You Are Here: Home » ఇతర » బెంగళూరుపై పెరుగుతోన్న మోజు

బెంగళూరుపై పెరుగుతోన్న మోజు

ట్రాఫిక్‌ సమస్య, ఇంటి అద్దెల భారం, గొలుసు చోరీలు, తాగునీటి సరఫరాలో అవకతవ కలు తదితర సమస్యలున్నా బెంగళూరుపై మోజు పెంచుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇండోనేషియా సమీపంలో ఏప్రిల్‌లో వచ్చిన భూకంప ప్రభావం బెంగళూరు లో కూడా కనిపించింది. బెంగళూరులో భూకంప తీవ్రత 2గా నమోదైంది. అరుుతే బెంగళూరు సముద్ర మట్టానికి మూడువేల అడుగులకు పైగా ఎత్తులో ఉండటంతో నగరానికి ఎటువంటి భూకంప సమస్య రాబోదని ఇప్పటిేక నిపుణులు తేల్చేశారు.

ఐ.టి., బి.టి., పరిశ్రమలు. వేగంగా విస్తరిస్తోన్న నగరం. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన. అపార్ట్‌మెంట్ల నిర్మాణం తదితర కారణాలతో నగరానికి వలస వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అన్నింటా సేఫ్‌ బోన్‌గా బెంగళూరు ఉన్నందేనే ఎక్కువమంది ఇష్టపడు తున్నారు. ఏడాదిలో కనీసం 8 నెలలు చల్లని వాతావరణం, వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కావడంతో పదవీ విరమణ చేసిన వారు కూడా ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు.


మూడో దశకంలో నగర జనాభా 7 లక్షలు. 8 దశకాల అనంతరం ఇప్పటివరకు అధికారిక లెక్కల మేరకు 85 లక్షలకు చేరింది. అనధికారిక లెక్కల మేనకు కోటి సంఖ్య ను దాటేసింది. వాహనాల సంఖ్య 40 లక్షల మార్కును ఎప్పు డో దాటేసింది. నగరం గ్రేటర్‌ బెంగళూరుగా మారిన తరువాత 950 చదరపు కి.మీ. మేర విస్తరించింది. అంతకుమునుపు బెంగళూరు నగరం 550 చ.కి.మీ. పరిధిలోనే ఉండేది. దశాబ్దం క్రితం చ.కి.మీ. 276గా ఉన్న జనసాంద్రత ఇప్పుడు 319కు చేరుకుంది.రాజధాని నగరంలో మెట్రో పనులు చురుకుగా సాగుతు న్నాయి.

ఇప్పటికే 7 కి.మీ. మార్గంలో రైలు సంచారం మొదలైంది. రానున్న రెండు మూడేళ్లలో మెట్రో రైలు మార్గం 12 కి.మీ. మేర పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. దీని కోసం ఇప్పటి కే భూసేకరణ పూర్తయింది. పనులు చురుకుగా కొనసాగుతు న్నాయి. గత బడ్జెట్లో నగరాభివృ ద్ధికి, రహదారుల స్థాయి పెంపొం దించేందుకు, సిగ్నల్‌ రహిత కారి డార్లను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రూ. 26,406 కోట్లను కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎక్కువ మందికి ఉపాధి అవ కాశాలు లభిస్తున్నాయి.

ఇదే క్రమంలో నగర కార్పొరేషన్‌ తన ఆదాయం మెరుగునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నగరంలో ఇళ్లు, ఇంటి స్థలాల సంఖ్య 16.18 లక్షలు. ఆస్తి పన్నుల వసూ ళ్లను చేపట్టేందుకు పాలికే వినూత్న మార్గాన్ని అనుసరిస్తోంది. ఆస్తి పన్ను చెల్లించేందుకు ఎవరూ కార్పొరేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్పొరేషన్‌ సిబ్బందే ఇళ్ల వద్దకు వచ్చి పన్ను కట్టించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీని కోసం సంచార కార్యాలయాన్ని బెంగళూరు మహానగర కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది.

సమయం, తీరుబడి, అవకాశం ఉన్న వారు స్థానిక పాలికే కార్యాల యాలకు వెళ్లి పన్ను చెల్లిస్తుం డగా, బకాయిలు ఉన్న వారు, ఆలస్యం చేస్తున్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి పన్నుల్ని వసూలు చేస్తు న్నారు. పెద్ద మొత్తంలో బకాయి పడి పన్ను చెల్లించకపోతే రెండు నోటీసుల్ని జారీ చేస్తారు. అప్ప టికీ పన్ను చెల్లించకపోతే ఆ సంకీర్ణం, భవంతి లేదా సంస్థ వద్దకు పది మంది డప్పు కొట్టే వాళ్లతో సిబ్బంది వస్తారు. పన్ను బకాయి చెల్లించండహో అంటూ గంటకు పైగా డప్పు కొట్టి వెళ్తారు. డప్పు కొట్టినందుకు, పన్ను సకాలంలో చెల్లించనం దుకు జరిమానాను కూడా బకాయిదారు పన్నుతో సహా చెల్లిం చవలసి ఉంటుంది.

గత ఏడాది నగరంలో వసూలైన ఆస్తి పన్ను రూ.774 కోట్లు. మొత్తం 16.18 లక్షల ఆస్తుల్లో పన్ను చెల్లింపు పరిధికి వచ్చే వారు 10.97 లక్షల ఆస్తులున్నాయి. గత ఏడాది పన్ను చెల్లిం చింది కేవలం 9.17 లక్షల మంది మాత్రమే. మిగిలిన 1.80 లక్షల ఆస్తులకు చెందిన యజమా నులు పన్నుల్ని చెల్లించలేదు. వారికి ఇప్పటికే రెండు సార్లు నోటీసుల్ని జారీ చేశారు.ఇంకా డప్పు కొట్టటమే మిగిలి ఉంది. కొత్తగా జారీలోకి తీసుకువచ్చిన విధానాలు, పన్ను బకాయిల వసూళ్లకు అనుసరి స్తోన్న మార్గాలతో ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో బకాయిలు వసూలయ్యే అకవాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్‌ నెల మొదటి వారం వరకు రూ. 1250 కోట్లు వసూలైంది.

ఈ ఏడా దిలో మొత్తం రూ. 1700 కోట్ల పన్నుల్ని బకాయిలతో కలిపి వసూలు చేయాలన్నది కార్పొరేషన్‌ లక్ష్యం. నోటీసుల జారీ, డప్పుల్ని మోగించిన తరువాత కూడా పన్ను చెల్లించకపోతే ఆస్తుల్ని సీజ్‌ చేస్తామని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మంచి స్పందన వచ్చింది. పన్ను వసూళ్లకు ఐ.డి.బి.ఐ. సహాయంతో కార్పొరేషన్‌ ఒప్పందాల్ని కుదుర్చు కుంది. సంచార కేంద్రాల నిర్వహణకు కావలసిన సాఫ్ట్‌వేర్‌, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, బ్యాకప్‌ సదుపాయాలన్ నింటినీ బ్యాంకు ప్రతినిధులే చూసుకుంటారు.

అపార్ట్‌మెంట్లు, గృహసముదా యాలు ఎక్కువగా ఉన్న చోటుకే బ్యాంకు ప్రతినిధులు వాహనాల్లో వెళ్లి పన్ను వసూళ్లను చేపడతారు. వీరికి అను బంధంగా 284 సహాయ కేంద్రాలు, 81 బెంగళూరు వన్‌ కేంద్రాలు, 64 సహా య రెవెన్యూ అధికారుల కార్యాలయాల్లో పన్ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. గడువు పూర్త యిన తరువాత పన్ను చెల్లించే వారికి బిల్లుపై అదనంగా ఐదు శాతం వడ్డిస్తామని కమిషనర్‌ శంకరలింగేగౌడ వివరించారు.

Unaకొత్తగా అనుసరిస్తోన్న విధానాలతో వృత్తి, ఆదాయ పన్నుల వ సూళ్లు, ఈ-రిటర్న్‌ల కన్నా ఎక్కువగా ఆస్తుల యజమానుల స్పందించి పన్నుల్ని చెల్లిస్తున్నా రని తెలిపారు. గ్రేటర్‌ బెంగ ళూరుగా మారిన తరువాత నగర పరిధిలోకి చేరిన ఏడు నగర సభలు, ఒక పుర సభల పరిధిలో ఇప్పటికే ఆస్తి పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈసారి అక్కడ కట్టుదిట్ట మైన విధానాల్లో పన్ను వసూళ్లు చేపట్టాలని నిర్ణయించారు.నగరాభివృద్ధికి కార్పొరేషన్‌ గత ఏడాది తన బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లను కేటాయించింది. ఈ ఏడాది రూ. 1500 కోట్లకు ఈ బడ్జెట్‌ చేరుకుంది. ఇదే క్రమంలో పాలికే తన ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు వేర్వేరు మార్గా ల్ని అన్వేషిస్తుంది.

ఇంటి వెలుపల కారును నిలిపితే ఏడాది కి రూ. 600, ద్విచక్ర వాహనాన్ని నిలిపితే రూ. 300, భారీ వాహనాన్ని నిలిపితే ఒకరేటు, ఆటోను నిలిపితే మరో రేటును వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి కార్పోరేటర్ల సమావేశంలో ఆమోదముద్ర కూడా పడింది. కేవలం అద్దె ద్వారా ఆదాయాన్ని పొందాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇంటి ఆవరణలో కారు ను, ద్విచక్ర వాహనాన్ని నిలుపుకునేం దుకు ఎక్కువ చోట్ల అవకాశం లేదు. దీంతో అద్దెలకు ఉంటున్న వారు తమ వాహనాల్ని తప్పనిసరిగా ఇంటి ముందే నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్నే కార్పొరేషన్‌ తన ఆదాయ వనరుగా భావించింది.

దీంతోపాటు హోర్డింగ్‌లు, ఆటోలు, ఇతర వాహనాల మీ ద ఉన్న ప్రకటనల ద్వారా మరింత ఆదాయాన్ని గడించేం దుకు ప్రణాళిక సిద్ధిం చేసుకుంది. నగరంలోని జనాభా, కొనుగోలు శక్తి, ఇతర స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని నగరాన్ని ఎ, బి, సి, డి జోన్ల కింద విడదీసింది. హోర్డింగ్‌ లకు చదరపు అడుగుకు కనీసం రూ.129ను, ఇతర జోన్లలో రూ.200, రూ.269లను పన్ను గా విధిస్తుంది.

ఆయా జోన్లకు అనుగుణంగా ఆస్తి పన్నుల్ని విధిస్తుంది. ఆటోలు, ఇతర వాహనాలపై ఉన్న ప్రకటనలకు కూడా కొంత రుసుం తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనను తీసుకువచ్చింది. నగరంలో ఆయా ప్రాంతాల్లో కబ్జాకు గురైన పాలికే ఆస్తుల్ని గుర్తించి స్వాధీనం చేసు కోవడంతో చొరవ ఎక్కువైంది. ఒత్తిళ్లను లెక్కించకుండా కోర్టు అనుమతితో ఆస్తుల్ని స్వాధీన పరుచుకుంటోంది. ఇప్పటి వరకు స్వాధీనపరుచుకున్న 919.19 ఎకరాల భూమికి రూ. 85.55 లక్షల ఖర్చుతో ఇనుప కంచెను ప్రహరీగా ఏర్పాటు చేసింది.

భూకంపం వచ్చినా గనరంలోని అపార్ట్‌మెంట్లు, నివాసాల కు ఏం జరగదని ఇప్పటికే నిపుణులు తేల్చడంతో ఫ్లాట్ల అమ్మకాలు, భూ క్రయ విక్రయాలు మళ్లీ ఊపందుకున్నా యి. అద్దె ఎక్కువ అనిపించినా తమకు వచే ఆదాయంలో 30 నుంచి 45 శాతం వరకు ఇంటి అద్దెకే కేటాయించే వారి సంఖ్య పెరిగింది. ఇళ్లలో అన్ని సదుపాయాల్ని ఉం డేలా చూసుకునే వారు ఎక్కువయ్యారు.
కార్పొరేషన్‌ చూపిన మార్గంలోనే బెంగళూరు నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రయాణిస్తున్నారు. బి-ట్రాక్‌ పేరిట ఏర్పాటు చేసిన పథకానికి ఇప్పటికే మంచి స్పందన లభిం చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని కూడా దక్కించుకుంది.

గత ఏడాది జరిమానాల రూపంలో రూ. 55 కోట్లను వసూలు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఏడా ది తమ లక్ష్యాన్ని రూ. 100 కోట్లకు ఉంచుకున్నారు. అలా వసూలవుతున్న మొత్తాన్ని ట్రాఫిక్‌ వ్యవస్థను మ రింత బలోపేతం చేసుకునేందుకు వినియోగించుకుంటు న్నారు. ఎక్కడి కక్కడ సి.సి కెమెరాలు, నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై డేగ కన్ను వేసి జరిమానాల్ని వసూలు చేస్తున్నారు. ఇదే కొనసాగితే నగరంలో వాహన రద్దీ అదుపులోకి వస్తుంది. నగర రహదారుల స్థితిగతులు మె రుగై ఆస్తుల రేట్లు మరింత పెరిగే అవకాశం కలుగు తుంది.

రాజధాని నగరంలో మెట్రో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 7 కి.మీ. మార్గంలో రైలు సంచారం మొదలైంది. రానున్న రెండు మూడేళ్లలో మెట్రో రైలు మార్గం 12 కి.మీ. మేర పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గత బడ్జెట్లో నగరాభివృద్ధికి, రహదారుల స్థాయి పెంపొందించేందుకు, సిగ్నల్‌ రహిత కారిడార్లను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రూ. 26,406 కోట్లను కేటాయించింది.

నగరాభివృద్ధికకి పాలికే గత ఏడాది తన బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లను కేటాయించింది. ఈ ఏడాది రూ. 1500 కోట్లకు ఈ బడ్జెట్‌ చేరుకుంది. ఇదే క్రమంలో పాలికే తన ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు వేర్వేరు మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇంటి వెలుపల కారును నిలిపితే ఏడాదికి రూ. 600, ద్విచక్ర వాహనాన్ని నిలిపితే రూ. 300, భారీ వాహనాన్ని నిలిపితే ఒకరేటు, ఆటోను నిలిపితే మరో రేటును వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి పాలికేలో కార్పోరేటర్ల సమావేశంలో ఆమోదముద్ర కూడా పడింది.కొత్తగా అనుసరిస్తోన్న విధానాలతో వృత్తి, ఆదాయ పన్నుల వసూళ్లు, ఈ-రిటర్న్‌ల కన్నా ఎక్కువగా ఆస్తుల యజమానుల స్పందించి పన్నుల్ని చెల్లిస్తున్నారని తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top