You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » బాపు గీత గోవిందం

బాపు గీత గోవిందం

బాపు గీత గోవిందం

bapuబాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రాన్ని ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్త్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈ రోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ఆరుద్ర తన కూనలమ్మ పదాలలో అన్న మాట అక్షర సత్యం. ‘కొంటె బొమ్మల బాపు… కొన్ని తరముల సేపు… గుండె ఊయలలూపు … ఓ కూనలమ్మా!… ఇలా కూనలమ్మ పదం రాసిన ఆరుద్ర ఎప్పుడో చేసిన

బాపు పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయనచేతిరాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తికాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయినా,తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడకపోయినాచప్పున ఎవరయినా ఇది గీసింది…తీసింది బాపు అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.
బాపు బాల్యం: బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ.

baubomaluడిసెంబర్‌ 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరిజిల్లా, నర్సాపురంలో వేణు గోపాలరావు, సూర్యకాంతం దంప తులకు ఆయన జన్మించారు.1955 సంవత్సరంలో మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుండి లాయర్‌ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.

(వి)చిత్రకళ: బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితం కాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్త్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలు, విషయానుగుణ చిత్రాలనూ పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతి, రాజకీయాలు, భక్తి, సినిమాలు…ఇలా అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి.

బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత రాలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్‌) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్ద నాష్టకము, అన్నమయ్య పాటలు, రామా యణము, భారతీయ నృత్యాలు, తిరు ప్పావై – ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

bommaliపొదుపుగా గీతలు వాడటం… ప్రవహిం చినట్లుండే ఒరవడి… సంద ర్భానికి తగిన భావము…అసలు సిసలు తెలుగుదనం… ఇవన్నీ పోతపోసినట్లు… శిల్పం చెక్కినట్లు మనకు బాపు శైలిలో అడుగడుగునా కనిపిస్తూ కవ్విస్తాయి.

సాహితీ బుడుగు: బాపు కొంతకాలం జె.వాల్టర్‌ థామ్సన్‌ సంస్థలోనూ, ఎఫిషియెంట్‌ పబ్లికేషన్స్‌లోనూ, ఎఫ్‌.డి.స్టీవార్ట్‌‌స సంస్థలోనూ పనిచేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్త్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్‌. ఇందులో బుడుగుతో పాటు సిగాన పెసూనంబ తెలుగువారి హృద యం లో చిరకా లస్థానం సంపాదిం చుకున్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకున్నాయి. సినిమాలపై బాపు ఫాంట్‌(ముద్ర): 1967లో ’సాక్షి’ చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు తన మొదటి చిత్రంతోనే ప్రశంసలు అందుకొన్నారు. 1976లో బాపు నేతృత్వంలో రూపుదిద్దుకున్న ’సీతా కల్యాణం’ తెలుగు సినిమా గర్వించదగిన రీతిలో తీసిన కమనీయ దృశ్యకావ్యం

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top