You Are Here: Home » ఇతర » బెస్ట్‌ షాపింగ్‌

బెస్ట్‌ షాపింగ్‌

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో విదేశాల నుండి పర్యటనకు వచ్చే వారు షాపింగ్‌కు ఎక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో సర్వే జరిపారు….. ఢిల్లీకి చెందిన బ్లూ గ్లోబల్‌ సంస్థ. ఈ సర్వే వివరాలను గ్లోబ్‌ షాపర్స్‌ పేరుతో ఓ ఇండెక్స్‌ను ప్రచురించింది. ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో ఉత్తమ షాపింగ్‌ ప్రాంతాలను గుర్తించి వాటికి ర్యాంకింగ్‌ ఇచ్చారు. విదేశీయులు ఎక్కువగా ఏఏ ప్రదేశాలలో వారికి ఇష్టమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు…. షాపింగ్‌కు అనువైన పరిస్థితితులు, రవాణా, హోటళ్లు, అక్కడి వాతావరణం వంటి విషయాలపై సర్వే జరిపి ఈ ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ 10 స్థానంలో నిలవగా, బెంగళూరు 14 స్థానంలోనూ, ముంబారుు 16వ స్థానాల్లో నిలిచారుు.

మన రాజధాని ఢిల్లీలో కొనుగోలు వస్తువులు, అమ్మకందార్ల మంచి పనితీరు, రవాణా, హోటళ్లు ధరలు, రవాణా సదుపాయాలు ఇతర నగరాల్లో కంటే మెరు గైనవిగా నిలిచాయి. కొనుగోలుదార్లు ఢిల్లీలో ఉన్న పరిస్థితి తులను వారు భరించగలిగే శక్తి ఉండటంతో ఢిల్లీ షాపింగ్‌ స్కోర్‌ పెరిగింది. ఢిల్లీ నగరం యొక్క అమ్మకాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు మంచి స్కోర్‌ రావటానికి సహాయప డింది. ఢిల్లీలో సంవత్సరం పొడవునా జరిగే అమ్మకాలు… ఆఖరి13 వారాల అమ్మకాలు, వచ్చిన విదేశీయులు వంటివి కూడా లెక్కల్లోకి తీసుకున్నారు. ఢిల్లీలో కొనుగోలుదారుల బేరసారాలు అనుకువుగా ఉండటంతో విదేశీయులు ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.

జాతీయ రాజధాని వాతావరణం, పర్యాటక ప్రదేశాలు కూ డా కలిసివచ్చాయి. అలాగే ప్రజా రవాణా, వస్తువుల నాణ్య త, ఎలక్ట్రికల్‌ వస్తువులు, కొన్ని విలాసవంతమైన వస్తువుల ను ఖరీదు అందరికీ అందుబాటులో ఉన్నాయి. గ్లోబల్‌ బ్లూ సంస్థ… గ్లోబ్‌ షాపర్‌ ఇండెక్స్‌ పేరుతో ఇప్పటికే 33 ఐరోపా నగరాలు, 25 ఆసియా పసిఫిక్‌ నగరాల్లో వీటిపై సర్వే జరిపింది. ఇక్కడ కూడా కొనుగోలు దారుల శక్తి, రవాణా, హోటళ్ళు, సంస్కృతి, వాతావరణం వంటి ఐదు కేటగిరిల్లో ఈ సర్వే జరిపారు.

1. హాంగ్‌కాంగ్‌
8Shanaహాంగ్‌కాంగ్‌లో షాపింగ్‌ ఈ నగరం యొక్క సంస్కృతిలో ఓ భాగం. ఈ నగరంలో షాపింగ్‌కు సంబంధించి ప్రధాన ఆకర్షణ ఎమిటంటే…. ఫ్యాషన్‌, ఎలక్ట్రానిక్స్‌, అభరణాలు ప్రధానమైనవి. ఈ నగరంలో జరిగే షాపింగ్‌కు ఇచ్చిన మార్కులు 69. అలాగే దుకాణాలకు 83, సౌకర్యాలకు 64, హోటల్స్‌, రవాణాకు 72, సంస్కృతి, వాతావరణం వంటి విషయాలకు ఇచ్చిన మార్కులు 65.
2. కౌలాలంపూర్‌
ఇక్కడ ఉన్న పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్స్‌, అలాగే ఇక్కడ జరిగే షాపింగ్‌ ఉత్సవాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ వస్తువులు అన్నీ సరసమైన ధరలకే విక్రయిస్తుం టారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తులకు విస్రృత ప్రచారం జరుగుతుంది. ఈ నగరానికి వచ్చిన మార్కులు మొత్తం 65 కాగా, దాకాణాలకు ఇచ్చిన మార్కులు 76, సౌకర్యాలకు 63, హోటళ్ళు, రవాణాకు 61, సంస్కృతి, వాతావరణ విషయాలుకు 50 మార్కులు వచ్చాయి.

3.షాంఘై
4Banaషాంఘై సాంస్కృతిక ఆకర్షణలు ఒక అద్భుతమైన కళా ఖండం లాంటింది. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ గా వస్తుంటారు. ఇక్కడి సంప్రదాయ వస్తువులను తప్పని సరిగా కొనుగోలు చేస్తారు. ఇక్కడి పురాతన, ఆధునిక కలయికల సంస్కృతి అందరినీ అకర్షిస్తుంది. ఈ నగరానికి వచ్చిన మార్కులు 63. దుకాణాలకు 57, షాపింగ్‌ సౌకర్యాలకు 65, హోటళ్ళు, రవాణాకు 84, సంస్కృతి, వాతావరణ అనుకూలతలకు 50 మార్కులు ఇచ్చారు.
4.బీజింగ్‌
చైనా రాజధాని నగరం బీజింగ్‌. ప్రతిసంవత్సరం విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఆధునిక నగరం. నగరంలో పలు మాల్స్‌, స్టోర్లులలో అనేక అంతర్జాతీయ బ్రాండ్గ వస్తువులు దొరుకుతాయి. ఈ నగరానికి వచ్చిన స్కోర్‌ 61 పాయింట్లు, దుకాణాలకు వచ్చిన మార్కులు 49, షాపింగ్‌ సౌకర్యాలకు 61, హోటళ్ళు, రవాణాకు 79, సంస్కృతి, వాతావరణకు 57 మార్కులు ఇచ్చారు.

5. సింగపూర్‌
1Delhiసింగపూర్‌ ప్రపంచంలో ప్రముఖ షాపింగ్‌ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి వచ్చే వారిని నగర సంస్కృతి, సంప్రదాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ బ్రాండ్గ వస్తువులతో దుకాణాలు కళకళలాడతాయి. ఈ నగరంలో షాపింగ్‌కు 60 మార్కులు స్కోర్‌ రాగా… దుకాణాలకు 63, షాపింగ్‌ సౌకర్యాలకు 61, హోటళ్ళు, రవాణాకు 71, సంస్కృతి,వాతావరణ విషయాలకు 56 మార్కులు వచ్చాయి.
6. సిడ్నీ
ఆస్ట్రేలియా వాణిజ్య రాజధాని సిడ్నీ. ఇక్కడ సొగసైన మాల్స్‌, షాపింగ్‌ చేయడానికి అనుకూలమైన వాతావరణం, శక్తివతంతమైన సంప్రదాయం కొనుగోలుదార్లను ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ షాపింగ్‌ సమయం మ్త్రాం చాలా తక్కువ. ఈ నగరానికి 58 పాయింట్లు స్కోర్‌ రాగా, దుకాణాలకు 60, సౌకర్యాలకు 52, హోటళ్లు, రవాణా సదుపాయాలకు 76, సంస్కృతి, వాతావరణ విషయాలకు 71 మార్కులు ఇచ్చారు సర్వే నిర్వాహకులు.

7.బ్యాంకాక్‌
7Beijingబ్యాంకాక్‌ థాయిలాండ్గ గుండెలాంటిది. బ్యాంకాక్‌ షాపింగ్‌ స్వర్గంగా పేరుతెచ్చుకుంది. ఇక్కడ శక్తివంతమైన షాపింగ్‌ మార్కెట్లు, ఈ నగరంలో చౌకగా అధిక నాణ్యత గల హోటళ్ళు, మంచి ఆహారం ఇక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ నగర షాపింగ్‌కు మొత్తం 57 పాయింట్లు రాగా, దుకాణాలకు 55, షాపింగ్‌ సౌకర్యాలకు 50, హోటళ్లు, రవాణాకు 61, సంస్కృతి, వాతావరణంకు 50 మార్కులు ఇచ్చారు.
8 టోక్యో
జపాన్‌ రాజధాని నగరం, టోక్యో ఖరీదైన బ్రాండు వస్తువులతో నిండి ఉంటాయి. ఇక్కడి డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, మాల్స్‌ వీటికి ప్రసిద్ధ చెందాయి. ఇక్కడ కొనుగోలుకు 56 పాయింట్లు స్కోర్‌ రాగా, అమ్మకాలు జరిపే దుకాణాలకు 62 మార్కులు పడ్డాయి. కొనుగోలు సౌకర్యాలకు 45, హోటళ్లు, రవాణాకు 92, సంస్కృతి, వాతావరణ విషయాలపై 64 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది.

9. సియోల్‌
5Sydaసియోల్‌కు ప్రపంచవ్యాప్తంగా విదేశీ పర్యాటకలు ఎక్కువగానే వస్తుంటారు. ఇక్కడ విదేశీయులకు ఆకర్షణీయమైన షాపింగ్‌ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి జానపద ప్లీ మార్కెట్‌, నండిముమ్‌, గోడింగ్‌డాంగ్‌ మార్కెట్లు మంచి షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తాయి. ఇక్కడి పరిస్థితుల సర్వేజరిపి మొత్తమీద సియోల్‌లో విదేశీయుల షాపింగ్‌కు 55 మార్కులు ఇచ్చారు. ఇక్కడి అమ్మకపు దుకాణాలకు 54, షాపింగ్‌ సౌకర్యాలకు 57, హోటళ్ళు, రవాణాకు 66 మార్కులు ఇచ్చింది సర్వే సంస్థ గ్లోబ్‌ షాపింగ్‌.
10.ఢిల్లీ
ఢిల్లీలో ఎప్పుడూ విదేశీ సందర్శకులతో బిజీబిజీగా ఉంటుంది. వారితో పాటు మన దేశస్థులు పర్యటనకు వెళ్ళినప్పుడు ఢిల్లీలోనే ఎక్కువగా తమకు కావలసి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ అమ్మకాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రపంచంలోనే అత్యవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఢిల్లీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ నగరంలో అమ్మకాలకు…సర్వేలో 53 పాయింట్లు స్కోర్‌ వచ్చాయి. వీటిలో అమ్మకాలు జరిపే దుకాణాలకు 40 మార్కులు, ఆర్థిక స్తోమత కొనుగోలుకు 63 మార్కులు, షాపింగ్‌ సౌకర్యాలకు 58 మార్కులు, మోటళ్లు, రవాణాకు 57 మార్కులు, సంస్కృతి, వాతావరణ అనుకూలతకు 46 మార్కులు ఇచ్చారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top