You Are Here: Home » ఇతర » బీ హ్యాపీ

బీ హ్యాపీ

కెరీర్‌,ఎగ్జామ్స్‌ ,పార్టీ ప్లానింగ్‌, టైం షెడ్యుల్‌ అంటూ ఇలా రోజు ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్లలో మీరూ ఒకరా? ఎలా రిలాక్స్‌ అవ్వాలి, ఏం చేస్తే ఈ టెన్షన్‌ పోతుంది అని మరింత టెన్షన్‌ పడుతున్నారా..? దానికి అంత టెన్షన్‌ పడటమెందుకు ఇలా చేసి చూడండి పదినిమిషాల్లో టెన్షన్‌ఫ్రీ అయిపోతారు.

happబాగా గాలివీస్తున్న చోట అటు, ఇటూ కాసేపు నడుస్తూ ఉండండి.స్ఫూర్తి కలిగించే నాలుగెైదు మంచి మాటలని ఒకసారి తిరగేయండి. ఇవి మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి.రాత్రివేళ ఎక్కువసేపు నిద్రకు కేటాయించాలి. అప్పుడు మైండ్‌ రీఫ్రెష్‌ అవుతుంది. ఆశావహధృక్పధాన్ని అలవర్చు కోండి.దీనివల్ల మీమీద మీకు పూర్తి నమ్మక మేర్పడుతుంది.మీ అనుభూతులని కుటుంబసభ్యులతో పంచుకోండి. అపుడు ఎంతో ఓదార్పు లభిస్తుంది.మీకు కావలసిన వస్తువులను ఎటువంటి నియమాలు లేకుండా హాయిగా తినండి. మీకు హాబీలేమైనా ఉంటే వాటిని ఈ సమయంలో చేయండి. దీనివల్ల మీదృష్టి అంతా ఇష్టమైన పనులమీదకి వెలుతుంది.కాసేపు నవ్వు తెప్పించే కార్టూన్‌లని చూడండి. దీంతో మనసారా నవ్వుకోగల్గుతారు.బాగా ఇష్టమైన స్నేహితులకు ఫోన్‌ చేసి కాసేపు మాట్లాడం డి. దీనివల్ల టెన్షన్‌పడుతున్నాం అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోగల్గుతారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top