You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » ఫలాల ఫలితం…

ఫలాల ఫలితం…

ఫలాల ఫలితం…

fruts talangana patrika telangana culture telangana politics telangana cinemaపళ్లను చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.
ఎప్పుడు
భోజననాంతరం పండ్లు తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది.
ఎలా
పండ్ల రసాలకంటే పండును అచ్చంగా అలా తినేయడమే మేలు. అందువల్ల శరీరానికి మేలు చేసే పండ్లలో ఉండే అన్ని సుగుణాలను అందించవచ్చు. ఒక వేళ పండును రసంగా తీసుకోదలచుకున్నపుడు తప్పకుండా తాజాగా తీసిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. రసాన్ని నోటి నిండుగా తీసుకొని అది నోటిలోని లాలాజలంతో కలిసేలా నెమ్మదిగా మింగాలి. నెలలో మూడు రోజులు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటే శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచవచ్చు. వండిన పండ్లు, వేడి చేసిన పండ్ల రసాలు తీసుకోకూడదు. ఎందుకంటే వండిన ఫలాలో పోషకాలు నశిస్తాయి.
ఎందుకు
సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంవూతణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో సింహ భాగాన్ని పండ్లకివ్వండి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top