You Are Here: Home » ఇతర » ఫ్యాషన్‌.. ఎగ్జిబిషన్‌

ఫ్యాషన్‌.. ఎగ్జిబిషన్‌

DSCaమగువలు మెచ్చే వెరెైటీ వస్త్రాలు మార్కెట్లోకి వెల్లువలా వస్తున్నాయి. ఫ్యాషన్‌ వస్త్రాలను కోరుకునే వారి కోసం డిజెైనర్లు సరికొత్త ఉత్పత్తులను అందుబాటు లోకి తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఉత్పత్తులతోపాటు ఇతర రాష్ట్రాల ఉత్పత్తులు సైతం కొలువుతీరుతున్నాయి. పలు రాష్ట్రాల ఉత్పత్తులను భాగ్యనగర వాసులకు అందించేందుకు పలు ప్రదర్శనలు సైతం ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలను పురస్క రించుకుని యూత్‌ కోసం షాపింగ్‌మాల్స్‌ సరికొత్త డిజెైన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఉత్పత్తులపెై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో షాపింగ్‌మాల్స్‌ వినియోగదారులతో కళకళలాడుతు న్నాయి. కాలేజీకి వెళ్లే యువతులు విభిన్న వస్తధ్రారణ కోరుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకత చాటుకునేందుకు పోటీపడుతున్నారు.

ఒకరికంటే ఒకరు భిన్నంగా కనిపించాలన్న కోరిక ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. కాలేజీకి వెళ్లే యువతుల కోసం డిజెైనర్లు ప్రత్యేక లుక్‌తో తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక ఫ్యాషన్‌షోలను ఏర్పాటు చేసి మరీ వీటిని నగర ఫ్యాషన్‌ప్రియులకు పరిచయం చేస్తున్నారు. ఇటీవల భాగ్యనగరంలో జరుగుతున్న ఫ్యాషన్‌ షోలలో వీటిని నగరవాసు లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ తరుణంలో నగరంలోని తాజ్‌కృష్ణ, తాజ్‌బంజారాలలో మెలాంజ్‌, క్వాయిష్‌, ఆకృతి, మ్యారేజ్‌మంత్ర పేరుతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌లలో ఫ్యాషన్‌ప్రియులకు సరికొత్త డిజెైనర్‌ ఉత్పత్తులను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top