You Are Here: Home » సినిమా » పాటలు » బండరాముడు (1959)-సాగిపోయే

బండరాముడు (1959)-సాగిపోయే

పల్లవి :

సాగిపోయే
ఓ చందమామా…
ఆగుమా…
ఒకసారి ఆగుమా…
ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా

చరణం : 1

నీలి మబ్బుల తెరచాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల… ఓ…

ఎందుకో చనలేవు సూటిగ (2)
ఎదలోన నీవైన యోచించుకొమ్మా

చరణం : 2

పరుల సొమ్మును
హరియించు వాడె
పగటిపూటను
ఇలు వీడలేడోయ్‌॥
మంచిగా మనవోయి
జాబిలి (2)
మలినమ్ము ఇకనైన
తొలిగించుకొమ్మా

మారేనా నీ మనసు ఓ చందమామా మారేనా నీ మనసు ఓ చందమామా
ఓ చందమామా… ఓ చందమామా

చిత్రం : బండరాముడు (1959)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : పి.సుశీల

కృష్ణాజిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన పెద కళ్లేపల్లి గ్రామంలో కృష్ణబ్రహ్మశాస్త్రి, అన్నపూర్ణ దంపతులకు నవంబర్ 11న 1921లో జన్మించారు దక్షిణామూర్తి. ఆయనకు ఒక అక్క, అయిదుగురు చెల్లెళ్లు. వీరిది సంగీతజ్ఞుల వంశం. తాతగారైన సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి సాక్షాత్తూ త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు. దక్షిణామూర్తి 16వ ఏటనే వయొలిన్ కచ్చేరీ చేశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.వి. సంస్థలో కూడా పనిచేశారు. తెలుగులో ‘నారద నారది (1946)’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘సంసారం (1950)’ చిత్రంలో ఆయనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, సింహళ, ఆంగ్ల భాషలలో దాదాపు 135 చిత్రాలకు సంగీతం అందించారు. 1984లో వచ్చిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తెలుగులోవీరు సంగీతం అందించిన ఆఖరి చిత్రం.

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top