You Are Here: Home » సినిమా » సినిమా రివ్యూ » ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’

ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’

 

ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’

Isqu talangana patrika telangana culture telangana politics telangana cinemaచాన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ లేని నితిన్ తాజాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మాస్ ట్రెండ్‌కు దూరంగా ఈ సారి అర్బన్ క్లాస్ టచ్ వున్న కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. సినిమా కథలోకి వెళ్తే…రాహుల్ (నితిన్) ఢిల్లీలో చదువుకునే విద్యార్థి. అన్ని విషయాల్లో స్మార్ట్‌గా ఆలోచించడం అతని మనస్తత్వం. ఎవరినైనా ఇట్టే బురిడీ కొట్టించగల టాలెంట్ అతనికి స్పెషాలిటీ. ఓ సందర్భంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన రాహుల్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ప్రియ(నిత్యమీనన్) పరిచయమవుతుంది. ఇద్దరి నడుమ కొంత టీజింగ్ గేమ్ నడిచాక ఒకరిపట్ల ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించని కారణంగా వాళ్లు ప్రయాణిస్తున్న ప్లైట్ గోవాకు దారి మళ్లింపబడుతుంది. అక్కడ అనూహ్యంగా ప్రియతో పాటు తన ఫ్రెండ్ పెళ్లికి హాజరవుతాడు రాహుల్. గోవాలో కొన్ని అనుకోని సంఘటనల తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. ఈ క్రమంలో శివ (అజయ్) చెల్లెలు ప్రియ అని రాహుల్ తెలుసుకుంటాడు. మూడేళ్ల క్రిందట రాహుల్, శివకు ఓ విషయంలో శత్రుత్వం ఏర్పడుతుంది. అసలు శివ ఎవరు? శివ రాహుల్ మధ్య వైరానికి కారణమేమిటి? రాహుల్ అక్క దివ్య (సింధుతులాని)కు, రాహుల్, ప్రియల ప్రేమకథకు సంబంధం ఏమిటనే అంశాలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది.

కథాపరంగా సింపుల్ స్టోరీలైన్ ఇది. బిగువైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు విక్రమ్ కుమార్(13 బి ఫేం) సినిమాను బోర్ లేకుండా నడిపించడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో సినిమా స్లో పేస్‌లో నడిచినా, నితిన్, నిత్యామీనన్‌ల రొమాన్స్ ఫ్రెష్‌గా, కన్విన్సింగ్‌గా ఉంటుంది. ప్రియ ఎవరో రివీల్ చేయడంతో సినిమా మొదటి సగం ముగుస్తుంది. రెండో సగంలో రాహుల్… ప్రియ కుటుంబ సభ్యుల్ని ఇంప్రెస్ చెయ్యడం…. రాహుల్, శివల మధ్య గేమ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
నితిన్ ఈ సినిమాలో క్లాసీ లుక్స్‌తో కనిపించాడు. యాక్టింగ్‌లో ఈజ్ చూపించాడు. నితిన్, నిత్యామీనన్ జంట కనువిందుగా ఉంది. నిత్యామీనన్ ఇన్నొసెన్స్, బ్యూటీఫుల్ లుక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. హీరోయిన్ అన్నయ్యగా అజయ్‌ది ఎక్స్‌వూటార్డీనరీ పెర్‌ఫార్మ్‌న్స్. చాలా రోజుల తర్వాత అజయ్ ప్రశంసాత్మక పాత్రలో కనిపించాడు. రాహుల్, శివల నడుమ కాన్‌వూఫం సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. ఆలీ, శ్రీనివాసడ్డి కామెడీ సరదాగా ఉంది. నాగినీడు, సింధుతులాని, సుధ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది పి.సి.శ్రీరామ్ కెమెరా వర్క్. సినిమా మొత్తాన్ని విజువల్ ఫీస్ట్‌లా ఆవిష్కరించాడు. కెమెరా వర్క్ సినిమాకు హైలైట్‌గా చెప్పవచ్చు. ఏదో ఏదోలా వుంది.., సూటిగా చూడుకు.. పాటల్లో ప్రతీ ఫ్రేమ్ నయనానందకరంగా ప్లజెంట్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. సంభాషణలు ఫర్వాలేదనిపించాయి. ఎడిటింగ్, కొరియోక్షిగఫీ పర్వాలేదనిపించాయి. కొన్ని సన్నివేశాల్లో అనవసర సాగతీత, రొటీన్ క్లైమాక్స్ వంటి డ్రాబ్యాక్స్‌గా అనిపిస్తాయి. ఎక్కడా అశ్లీలత, ద్వంద్వార్థాలు లేకపోవడం వల్ల ‘ఇష్క్’ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కళాధర్‌రావు

 

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top