You Are Here: Home » ఇతర » బరువెక్కిస్తున్న స్థూలకాయం

బరువెక్కిస్తున్న స్థూలకాయం

నేటి ఆధునిక మహిళల్లో స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహి ళకంటే పట్టణ ప్రాంత మహిళలు స్థూలకా యంతో ఎక్కువగా బాధపడుతున్నారట.

నేటి మహిళ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తన అందాలకు మెరుగు దిద్దుకుంటోంది. ప్రస్తుత పోటీ యుగంలో అందంగా ఉండడం కూడా ఒక అర్హతగా మారింది. బాహ్య సౌందర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుండడంతో అందరూ దానిని మెరుగు చేసుకో వడానికి మొగ్గుచూపిస్తున్నారు. పార్లర్‌కి వెళ్లి కేశాలను, చర్మాన్ని మె రిసేలా చేసుకుంటున్నారు. ప్రకాశవంతంగా తయారవుతున్నారు. గోళ్లను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే లేజర్‌ సహాయం తో మొహంపైనున్న అవాంఛిత రోమాలను తొలిగించుకుంటున్నారు. ముడతలు పడిన చర్మానికి బొటాక్స్‌ చికిత్స చేసుకుంటున్నా రు. ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు.

ఇలా పదహారేళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్లు నిండిన మహిళలు వరకు పర్‌ెఫెక్ట్‌ ఫిగర్‌కోసం తాపత్రయ పడుతున్నారు. 2005-06 నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం15-49 సంవత్సరాల వయసుగలిగిన వారిలో 1998-99లో 11 శాతంగా ఉన్న ఒబేసిటీ స్థాయి ‚2005-06 నాటికి 15 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న15 నుంచి 49 వయసు మధ్య కలిగిన మహిళలు 38.42 కోట్లు వీరిలో 5.8 కోట్ల మంది స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహిణులు శరీర బరువును అదుపు చేయడం లో విఫలమవుతున్నారు. నేటి పట్టణ మహిళలు స్థూలకాయంతో యుద్ధం చేస్తున్నారు.2009లో ది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చేపట్టిన అధ్యయనం ప్రకారం 12.3 శాతం మంది పట్టణ మహిళలు అధిక బరువుతో బాధపడుతుంటే, గ్రామీణ స్ర్తీలు 2.9 మంది ఈ సమస్యతో ఇబ్బందుపడుతున్నారు.

మారిన జీవనశైలి, అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం, ఇంటి పనులకు విద్యుత్‌ పరికరాలపై, పనివారిపై ఆధారపడటం వంటి కారణాల వల్ల పట్టణ గృహిణులు సులువుగా బరువు పెరుగుతున్నారు. గర్భం సమయంలోను, మెనోపాజ్‌ దశలోను స్థూలకాయం బారిన పడేవారు ఎక్కువవుతున్నారు. జన్యుపరంగా సంభవించే స్థూలకాయాన్ని సైతం తగ్గించవచ్చని శాస్ర్తీయంగా నిరూ పితమైంది.

మారుతున్న చుట్టుకొలత…
ఒబేసిటీలో ముఖ్యంగా పిరుదల ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఎక్కువమందిలో నడుం చుట్టుకొలత పెరిగిపోతోంది. చర్మం కింద కొవ్వు పేరుకుపోతోంది. అంతే కాకుండా పొత్తికడుపు భాగంలో కొవ్వు నిల్వ ఉంటోంది. చర్మం కింద కొవ్వు నిల్వ ఉం డడం కన్నా, పొత్తి కడుపు ప్రాంతంలో ఫాట్‌ పేరుకుపోవడం చాలా ప్రమాదకరం. ఇది డయాబెటిస్‌, హృద్రోగ సమస్యలు, మోనోపాజ్‌ క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారమవుతుంది. ఈస్ట్రోజన్‌ వంటి హార్మోన్లు స్థూలకాయం వారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతా యి. ఇవి కణితులను సజీవంగా ఉంచుతాయి.
ప్రతి పదిమందిలో పురుషుల్లో ఒకరు ఒబేసిటీతో బాధపడుతుంటే స్ర్తీలలో ఈ సంఖ్య మూడగా ఉంది. ‘సాధారణంగా 30 నుంచి 60 ఏళ్ల మధ్య వారిలో స్థూలకాయం సర్వసాధరణమైన విషయం. వీరి లో మోనోపాజ్‌ కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాని ప్రస్తుతం 20 -30 వయసులో గల వారిలో స్థూలకాయం వస్తుంది’ అని వైద్యులు అంటున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top