప్రోగ్రాములతో విద్యార్థులకు అర్ధమయ్యేలా, ఆసక్తికరంగా బోధిస్తున్నారు.

రాష్ర్టంలో లెక్కలేనన్ని వొకేషనల్‌ కాలేజీలు ఉన్నాయి. కానీ వాటికీ, మా బిజినెస్‌ స్కూల్‌కు చాలా తేడా ఉంది. వొకేషనల్‌ కాలేజీలు వృత్తివిద్యా శిక్షణ మాత్రమే ఇస్తాయి. కానీ ఇక్కడ శిక్షణతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, విజయవంతమైన వ్యాపారులు అయ్యేందుకు కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుంది. ‘‘మా దగ్గర శిక్షణ పొందిన యువతులు ఇంగ్లీషు కూడా నేర్చుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడంలో సఫలీకృతులవుతున్నారు.

30 రూపాయలు సంపాదించే రోజుకూలీ నుండి నేడు రోజుకు రూ. 120 సంపాదించే వ్యాపారులుగా ఎదిగారు. ఇది మా కృషికి నిదర్శనం. మొదట మహిళా సహకార బ్యాంక్‌… తర్వాత గ్రామీణ మహిళల కోసం బిజినెస్‌ స్కూల్‌…ఆ తర్వాత…? ‘‘బిజినెస్‌ స్కూల్‌ ఆన్‌ వీల్స్‌’’. స్కూల్‌కి వచ్చి శిక్షణ పొందలేని మహిళల దగ్గరకే ‘మన్‌దేశి ఉద్యోగిని’ తీసుకెళ్లాలన్న ఆలోచనతో బిజినెస్‌ స్కూల్‌ ఆన్‌ వీల్స్‌ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాము. దీని గురించి పటిష్టమైన ప్రణాళిక రూపొందించాల్సి వుంది.’’ అని చేతన తెలిపారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌
మనదేశి బ్యాక్‌ ఆర్గనైజెషన్‌కు ప్రత్యేక బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఉంది. చేతనా విజయ్‌ సిన్హా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్‌ ఛైర్మన్‌ మంజుశా రాజ్‌కుమార్‌ సూర్యవన్సితో పాటు మరో 15మంది మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారు. దీనితో పాటు స్వయం సహాయక బృందానికి ప్రత్యేక కమిటీ ఉంది. ఇంకా చేతనా గలా సిన్హా వ్యవస్థాపకురాలిగా ఉన్న ఈ సంస్థలో రేఖాకులకర్ణి (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి), వనితా షిండె( చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి), సుష్మా షిండే(చీఫ్‌ ఫైనాన్సియల్‌ అధికారి)లుగా వ్యవహరిస్తున్నారు.

లైఫ్‌ రెయింబో లాంటిది.
ఒకో ఎమోషన్‌ ఒకో రంగులాంటిది.
ఇల్లు కూడా రెయింబోలాంటిదే
దానికి కూడా ఒక ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి చూడండి.
ఇక్కడ క్రియేటీవ్‌గా ఆలోచించడమే కాదు.
మన క్రియేటీవిటీకి సింబల్‌గా నిలిచే ల్యాంప్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి .
లైఫ్‌లో సరికొత్త రంగును అద్దండి.

రోజూ ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్లలో మీరూ ఒకరా? ఎలా రిలాక్స్‌ అవ్వాలి, ఏం చేస్తే ఈ టెన్షన్‌ పోతుంది అని మరింత టెన్షన్‌ పడుతున్నారా..? దానికి అంత టెన్షన్‌ పడటమెందుకు ఇలా చేసి చూడండి పదినిమిషాల్లో టెన్షన్‌ఫ్రీ అయిపోతారు.గాలి వీస్తున్న చోట అటు, ఇటూ కాసేపు రిలాక్స్‌డ్‌గా నడుస్తూ ఉండాలి.స్ఫూర్తి కలిగించే నాలుగైదు మంచి మాటలని ఒకసారి తిరగేయండి. పాతపుస్తకాలలోనైనా సరే… ఇవి మంచి స్ఫూర్తినిస్తాయి.రాత్రివేళ ఎక్కువసేపు నిద్రకు కేటాయించాలి. అప్పుడు మైండ్‌ రిఫ్రెష్‌ అవు తుంది. ఎక్కువసేపు టీవీ చూ డటం అలవాటు చేసుకోకూడదు… ఆశావహ దృక్పథాన్ని అలవర్చు కోవాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనైనా చేయగలననే ధీమాను ఏర్పరుచుకోవాలి. అనుభూతులని కుటుంబసభ్యులతో పంచుకోవాలి.

అపుడు ఎంతో ఓదార్పు లభిస్తుంది.ఇష్టమైన ఆహార పదార్థాలను హాయిగా తినడం ఒక పద్ధతి.హాబీలేమైనా ఉంటే వాటిని ఈ సమయంలోనే చేపట్టాలి. దీనివల్ల దృష్టి అంతా ఇష్టమైన పనులమీదకి మరలడంతో తెలియకుండానే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాసేపు నవ్వు తెప్పించే కార్టూన్‌లని చూడాలి. దీంతో మనసారా నవ్వుకోగల్గుతారు.బాగా ఇష్టమైన స్నేహితులకు ఫోన్‌ చేసి కాసేపు మాట్లాడచ్చు. అలాగని గంటల తరబడి కాకుండా…అవతలవారి సమయాన్ని బట్టి మాట్లాడాలి. దీనివల్ల టెన్షన్‌ పడుతున్నాం అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోగల్గుతారు. లేకపోతే ఆత్మీయులకు ఇష్టమైన ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంప వచ్చు. ‚ఆఫీసులో కూడా సన్నిహితులతో కాసేపు క్యాంటీన్‌కొచ్చి వీలై తే నాలుగు మాటలు..ఒక కప్పు కాఫీ…అయితే ఇవన్నీ ఒక ఎత్త యితే…రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ మరొక ఎత్తు…రోజులో రెండు లేక మూడు సార్లు కనీసం ఒక పదినిమిషాలు మౌనముద్రలో ధ్యానం చేయండి…ఆ కాసేపు వేరే ఏ ఆలోచనా చేయకండి…

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top