You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » బరువు పెరిగితే నష్టం ఏమిటి?

బరువు పెరిగితే నష్టం ఏమిటి?

బరువు పెరిగితే నష్టం ఏమిటి?

 

ఉగాది పచ్చడిలో తీపి పులుపు, చేదు అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు ఎలా రుచిగా ఉంటుందో జీవితం కూడా అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది. ఇదే నియమం మనిషి ఉండాల్సిన బరువుకు కూడా వర్తిస్తుంది.
overశరీరంలో బరువును మోసే కాళ్లు, మోకాళ్లు, మడిమలు, నడుము బరువు పెరిగి నప్పుడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ బరువు మోస్తూ ఉండటం వల్ల మోకాలి నొప్పులు మడిమల నొప్పులు సాధారణం. దాంతో మీ మనసు వ్యాకులం చెందడం తద్వారా ఇన్‌ఫియారిటీ కాంప్లెక్స్‌ లోనవడం జరుగుతుంది. బరువు పెరిగినప్పుడు కొద్ది దూరం నడిచినా మెట్లెక్కినా ఆయాసం రావడం చెమటలు పట్టడం చూస్తూ ఉంటాము. ఫ్యామిలీలో డయాబెటిస్‌ లేకపోయినా కూడా బరువు పెరిగిన వారిలో వారి కణాలకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరగటం వల్ల షుగర్‌ కంప్లెంట్స్‌ రావడం జరుగుతుంది.

ఈ రకమైన డయాబెటిస్‌ వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు వ్యాపించడం ప్రపంచంలో ఉన్న వైద్యులందరినీ కలవరపెడుతున్న విషయం. ఈ రకంగా అధిక బరువు వల్ల డయాబెటిస్‌ బారిన పడిన వారు బరువు తగ్గితే ఆటోమెటిక్‌గా డయాబెటిక్‌ కూడా తగ్గుతుంది.అధిక బరువు ఉండే వారిలో ఉండే మరొక కామన్‌ కంప్లెయింట్‌ హై బ్లడ్‌ ప్రెషర్‌. బ్లడ్‌ ప్రెషర్‌ ఉన్న ప్రతి మనిషిని డాక్లర్లు బరువు తగ్గమని చెప్పడానికి కారణం వారి శరీరంలో 10 శాతం బరువు తగ్గితే బ్లడ్‌ ప్రెషర్‌ బ్రహ్మాండంగా తగ్గడమే.

బరువు పెరిగిన వారు ఎదుర్కొనే మరొక సమస్య ఛాతి నొప్పి, గుండెపోటు. స్ర్తీలలో పిరియడ్స్‌ కూడా క్రమం తప్పి బరువు పెరిగినప్పుడు ఎదురయ్యే సాధారణ సమస్య చాలా మందికి తెలియని విషయం మరొకటి ఏంటంటే , బరువు పెరిగినప్పుడు నిద్రలో గురక, అధిక బరువున్న వందమందిలో కనీసం 95 మందికి వేధించే సమస్య గురక.అధిక బరువు వల్ల పిత్తాశయంలో రాళ్లు , పక్షవాతం, రొమ్ము, ఒవెరియస్‌ క్యాన్సర్‌ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top