You Are Here: Home » సినిమా » పాటలు » బాడీగార్డ్ (2012)- జియాజలే…

బాడీగార్డ్ (2012)- జియాజలే…

పల్లవి :

జియాజలే…
జిల్ జిలె కైసే జలే (2)
ఏమో ఏమో
ఏమో ఎందుకనీ
ప్రేమించానిన్నెందుకనీ
తెలిసేలోపే ప్రేమించానే
ఏమో ఏమో
నీదే రూపమని
అడిగే నా కనుపాపలని
నీ కలలో మైమరిపించాయే
వేరే ధ్యాసే లేదే… వేరే ఆశే లేదే
పంచప్రాణాలన్నీ చెలియా నీవే
మనస్సనే సరస్సును
కవ్వించింది నువ్వే
తీరానికై తపించిన తరంగాన్ని నేనే
జియా జలే.. జిల్ జిలె కైసే జలే (4)
॥ఏమో॥

చరణం : 1

ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా
గుండెల్లో జేగంట కొడుతుందా
ఎలా మొదలౌతుంది ఆ వింత
చూపుల్తో పనేమి లేకుండా
ప్రేమించే వీలంటూ ఉంటుందా…
అరె అరె
ఎవరెవరెవరికి జోడి
ఏ ఎదసడి జత ఎక్కడుంది
అని తెలిపే
ఆరోభావం ఉందిగా
అది ప్రేమను
నడిపిస్తుందిగా
జియా జలే…
జిల్ జిలె కైసే జలే (2)

చరణం : 2

లోకాన నీలాంటి ప్రేమికుడు
ఉంటాడు ఏ కోటికో ఒకడు
అదృష్టం అందించె నీ తోడు
చిరుగాలై నీ పక్కనే ఉన్నా
వీలైతే గుర్తించవా నన్ను
అరె వేల వేల వేలకళ్లలోన
నీ కోలకళ్లు ఎక్కడెక్కడున్నా
రెప్పలు మూసి తెరిచేలోపునా
నేనిట్టే కనిపెట్టెయ్యనా…
జియా జలే.. జిల్ జిలె కైసే జలే (4)

చిత్రం : బాడీగార్డ్ (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : హరిచరణ్, హరిణి

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top