You Are Here: Home » ఇతర » ప్రేమ ఎంత మథురం..!

ప్రేమ ఎంత మథురం..!

అంటే యువతీయువకులు, ఆలుమగల ప్రేమ అనుకోకండి. ప్రేమ అనేది ఏ ఒక్కరికో సొంతం కాదు. ఒకరినొకరు ప్రేమించుకున్నా, మిగతావాటి మీద కూడా ప్రేమని పెంచుకుంటారు. యువతి, యువకుణ్ణి ప్రేమించాలన్నా ముందు సెల్‌ఫోన్‌ని కూడా ప్రేమించాలి. లేకపోతే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ ప్రాబ్లమ్‌ రావచ్చు కదా..! ముఖం మొత్తిన భర్తని ముహంవాచేలా తిట్టాలంటే ఒక మొబైల్‌ ఉండితీరాలి.

4asఅసలు ప్రేమ సంగతి ఎలా ఉన్నా, నేటి ఆధునిక యువతులకు తమ జీవిత భాగస్వామి కంటే.. తాము వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు, బెడ్‌రూమ్‌ కంప్యూటర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లండన్‌కు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 16 నుంచి 19 యేళ్ళు కలిగిన సుమారు 500 మంది యువతులతో ఈ సర్వేను నిర్వహించారు.ఇందులో మొబైల్స్‌ ఫోన్లు, బెడ్‌రూమ్‌ కంప్యూటర్ల కంటే ఇతర విలువైన వస్తువులేవీ లేవని వారు వెల్లడించారు. అంతే కాకుండా, ఇతరులు తమను, తమ క్యారెక్టర్‌ను ఏ విధంగా అంచనా (జడ్జ్‌) చేస్తారన్న అంశంపై టీనేజ్‌ అమ్మాయిలు మరింత నమ్మకంగా ఉంటారని థింక్‌ థాక్‌ డెమోస్‌ సంస్థ ప్రచురించిన నివేదికలో పేర్కొంది.

అందమైన డ్రెస్‌లు వేస్తారని, అయితే వారు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు పెద్దగా ఆలోచన చేయరని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఈ యువతులంతా షోషల్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా తమ బెడ్‌రూమ్‌లలో ఉండే కంప్యూటర్లు, అత్యంత ఖరీదైన మొబైల్స్‌ ఫోన్లకు మించిన విలువైనది లేదని వారు గట్టిగా నమ్ముతారని సర్వే వెల్లడించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top