You Are Here: Home » ఇతర » బరువు తగ్గే ఉపాయం

బరువు తగ్గే ఉపాయం

చాలామంది చాక్లెట్లు తింటే బరువు పెరిగి లావుగా తయారవుతారని అనడం మనం మొన్నటిదాకా వింటున్నదే. అయినా కొందరు అదేపనిగా ఏదైతే అదయిందిలే అని చాక్లెట్టు హాయిగా తినేస్తున్నారు. బరువు, గిరువు సంగతి ఏమో కానీ, తగిన మోతాదులో చాక్లెట్లు తినడం మంచిదే అంటున్నారు. ఛాకోలేట్సు తింటే బరువు తగ్గి ఆరోగ్యం పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

filler2విక్టోరియా యూనివర్శిటీ పరిశోధకుడు లిలీ స్టజనో వస్క తాను రచించిన ‘ద ఛాకోలేట్‌ డైట్‌‌‌’ అనే పుస్త కంలో ఈ విషయాలన్ని వెల్లడించాడు. చాక్లెట్ల మీద ఉన్న భయాలు, అపోహలు తప్పని మేము, చాక్లెట్‌ ప్రియులు చాక్లెట్స్‌ మీద ఉన్న దురభిప్రాయాన్ని మార్చు కోవాలనీ స్టజనోవస్క చెబుతున్నారు. స్టజనోవస్క, జాన్‌ ఆస్తానాతో కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. మేము పెద్ద మొత్తంలో ఛాకోలేట్‌ తినమని చెప్పడం లేదు. తగు పరి మాణంలో మంచి నాణ్యత ఉన్న డార్క్‌ ఛాకోలెట్స్‌ను మాత్రమే తినాలని సూచిస్తున్నాం అని కూడా ఈ రచ యితలు అంటున్నారు. మంచి నాణ్యమైన డార్క్‌ ఛాకో లేట్‌ యాంటీ ఆక్సిడెంట్‌ ఎపికటెచిన్‌ను కలిగియుం టుంది. అది కొవ్వును పెద్ద మొత్తంలో కరిగిస్తుందని తద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ఛాకోలెట్స్‌ తినడం ద్వారా బీపీ కూడా తగ్గు తుందని ఈ పరిశోధకులు తెలియజేస్తున్నారు. మరిం కనేం ఒక డబ్బాడు చాక్లెట్లు తెచ్చుకుని హాయిగా అడపా దడపా నోట్లో వేసుకోండి..!

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top