You Are Here: Home » చిన్నారి » బెలూన్ కిందకు నెమ్మదిగా ఎందుకు దిగుతుంది?

బెలూన్ కిందకు నెమ్మదిగా ఎందుకు దిగుతుంది?

గాలితో నింపిన బెలూన్ నెమ్మదిగా కిందకు రావడాన్ని గమనించే ఉంటారు. అసలు బెలూన్లు అంత నెమ్మదిగా ఎందుకు కిందకు దిగుతాయి? మన చుట్టూ ఉండే గాలి ప్రతి వస్తువు ఉపరితలంపైన కాస్తంత ఒత్తిడిని కలుగుచేస్తుందని, దానినే పీడనం అంటారని మనకు తెలిసిందే. ఏదైనా వస్తువు గాలిలో ఉన్నప్పుడు దాని పైభాగంలో పై నుంచి కిందికి పనిచేసే గాలి ఒత్తిడి మాత్రమే కాకుండా కింది నుంచి పైకి పనిచేసే గాలి ఒత్తిడి కూడా ఉంటుంది.

నిజానికి గాలిలోంచి కిందికి జారుతుండే ఒక వస్తువుపై కాస్త శూన్యప్రదేశం ఏర్పడటం వలన ఆ వస్తువు పైభాగంలో కంటె కింది భాగంలో ఉండే గాలి ఒత్తిడే ఎక్కువగా పనిచేస్తుంది. గాల్లో ఒక వస్తువు కింద పడుతున్నప్పుడు ఉండే ఒత్తిడి ఆ వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణశక్తికి దాదాపు సమానంగా ఉంటేనే ఆ వస్తువు నిదానంగా కిందకు పడడం సాధ్యం అవుతుంది. గాలి నింపిన బెలూన్ కిందకు పడుతున్నపుడు దానికి సంబంధించిన ఒత్తిడి గురుత్వాకర్షణశక్తి కంటె కొద్దిగా మాత్రమే తక్కువగా ఉంటుంది. కాబట్టి బెలూన్ నెమ్మదిగా కిందకు దిగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top