You Are Here: Home » సినిమా » పాటలు » బాలమిత్రుల కథ (1973)- గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి

బాలమిత్రుల కథ (1973)- గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి

పల్లవి :
గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి
ఒక గూటిలోన చిలకుండేది
ఒక గూటిలోన కోయిలుండేది

చరణం : 1
తీగలాగ అల్లిన చెలిమి
తెగుతుందని దిగులుపడి
కొమ్మవిడిన ఆ జంట కొత్తగూడు చేరింది

ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసి
కోయిలతో చెప్పలేక గూడు విడిచిపోయింది
జోడు చెదిరిపోయింది

చరణం : 2
చిన్ని చిలక ఏదనీ కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది
కుమిలి కుమిలి ఏడుస్తుంది
॥చిలక॥

కోనకోనలో తిరిగీ కొమ్మ కొమ్మను అడిగీ
కొదమ చిలక కనరాకుంటే
కోయిలగతి ఏమవుతుంది
గుండె పగిలి చస్తుంది

చిత్రం : బాలమిత్రుల కథ (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సత్యం
గానం : ఎస్.జానకి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top