You Are Here: Home » ఇతర » బాల్యం .. కకూడదు శాపం

బాల్యం .. కకూడదు శాపం

పుట్టుమచ్చల శాస్త్రం (?) అందరికీ తెలిసిందే. శరీరంపై ఎక్కడ ఎలాంటి పుట్టుమచ్చ ఉంటే భవిష్యత్తులో వారు ఎలాంటి వారు అవుతారో సూచించే వివరాలతో కూడినది అది. అలాంటి వివరాలతో కూడిన రెండు పుస్తకాలను నిషేధించాలని కోరుతూ ఇటీవల ఓ సంస్థ బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్‌ను ఆశ్రరుుంచింది. ఆ పుస్తకాల్లోని అంశాలు మహిళల గౌరవాన్ని భంగపరిచేలా ఉన్నాయని, మరీ ముఖ్యంగా మహిళల, బాలికలకు సంబంధించిన సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని వాదించింది. అప్పట్లో ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. అలా ఫిర్యాదు చేసిన సంస్థ ఎం.వి. ఫౌండేషన్‌. ఆ సంస్థ తరఫున సంస్థ జాతీయ సమన్వయకర్త ఆర్‌.వెంకట్‌ రెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఎంవీ ఫౌండేషన్‌ ఈ విధమైన ఫిర్యాదు చేయడం వెనుక ఓ చక్కటి నేపథ్యం కూడా ఉంది. ఆ సంస్థ బాలకార్మికత నిర్మూలనకు, అనాథ, పేద బాలబాలికలకు చదువు చెప్పించడంలోనూ విశేష కృషి చేస్తోంది. సంస్థ సాగిస్తున్న కృషిపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

బాలకార్మికత…
Untaసభ్య సమాజానికి ఓ చెరగని మచ్చలా మిగిలింది. ఆ మచ్చను తుడిపేసేందుకు తన వంతుగా విశిష్ట సేవలందిస్తోంది ఎం. వెంకట రంగయ్య ఫౌండేషన్‌ (ఎంవీ ఫౌండేషన్‌). రాష్టవ్య్రాప్తంగా ఇప్పటి వరకూ 5,00,000 మంది విద్యార్థులు బాలకార్మికత చెర బారి నుంచి తప్పిం చుకొని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారంటే అది ఈ సంస్థ కృషి కారణంగానే. తల్లిదండ్రుల్లో, పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారా పిల్లలంతా కూడా పనికి బదులుగా చదువుకోడానికి వెళ్ళేలా సంస్థ చేస్తోంది. చదువుకునే వయస్సులో ఉండే ప్రతీ ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలనేది సంస్థ ధ్యేయం.

కార్యకలాపాల తీరు
డబ్బు కోసం పని చేస్తున్నా, ఇంట్లోనే వ్యాపార సంబంధ పనులు చేస్తున్నా, వెట్టి చాకిరీలో ఉన్నా…అలాంటి కారణాలతో నిమిత్తం లేకుండా, పాఠశాలకు వెళ్ళని వారంతా కూడా బాలకార్మికులేనన్నది సంస్థ అభిప్రాయం. 5-14 ఏళ్ళ లోపు వారంతా కూడా పాఠశాలకు వెళ్ళి తీరాలనేది సంస్థ ధ్యేయం. ఎంతో మంది పిల్లలు దుకాణాల్లో, బిస్కట్‌ ఫ్యాక్టరీల్లో, ప్లాసిక్‌ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వారంతా కూడా చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్ళేలా సంస్థ చొరవ తీసుకుం టున్నది.

సాధించిన విజయాలు
గత రెండు దశాబ్దాల కాలంలో ఎంవీ ఫౌండేషన్‌ ఎన్నో ఘనవియాలు సాధించింది.

 • 1991లో మూడు గ్రామాల్లో సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు రంగా రెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, చిత్తూరు, నల్గొం, కర్నూలు, కడప, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంత పురం, వరంగల్‌ జిల్లాల్లో 158 మండలాల్లోని 6,000కు పైగా గ్రామాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
 • ఇప్పటి వరకూ సుమారు 5,00,000 మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్ళేలా చూడగలిగిం ది. వీరిలో 50,000 మంది బ్రిడ్జ్‌ స్కూల్స్‌ ద్వారా కొంత చదువు నేర్చుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విశేషం.

  కార్యకలాపాలు
  Unti

 • సంస్థ ప్రస్తుతం రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, కర్నూలు జిల్లాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడులకు కూడా తన కార్యకలాపా లను విస్తరించింది. పశ్చిమబెంగాల్‌, న్యూఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లలో ఎన్జీఓలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
 • ఒకసారి పాఠశాలలో చేర్పించిన తరువాత తిరిగి డ్రాపవుట్‌గా రాకూడదనే ఉద్దేశంతో వారి చదువు తీరుతెన్నులను కూడా సంస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది.
 • జనన ధ్రువపత్రాలు, అడ్మిషన్‌లు, హాస్టల్‌ సీటు లాంటి వాటిల్లో కూడా చొరవ తీసుకుంటుంది.
 • బాల్యవివాహాలను నిరోధించేందుకు కూడా సంస్థ విశేషంగా కృషి చేస్తోంది.
 • రాష్ట్రంలో 18 జిల్లాల్లో బాలకార్మిక విమోచన వేది క కింద 2,500 మంది ఉపాధ్యాయులతో ఒక వేదికను ఏర్పాటు చేసింది.
 • రాష్టవ్య్రాప్తంగా సుమారు 30,000 మంది వలం టీర్లతో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
 • 1500కు పైగా పంచాయతీరాజ్‌ సంస్థలతో నెట్‌ వర్క్‌ను కలిగి ఉంది.
 • మహిళల సంఘాలు, పాఠశాల విద్యా కమిటీల తో కలసి పని చేస్తుంటుంది. బాలకార్మికత అంశంపై మండల, జిల్లా స్థాయిలో ఈ గ్రూప్‌లతో కలసి ఫెడరేషన్‌లను ఏర్పాటు చేస్తోంది.
 • ప్రతీ గ్రామంలోనూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సీఆర్‌పీఎఫ్‌)లను ఏర్పాటు చేస్తోంది. సుమారు 80,000 మంది వీటిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు.
 • రాష్ట్రప్రభుత్వం బాలకార్మికతను నిర్వచించడం లో, అనియత విద్యా కేంద్రాలను డే స్కూల్స్‌గా మార్చడంలో సంస్థ కీలకపాత్ర వహించింది.

  సంస్థ విశ్వసించే అంశాలు

 • పిల్లలంతా కూడా పూర్తి కాలపు, నియత పగటి పూట పాఠశాలకు హాజరు కావాలి.
 • పాఠశాలకు వెళ్ళని ప్రతీ ఒక్కరూ బాలకార్మికుల కిందనే లెక్క
 • ఏ విధమైన పని కూడా పిల్లల సమగ్రాభివృద్ధికి నిరోధకమే.
 • బాలకార్మికతను ఏవిధంగానూ, ఏరూపంలోనూ సమర్థించకూడదు ఎంవీ ఫౌండేషన్‌కు ప్రస్తుతం ఎం.ఆర్‌ విక్రమ్‌ కార్య దర్శిగా ఉన్నారు. ఎం.కృష్ణమూర్తి చైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తు న్నారు. ఆర్‌.వెంకట రెడ్డి జాతీ య సమన్వయకర్తగా ఉన్నారు. వై.రాజేంద్రప్రసాద్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

  బ్రిడ్గ్జ స్కూల్స్‌
  చాలా సందర్భాల్లో బాలకార్మికులుగా ఉన్నవారు, ఇతరత్రా కారణాల వల్ల చదువు మానేసిన
  పిల్లలు నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండరు. అలాంటి సందర్భాల్లో వారు సంస్థ నిర్వహిస్తున్న బ్రిడ్జ్‌ స్కూల్స్‌ ద్వారా కొంత శిక్షణనుపొంది, ఆ తరువాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరగలుగుతున్నారు. బాలికల విషయంలో సంస్థ మరింత శ్రద్ధ వహిస్తోంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top