You Are Here: Home » సినిమా » పాటలు » బంగారుబొమ్మలు (1977)- నేనీదరిని నువ్వా దరినీ

బంగారుబొమ్మలు (1977)- నేనీదరిని నువ్వా దరినీ


పల్లవి :
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ… ఈ… ఈ…॥

చరణం : 1
కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో (2)
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ…
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ॥

చరణం : 2
నీ కురుల నలుపులో… నీ కనుల మెరుపులో…
అలలై… కలలై… అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో… నీ దోర వయసులో…
వరదై… వలపై… వరదై వలపై తానే ఉరికిందీ
చిరుగాలుల తుంపరగా…
చిరునవ్వుల సంపదగా…॥॥॥

చరణం : 3
పంట పొలాల్లో పచ్చదనంగా
పైరగాలిలో చల్లదనంగా ॥
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ…
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥

చిత్రం : బంగారుబొమ్మలు (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

e-mail: sakshisong@gmail.com
నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top