You Are Here: Home » సఖి » ఫ్లోరింగ్‌కు సిరామిక్‌ సొగసులు

ఫ్లోరింగ్‌కు సిరామిక్‌ సొగసులు

భవన నిర్మాణంలో ప్రధానమైన ఘట్టం ఫ్లోరింగ్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు చేసినా ఫ్లోరింగ్‌ అభిరుచికి తగ్గట్టుగా అందంగా, ఆకట్టుకునే విధంగా లేకపోతే వెలితిగా కన్పిస్తోంది. నాపరాయి, పాలిష్‌రాయి, మొజాయిక్‌ స్థానంలో మార్బుల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా మార్బుల్స్‌లో రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. బహుళజాతి కంపెనీల ప్రవేశంతో భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Ceraగతంలో వినియోగించే మెటీరియల్స్‌ కొన్ని రంగుల్లో మాత్రమే లభ్యమయ్యేవి. సిరామిక్‌ వినియోగంలోకి వచ్చిన తరువాత ఫ్లోరింగ్‌ దశ మారిపోయింది. ఖజారీయా, ఏషియన్‌ లాంటి కంపెనీలు గుంటూరు నగరంలో కార్పోరేట్‌ స్థాయి డీలర్లను నియ మించింది. ఫ్లోరింగ్‌, బాత్‌రూమ్స్‌, వాల్‌, కోస్ట్‌కోల్‌ డిజెైన్‌కు అవసరమైన సరంజామా అంతా ఒకే దుకాణంలో, సిరామిక్‌ రూపంలో లభ్యమయ్యేలా దుకాణాలను వినియోగదారులకు అందుబాటు లోకి తీసుకొచ్చారు. గుంటూరు బ్రాడీపేట ప్రాంతంలో 20కి పెైగా టైల్స్‌ షాపులు నిత్యం రద్దీగా ఉంటున్నా యంటే ఏ మేరకు డిమాండ్‌ పెరిగిందో ఊహించవచ్చు. ఇటీవల అపార్టుమెంట్లలో సైతం ఫ్లోరింగ్‌కు సిరామిక్‌ టైల్స్‌ వినియోగిస్తున్నారు. ఇక కార్పోరేట్‌ కార్యాలయాలకు తప్పనిసరిగా సిరామిక్‌ టైల్స్‌తో ఫ్లోరింగ్‌ అందంగా తీర్చిదిద్దుతున్నారు.

అవసరమైన సైజుల్లో వెట్రిఫెైడ్‌ టైల్స్‌ లభిస్తున్నాయి. సుమారు వంద షేడ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి . లాప్‌టో, ఉడెన్‌, సాటిన్‌, మార్బుల్‌, రాస్టిక్‌, ప్లెయిన్‌, ప్రింటెడ్‌, ఎన్‌పీల్‌ ప్రింటెడ్‌ వంటి డిజెైన్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది. సిరామిక్‌ టైల్స్‌లో డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం వినియోగి స్తుండడంతో ఆకట్టుకునే కలర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ ప్రాంతాల్లో సిరామిక్‌ టైల్స్‌ దుకాణాలు ఎక్కువగా వెలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అభిరుచికి తగ్గట్టుగా సిరామిక్‌ టైల్స్‌ ఫ్లోరింగ్‌ అందాలను తెచ్చిపెడుతున్నాయి.

సిరామిక్‌ టైల్స్‌ డిమాండ్‌ నేపథ్యంలో గుంటూరు-నరసరావుపేట మార్గ మధ్యంలో ఒక ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టారు. అలాగే చిలకలూరిపేట ప్రాంతంలో మరొక సిరామిక్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి అవుతున్న సిరామిక్‌ టైల్స్‌ను భవిష్యత్‌లో ఇక్కడే తయారు చేసి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top