You Are Here: Home » ఇతర » బంగినపల్లికి… గుర్తింపు ఏది?

బంగినపల్లికి… గుర్తింపు ఏది?

పండ్లలో రారాజుగా పేరున్న మామిడి పండు పేరు చెబితేనే నోరూరుతుంది. అందులోనూ బంగినపల్లి మామిడి టేస్టే వేరు. సీజన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మామిడి జాతి ఇదే. అందుేక బంగినపల్లికి ప్రపంచ గుర్తింపు తేవాలని మన రాష్ర్ట ప్రభుత్వం భావించింది. కానీ నిధులు మంజూరు చేయడంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడంతో బంగినపల్లి మామిడి గుర్తింపు కష్టంగా మారింది. రుచిలో మేటైన బంగినపల్లి మామిడి పండుకు ఘనమైన చరిత్ర ఉంది. మన రాష్ట్రానిేక గుర్తింపు తీసుకు వచ్చిన ఈ బంగినపల్లి మామిడి పండుకు భౌగోళిక సూచిక (జీఐ) పొందాలన్న ప్రయత్నంకు ఆదిలోనే ధనలక్ష్మి కరుణలేకుండా పోరుుంది. ఆ గుర్తింపు కోసం చేస్తున్న పనులన్నీ మూల పడ్డారుు. దీంతో గుర్తింపు పని పూర్తిగా ఆగిపోరుుంది. బంగినపల్లి మామిడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే మాత్రం ప్రభుత్వం నిధులు అందిస్తేనే పనులు ముందుకు సాగుతారుు.
0-(4)మనరాష్ర్టంలో పండే బంగినపల్లి మామిడికి ఘనమైన చరిత్ర ఉంది. కర్నూలు జిల్లా బంగినపల్లిలో శతాబ్ధాల క్రితం దీన్ని పండించడం ప్రారంభించారు. 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బనగానపల్లె నివాసులైన నవాబులు ఈ రకం పండును పండించారు. దీన్నే బేనీషాన్‌ మామిడి అంటారు కూడా. బనగానపల్లి మామిడి కాలగమనంలో బంగినపల్లి మామిడిగా పేరు గాంచింది. 1790-1940 మధ్యకాలంలో బేనిషా మామిడికి బంగినపల్లి మామిడిగా పేరు వచ్చింది. రాష్ర్టంలో పండుతున్న మామిడిపండ్లలో 60 శాతం బంగినపల్లే ఆక్రమిస్తోంది. ఈ బంగినపల్లి మామిడిపండ్లు అమెరికా, ఆస్ట్రేలియా, సౌదీఅరేబియా తదితర దేశాలకు విస్తారంగా ఎగుమతి అయ్యేవి.

ప్రతిఏటా వేల టన్నుల పండ్లను ఎగుమతులు చేసిన ఘనత మనదే. మన జాతీయ ఫలమైన మామిడి ఉత్పత్తిలో సుమారు 40.58 లక్షల టన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమస్థానంలో ఉంది. రాష్ర్టంలో 4.80 లక్షల హెక్టార్లలో సాగవుతూ మామిడి విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉంది. అలాంటి ఈ ఫలానికి పేటెంట్‌ లభించే అవకాశం చేచేతులా చేజార్చుకునే అవకాశం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కే సొంతమైన ఈ పండ్లకు భౌగోళిక సూచిక… జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ జీఐ గుర్తింపు తీసుకురావటానికి ఉద్యానశాఖ సంకల్పించినా రాష్ర్ట ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి మొండిచెయ్యి చూపించింది.

గుర్తింపు కోసం
బంగినపల్లి మన రాష్ర్టంలోనే శతాబ్దాల కిందట పుట్టిందని నిరూపిేస్తే… ముందు జీఐ గుర్తింపు వస్తుంది. అందుకోసం సమగ్ర నివేదికను అందించాలి. అలాగే మన రాష్ర్టంలో నాలుగు ప్రాంతాల్లో పండే పండ్లను సేకరించి ప్రయోగశాలలకు పంపుతారు. ఇవి ఎక్కడెక్కడ పండుతున్నాయనే వివరాలను భౌగోళికంగా ఉపగ్రహాల ద్వారా పటం తయారు చేయడానికి బీపీఎస్‌ సర్వే చేస్తుంది. ఈ పనులకు రెండు సంవత్సరాలు పడుతుంది. ఈ వివరాల నివేదికను ప్రపంచ మేథో హక్కుల సంస్థకు జీఐ కోసం ఉద్యానశాఖ దరఖాస్తు చేయాలి.

నిధుల మంజూరుకు మొండిచెయ్యి
మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బంగినపల్లి మామిడి పండుకు భౌగోళిక సూచిక (జీఐ) పొందాలన్న ప్రయత్నం నిధులు లేక ఆగిపోయింది. దీనికోసం 75 లక్షలు ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో జీవ సేక రణ ప్రక్రియ పనులు నిలిచిపోయాయి. జీఐ సేకరణ ప్రాజె క్టును రాష్ర్ట పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిసోధనా సంస్థకు (ఈపీటీఆర్‌ఐ) అప్పగించినట్లు గతేడాది ఆరంభంలో ఉద్యాన శాఖ తెలిపింది. దీనికి రూ.74.40 లక్షలు ఇవ్వాలని ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం’ (ఆర్కేబివై) కింద ప్రభుత్వాన్ని అడిగింది. ఈ ప్రాజెక్టు చేపట్టడం సరైన చర్యే అయినా తొలుత ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’ (ఐపీఏఆర్‌) నుంచి అనుమతి పొందాలని ఉద్యానశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.

వ్యవసాయ ఉత్పత్తులపై గుర్తింపు
0-(6)పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టంలో పండే లక్ష్మణ్‌ బోగ్‌ మామిడి, హిమ్‌ సాగర్‌ మామిడి, ఫాజిలీ మామిడికి ఆ రాష్ర్ట వ్యవసాయశాఖ అధికారులు పేటెంట్‌ పొందారు. కర్నాటకు చెందిన అప్పిమీడి మామిడి, గుజరాత్‌కు చెందిన గిర్‌ కేసర్‌ మామిడకిి ఈ గుర్తింపు లభించింది. కర్నాటకకు చెందిన కమలాపూర్‌ ఎరుపు అరటిపండు, తమిళనాడు అరటిపళ్ళు అయిన విరూపాక్ష హిల్‌ అరటి, సిరుమలై అరటిపళ్ళ, కొబ్బరిపై హక్కు సాధించింది. ఉత్తరప్రదేశ్‌ ఆ రాష్ర్టంలో పండే మలీహబడి దుషిహేరీ రకం మామిడిపండుపైనా… డార్జిలింగ్‌ టీ, ఈరోడ్‌ పసుపు, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కంగర టీ, కర్నాటక కూర్గ్‌ ఆరెంజ్‌, మైసూర్‌ తామలపాకు, మహారాష్ర్టకు చెంది మహాబలేశ్వర్‌ స్టాబెర్రీ, నాసిక్‌ దాక్ష, కేరళకు చెందిన సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌ బెల్లం, ఒరిస్సాకు చెందిన గంజాం రోహ్‌, పువ్వులు ఈ పేటెంట్‌ హక్కు పొందాయి.

గుర్తింపుకోసం కసరత్తు
వాస్తవానికి ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల క్రిందటే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వం నిధులు మం జూరు చేయలేదు. కానీ రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద బంగినపల్లికి జీఐ గుర్తింపు సేకరణ ప్రాజెక్టుకు రాష్ర్ట ప్రభుత్వం 75లక్షల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా మొండిగానే సమాధానమిచ్చింది. మేము నిధులు ఇవ్వమని. ఈ జీఐ గుర్తింపు రావాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది.

పేటెంట్‌ అంటే?
ఈ మధ్యకాలంలో అందరూ పేటెంట్ల గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. దీనికి ఉదాహరణగా… మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేదిగా అయి ఉంటుంది. కానీ అదే ఆలోచ నని ఇతరులు ఉపయోగించుకుని లాభం పొందుతారని మీకు అనిపించిందనుకోండి. దానిని కాపడుకోవ డమెలా? అలా మీ ఆలోచనని కాపుడుకోవడానికి సృష్టించిన ఒక విధానమే ఈ పేటెంట్‌. అయితే, పేటెంట్‌ ఒక చోట దరఖాస్తు చేస్తే అది అన్ని చోట్లా చెల్లుబాటు అవదు. ఉదాహణకు అమెరికాలో మీరు పేటెంట్‌ చెయ్యదలచుకున్నారనుకోండి దానికి మీరు యూఎస్‌ పీటీఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అదే మన దేశంలో అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి.

Maaaఅయితే చాలా సార్లు అన్ని దేశాలలోనూ పేటెంట్‌ చెయ్యడం కుదరకపోవచ్చు. (పేటెంట్‌ దరఖాస్తు చేయ్యడానికి అయ్యే ఖర్చు తక్కువేమీ కాదు) అప్పుడు ఏ దేశాలలో అయితే మీ ఆలోచనకి మార్కెట్‌ ఎక్కువ ఉంటుందో ఆ దేశాలలో మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువగా టెక్నాలజీకి సంబంధించిన మార్కెట్టు అమెరికా, యూరప్‌లలో కాబట్టి ఆయా దేశాలలో ఎక్కువగా దరఖాస్తు చేస్తుంటారు. అయితే వేటిని పేటెంట్‌ చెయ్యవచ్చు… దాని విధానమేమిటి అనేది కూడా ఆయా దేశాల చట్టాల ప్రకారం మార్పులు చెందుతుంది. దానికి మీకు వచ్చిన ఆలచనని ఎవరూ పేటెంట్‌ చెయ్యకుండా ఉండాలి. ఆ ఆలోచన సరికొత్తదై ఉండాలి. ఆ ఆలోచనకి ఉపయోగం ఉండాలి.

ఆ ఆలోచన ఏ పబ్లికేషన్‌లోనూ ప్రచురించి ఏడాది కాకుడదు. ఒక కొత్త ఉత్పత్తి, కొత్త విధానం, కొత్త సాంకేతిక విధానంను పేటెంట్‌ చేయవచ్చు. పేటెంట్‌ వల్ల లాభం ఏమిటి? మీ ఆలోచనను మీ అనుమతి లేకుండా ఎవరూ వాడుకోలేరు. మీ ఆలోచనను ఇతరులకు లైసెన్స్‌ చేసి దాని మీద డబ్బు సంపాదించవచ్చు. మీ కంపెనీ ఆర్‌అండ్‌డీకి ఖర్చుని పేటెంట్ల ద్వారా కాపుడుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ నుండి జిఐ
పోచంపల్లి, శ్రీకాళహస్తి హ్యాండిక్రాఫ్ట్‌‌స, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్‌ సిల్వర్‌ జరీ కుట్టుపని, నిర్మల్‌ బొమ్మలు, మచిలీపట్నం కళంకారీ, నిర్మల్‌ ఫర్నిచర్‌, నిర్మల్‌ పెయింటింగ్స్‌, ఆంధ్రప్రదేశ్‌ తోలుబొమ్మలు, తిరుపతి లడ్డూ, గుంటూరు సన్నరకం మిర్చి గద్వాల చీరలు, హైదరాబాద్‌ హలీం, చేర్యాల పెయింటింగ్స్‌, పెంబర్తి మెటల్‌ క్రాఫ్ట్‌, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు, సిద్ధిపేట గొల్లబామ ఈ గుర్తింపు సాధించాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top