You Are Here: Home » ఇతర » ఫన్‌ ఫెయిర్ .. భలే హుషార్‌ !

ఫన్‌ ఫెయిర్ .. భలే హుషార్‌ !

p class=”lead1″>

ఉదయం లేచినప్పటినుంచి స్కూలు, చదువు అంటూ గడిపే చిన్నారులు ఆనందంగా గడిపేందుకు భాగ్యన గరంలో ఫన్‌ ఫెరుున్‌ ఏర్పాటైంది. చిన్నారుల ఆటవిడుపుకు కొత్తహంగులు సమకూరుతున్నారుు. వారి అభిరుచులకు అనుగుణంగా కొత్తరకం ఆటవస్తువులు అందుబాటులోకి వస్తున్నారుు. టేస్టీ ఫుడ్గ తింటూ ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు హైదరాబాద్‌ మియాపూర్‌లోని టాకీటౌన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన ఫన్‌ఫెరుుర్‌ ప్రదర్శన సందర్శకులను అలరిస్తోంది. అలాగే క్రిస్‌మస్‌, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న తరుణంలో వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శనలు కూడా పెరుగుతున్నారుు. వీెకండ్గ్సతోపాటు సెలవురోజుల్లో సాయంత్రం సమయంలో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ వీెకండ్గలో మీరూ సరాదాగా గడిపే ఆ వివరాలు ఈవారం ‘స్టైల్‌’లో మీకోసం…’’

IMG254సెలవురోజుల్లో చిన్నారులు సరదాగా తిరగాలని కోరుకుంటారు. ఎవరికి నచ్చిన ప్రదేశాల్లో వారు ఆనందంగా గడపాలని భావిస్తారు. అందుకే సెలవుల్లో బయటకు వెళదా మని తల్లిదండ్రులను పదేపదే అడుగుతుంటారు. ఈ తరుణంలో చిన్నారులు సెలవుల్లో ఎంజాయ్‌ చేసేందుకు పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటవు తున్నాయి. హైదరాబాద్‌ మియాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫన్‌ఫెయిర్‌ సందర్శకులతో కళకళలాడుతోంది. ఈ ఫెయిర్‌లో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఎన్నో రకాల ఆటవస్తువులు ఇందులో ఏర్పాట య్యాయి. యమహారైడ్‌, మారుతీకారు, మినీ జీప్‌, ఇరాన్‌ రైడ్‌, వాటర్‌ కిడ్డి, బ్రేక్‌డాన్స్‌ వంటివి చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

భాగ్యనగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రతిఏటా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్‌లను నిర్వహిస్తున్నట్లు ఫన్‌ఫెయిర్‌ నిర్వాహకులు మహ్మద్‌ రఫిక్‌ బేగ్‌ తెలిపారు. ఇందులో 300పైగా స్టాల్స్‌ ఏర్పాటయ్యాయని, ఈ ప్రదర్శనకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. క్రిస్‌మస్‌, సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో జనవరి 15వ తేదీ వరకు ఈ ప్రదర్శనను ఇక్కడ నిర్వహించనున్నట్లు తెలిపారు.

షాపింగ్‌ కోసం ప్రత్యేక స్టాల్స్‌..
ఫన్‌ఫెయిర్‌లో షాపింగ్‌ చేసేందుకు ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. హోమ్‌క్లీనింగ్‌, ఫ్యాన్సీ టాయ్స్‌, ఎటు జడ్‌ వెరైటీస్‌ వంటి స్టాల్స్‌ ఇందులో ఉన్నాయి. వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏర్పాటయ్యాయి. కలకత్తా హ్యాండీక్రాఫ్ట్‌‌స, త్రిపుర బాంబూ హ్యాండీక్రాఫ్ట్‌‌సను మహిళల కోసం ఏర్పాటు చేశారు. వేసవి సీజన్‌కు తగిన ఎన్నో రకాల కాటన్‌ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉంచారు. బనారస్‌, లక్నో, కళంకారీ చీరలు, జైపూర్‌ కళాకారులు రూపొందించిన ఇమిటేషన్‌ జ్యుయలరీ, ఇరాన్‌, మలేషియాల ఇంటీరియర్‌ స్టాల్స్‌ను ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

బుడుగుల కోసం భలే ఆటలు…
చిన్నారి సిసింద్రీల కోసం ఎన్నో ఆటలు ఇందులో కొలువుతీరాయి. 18 రకాల ప్రత్యేక ఆటలు ఇందులో ప్రత్యేకత. జెయింట్‌ వీల్‌లో సుమారు 40మంది ఒకేసారి కూర్చునే అవకాశం ఉంది. దీనికి టికెట్‌ ధరను రూ.30గా నిర్ణయించారు. అలాగే 62 అడుగుల ఎత్తులో ఉన్న ప్యారాషూట్‌ టవర్‌లో 30మంది వరకు ఎక్కవచ్చు. గిరగిరా తిరుగుతూ పైవరకు వెళ్లి ఇది కిందకు వస్తుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌బీ రైడ్‌, కొలంబస్‌, టైటినిక్‌ , బ్రేక్‌ డాన్స్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఎక్కేందుకు ఒక్కోదానికి రూ.20 నుంచి రూ.30 రూపాయలు వసూలు చేస్తారు.

కొలువుతీరుతున్న హస్తకళలు…
సరదా కోసం కాకుండా హస్తకళా ప్రదర్శనలు కూడా నగరంలో ఏర్పాటువుతున్నాయి. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలతోపాటు పలు రాష్ట్రాల ఉత్పత్తులన్నీ ఒకేచోట లభించేలా సిల్క్‌ ఎక్స్‌పోలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ఎవరికి ఇష్టమైన ఉత్పత్తులను వారు కొనుగోలు చేసుకునే సౌకర్యం కలుగుతోంది. ఫన్‌ఫెయిర్‌ను రూ.20 ఎంట్రీ రుసుముతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తిలకించవచ్చు. ఈ సెలవురోజుల్లో మీకిష్టమైన ఎగ్జిబిషన్‌ను సరదాగా తిలకించేందుకు ప్లాన్‌ చేసుకోండి మరి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top