You Are Here: Home » ఇతర » ఫిడే చాంపియన్‌గా గ్రాండ్గమాస్టర్‌ హంపి

ఫిడే చాంపియన్‌గా గ్రాండ్గమాస్టర్‌ హంపి

ప్రొఫైల్

పూర్తి పేరు : హంపి కోనేరు
పుట్టిన తేది : మార్చి 31
జన్మస్థలం : విజయవాడ
క్రీడ : చెస్‌
టైటిల్‌ : గ్రాండ్‌ మాస్టర్‌
ఎఫ్‌ఐడిఈ : 2589
ర్యాంకు : 3వ (అంతర్జాతీయంగా )
కీర్తి : 2600 మార్క్‌ను దాటిన రెండవ క్రీడాకారిణి

మనిషి మేధసుే్సక కాదు ఓపికకూ చదరంగం పరీక్షపెడు తుంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందే ఊహించి అడుగేయాలని చెస్‌ సందేశాన్నిస్తుంది. ఈ క్రీడ పుట్టింది భారతదేశంలో చెస్‌ కీర్తి నలుదిశలా వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మహిళా విభాగంలో కొనేరు హంపి సృష్టించిన సంచలనాలు ఆమె పాపులారిటీని నలుదిశలా వ్యాపింపచే శారుు. జూనియర్‌ చెస్‌ పోటీలో విజయం సాధించిన హంపి గ్రాండ్గ మాస్టర్‌గా ఎదగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అంచెలంచెలుగా ఎదిగి నేడు గ్రాండ్గమాస్టర్‌గా కీర్తినార్జించింది. చెస్‌ ప్రపంచ పోటీలలో సంచలన విజయాలను నమోదు చేస్తున్న హంపి కోనేరుఅతి పిన్నవయసులోనే గ్రాండ్‌ మాస్ట ర్‌గా ఎదిగిన క్రీడాకారిణి. విజయవాడలో మార్చి 31, 1987న జన్మించిన ఆమె ప్రస్తుతం ప్రపంచ మహిళా ఛాంపియన్‌లలో ఆమె 3వ స్థానంలో కొనసాగుతు న్నారు.

ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఎఫ్‌ఐడిఈ ) ప్రకారం 2010లో ఆమె రేటింగ్‌ 2614. ఈ పాయింట్లతో ఆమె జూడిత్‌ పోల్గార్‌ తరువాత రెండవ స్థానాన్ని చేరుకుంది. 2007లో 2577 పాయింట్లతో ఉన్న సుసాన్‌ పోల్గార్‌ కన్నా ఎక్కు పాయింట్లను సాధించి చెస్‌ చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంకును సాధించిన తొలి వనితగా రికార్డు సాధిచింది. జూడిత్‌ తరువాత 2600 ఎలో మార్క్‌ను దాటిన రెండవ క్రీడాకారిణిగా అవతరించింది. 2007లో సుజాన్‌ పోల్గార్‌ను మించి 2577 రేటింగ్స్‌తో చదరంగం చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టిం చారు. మార్చిలో వెలువడిన ఎఫ్‌ఐడిఈ రేటింగ్స్‌లో 2589 పాయింట్లతో టాప్‌లో ఉన్నారు. ఆమె అత్యుత్తమ రేటింగ్‌ 2623 పాయింట్లుగా నమోదయ్యింది.

కెరీర్‌ ప్రారంభంలో…
చదరంగం పుట్టింది భారతదేశంలో ..అందులో ఛాంపియన్స్‌ కూడా భారతీయులు కావడం విశేషం. మహిళల విభాగంలో హంపికోనేరు అంతర్జాతీయంగా అనేక సంచనాలను సృష్టిస్తోంది. 2002 నుంచి 2008లో మధ్య కాలంలో పలు అంతర్జాతీయ పోటీలలో విజయం సాధించి పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్ట ర్‌ను సాధించిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకుంది. గ్రాండ్‌ మాస్టర్‌ సాధించే సమయంలో ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అయితే తరువాత ఈ రికార్డును చైనాకు చెందిన హో ఇఫాన్‌ బ్రే్‌ చేసింది.

కీలక విజయాలు>
2001లో బాలికల జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది. 2006లో ప్రపంచ పోటీలో పాల్గొన్నా రెండో రౌండ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2008లో తిరిగి ప్రపంచ పోటీలో పాల్గొని సెమీఫైనల్‌ వరకు వెళ్లింది కానీ హో ఇఫాన్‌ గెలవడంతో వెనక్కుతగ్గాల్సి వచ్చింది. 2009లో ముంబై మయోర్‌ కప్‌లో ప్రసిద్ధ చెస్‌ క్రీడాకారులు అలెగ్జాండర్‌ అరెష్‌కెన్కో, మాగేష్‌ పంచనాథన్‌, ఎవ్‌జెనీ మిరోష్నిచెన్నోకు గట్టి పోటినిచ్చింది హంపి.

వార్తల్లో వ్యక్తిగా…
Unaసాధారణంగా క్రీడలకు మాత్రమే పరిమితమయ్యే హంపి 2009లో భారతీయ చెస్‌ సమాఖ్య (ఎఐసిఎఫ్‌) తనను 37వ చెస్‌ ఒలంపియాడ్‌లో పాల్గొనకుండా అడ్డుకుంటోందన్న ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది. ఆమె చెస్‌లో శిక్షణనిస్తున్న ఆమె తండ్రి కోనేరు అశోక్‌ను ఆమెతో పాటు ప్రయాణిం చేందుకు అనుమ తివ్వడంలేదని కూడా వివరించింది. అప్పట్లో ఈ వివాదం పెను సంచలనం సృష్టించింది. 2009-2011 లో జరిగిన ఎఫ్‌ఐడిఈ మహిళల గ్రాండ్‌ ప్రిక్స్‌లో పాల్గొన్ని రెండో స్థానంతో పోటీనుంచి ముగియాల్సివచ్చింది. అయితే 2011 మహిళల ప్రపంచ ఛాంపి యన్‌ షిప్‌లో పోటీచేసే అర్హత సాధించింది. ఈ పోటీలో హో ఇఫా న్‌ మూడు ఆటలను గెలిచి, ఐదింటిని డ్రాగా చేసుకుని విజయం సాధించింది. ఇటీవలే రష్యాలోని ఖాజన్‌లో జరిగిన ఫిడే మిహ ళల పోటీలో కోనేరు హంపి విజయం సాధించి మరోసారి వార్త ల్లో వ్యక్తిగా నిలిచింది.

అవార్డులు : అర్జున-2003, పద్మశ్రీ-2007,
రాజలక్ష్మి-2008

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top